HERO AKHIL AKKINENI AT TIRUMALA : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, సినీ నటుడు అక్కినేని అఖిల్ శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి అభిషేక సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని వేరు వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - దర్శించుకున్న నటి రాధిక
కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు