High Court Adjourned Ramgopalvarma Petition: రాష్ట్రంలో పలు చోట్ల తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. వివరాలు సమర్పించాలని పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, ఫొటో మార్ఫింగ్ పోస్టులు చేశారంటూ వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
"ఎందుకింత ఆలస్యం?" - జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ - దిల్లీ పర్యటన సహా పలు అంశాలపై చర్చ