ETV Bharat / state

మాజీ ఎంపీ ఎంవీవీకి ఎదురుదెబ్బ- మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు - High Court on YSRCP Ex MP MVV Case - HIGH COURT ON YSRCP EX MP MVV CASE

High Court on YSRCP Former MP MVV Case: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసును కొట్టేయాలని హైకోర్టులో ఎంవీవీ సత్యనారాయణ క్వాష్ పిటిషన్ వేశారు. అయితే కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది.

High Court on YSRCP Former MP MVV Case
High Court on YSRCP Former MP MVV Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 10:30 PM IST

Updated : Jun 25, 2024, 10:47 PM IST

High Court on YSRCP Former MP MVV Case: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురైంది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదైంది. కేసును కొట్టేయాలని ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనివై విచారించిన హైకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. అదే విధంగా పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు.

Case Filed On MVV Satyanarayana: కాగా ఎంఓయూ పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్‌స్ట్రక్షన్‌ అధినేత జగదీశ్వరుడు కొద్ది రోజుల క్రితం ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హయగ్రీవ భూముల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే హయగ్రీవ భూముల వ్యవహారంలో తనను బెదిరించి సంతకాలు సేకరించారంటూ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెక్షన్ 120, 420, 34 ఐపీసీలతో సహా పలు సెక్షన్ల పై 10కి పైగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టినట్లు పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై ఈనెల 22వ తేదీన కేసు నమోదైంది. ఎంవీవీతో పాటు ఆయన ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్‌ గద్దె బ్రహ్మాజీపై కూడా విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎంవీవీ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. సివిల్‌ వివాదాన్ని క్రిమినల్‌ కేసుగా మార్చడానికి వీల్లేదన్నారు. ఈ వ్యవహారంలో క్రిమినల్‌ కేసు నమోదు చెల్లదన్నారు. అరెస్టు నుంచి పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని కోరారు. ఈ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టంచేశారు.

Complaint on MVV Satyanarayana: మరోవైపు ఎంవీవీ సత్యనారాయణ ఆయన సన్నిహితులపై విశాఖ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు జనసేన నేత పీతల మూర్తి యాదవ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన హయగ్రీవా భూములను మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన సన్నిహితులు జీవీ, గద్దె బ్రహ్మాజీలు లాకోవడాన్ని ఖండించారు. విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ చేసిన అరాచకాలపై విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారం చేతిలో పెట్టుకుని ఈ భూ దందా చేశారని హయగ్రీవా భూముల మీద హైకోర్టులో పోరాడుతున్న జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు.

'బెదిరించి భూములు లాక్కున్నారు'- మాజీ ఎంపీ ఎంవీవీపై కేసు - CASE FILED ON MVV

రెండు వారాల్లో విశాఖ జీవీఎంసీ కమిషనర్‌కు వివరణ ఇవ్వాలి: ఏపీ హైకోర్టు

Last Updated : Jun 25, 2024, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.