ETV Bharat / state

అనురాగ్ యూనివర్సిటీ వ్యవహారంలో చట్ట ప్రకారమే ముందుకెళ్లండి : హైడ్రా అధికారులకు హైకోర్టు ఆదేశం - High Court On Anurag Colleges - HIGH COURT ON ANURAG COLLEGES

High Court On Anurag Colleges : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి‌కి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు చెందిన అనురాగ్ యూనివర్సిటీని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా నాదం చెరువు సమీపంలో నిర్మించారని, దీనిని కూల్చి వేసేందుకు హైడ్రా సిద్ధమవుతోందంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది.

High Court On Anurag Colleges
Anurag University Demolition Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 7:20 AM IST

Anurag University Demolition Issue : అనురాగ్ యూనివర్సిటీ వ్యవహారంలో చట్టప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా అధికారులను హైకోర్టు ఆదేశించింది. ప్రతి పత్రాన్ని అందజేసి వివరణ తీసుకుని చర్యలు చేపట్టాలని తెలిపింది. మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కొర్రెముల గ్రామంలోని నాదం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్​జోన్​లో ఉన్న గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీలకు చెందిన నిర్మాణాల తొలగింపుపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలంటూ అధికారులకు హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆక్రమణల నిర్ధారణ నిమిత్తం ఆధారపడే అన్ని పత్రాలను పిటిషనర్లకు అందజేయాలని, వాటిపై వివరణ తీసుకున్నాకే ముందుకెళ్లాలని ఆదేశించింది.

బఫర్ జోన్​లోనే నిర్మాణాలు చేపట్టారు : ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణల పేరుతో కూల్చివేత చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్​లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ టి.వినోద్ కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి చెరువుకు సంబంధించిన సర్వే మ్యాప్​ను అందజేశారు. 1951-54 కాస్రా పహాణీ ప్రకారం 61 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉందన్నారు. చెరువు నుంచి 30 మీటర్ల మేర బఫర్ ​జోన్ ఉంటుందన్నారు. దీని ప్రకారం బఫర్ జోన్​లోనే నిర్మాణాలు చేపట్టారన్నారు. పిటిషనర్లు ఇదే అభ్యర్థనతో గత వారం పిటిషన్ దాఖలు చేశారని, ఇప్పుడు మళ్లీ అనవసర ఆందోళనతో మరో పిటిషన్ దాఖలు చేశారన్నారు. చట్టప్రకారమే ముందుకెళతామని, ఆక్రమణల నిర్ధారణకు సంబంధించిన పత్రాలను పిటిషనర్లకు అందజేసి వివరణ తీసుకున్నాకే చర్యలు చేపడతామన్నారు.

ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎప్పుడో 1970 వాటి సర్వేలపై ఆధారపడటం కంటే, సర్వే ఆఫ్ ఇండియా ఎస్ఆర్​ఏసీల మ్యాప్​లను తీసుకుని వాటి ఆధారంగా చెరువు విస్తీర్ణాన్ని నిర్ధారిస్తే విశ్వసనీయత ఉంటుంది కదా అని ప్రశ్నించారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పత్రాలు ఇచ్చిన తర్వాత వాటిని పరిశీలించి వివరణ ఇవ్వడానికి కనీసం ఒక వారం అయినా గడువు ఇచ్చేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ తాము చట్ట ప్రకారం ముందుకెళతామని, అయితే పిటిషనర్లు కూడా ఎలాంటి నిర్మాణాలు కొనసాగించకుండా చూడాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి, అన్ని పత్రాలను పిటిషనర్లకు ఇచ్చి వివరణ తీసుకుని చట్టప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీని రికార్డు చేసి, పిటిషన్​పై విచారణను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

'నిబంధనలు అతిక్రమిస్తే అనురాగ్​ యూనివర్సిటీ నిర్మాణాలు తొలగించండి' - పల్లాకు హైకోర్టు షాక్ - Telangana HC on Anurag University

బఫర్​జోన్​లో అనురాగ్ కాలేజీల నిర్మాణం - పల్లా రాజేశ్వర్​రెడ్డిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.