ETV Bharat / state

ఈ ట్రాఫిక్​ ఏంటి బాబో..య్!​ - హైదరాబాద్​లో చుక్కలు చూస్తున్న వాహనదారులు - hyderabad traffic issues - HYDERABAD TRAFFIC ISSUES

Traffic Problems in Hyderabad : హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల వినియోగం కూడా పెరగడంతో నగరంలో ట్రాఫిక్​ అతి పెద్ద సమస్యగా మారింది. మరి ఈ ట్రాఫిక్​ రద్దీకి నివారణ మార్గాలను ట్రాఫిక్​ పోలీసులు అన్వేషిస్తున్నారా లేదా అసలు నగరంలో ట్రాఫిక్​ సమస్యలకు కారణమేంటి?

Traffic Problems in Hyderabad
Traffic Problems in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:33 AM IST

Heavy Traffic in Hyderabad City : అత్యవసరమని కారు లేదా బైక్​తో రోడెక్కితే చాలు ట్రాఫిక్​. ఆ ట్రాఫిక్​లో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. ట్రాఫిక్​కు పగలు, రాత్రి అనే తేడానే లేదు. ఇలా ట్రాఫిక్​ ఉన్నప్పుడు అక్కడ పోలీసు అనేవాడు కనిపించడు. ఈ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పుడు ఈ సమస్య హైదరాబాద్​ మహానగరంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫీసుకు వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూల్​, కళాశాలకు వెళ్లాలన్నా ట్రాఫిక్​ ఇబ్బందులను చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది.

ఎన్నికలకు ముందు ఉన్న ట్రాఫిక్​ అదనపు సీపీ విశ్వప్రసాద్ ఎన్నికల కోడ్​​ సమయంలో బదిలీ అయ్యారు. ఇన్​ఛార్జిపై అదనపు భారం పడటంతో పర్యవేక్షణ భారంగా మారింది. కీలకమైన ఈ పోస్టు మూడు నెలల నుంచి ఖాళీగానే ఉంది. మారుతున్న అవసరాలకు తగినట్లుగా ట్రాఫిక్​ పోలీసు సిబ్బందిని పెంచకపోవడంతో ట్రాఫిక్​ క్రమబద్ధీకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది.

నగరంలో 25 లక్షలు పైనే వాహనాలు : గతంలో గ్రేటర్​ పరిధిలో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 20 శాతం పెరిగినట్లు ట్రాఫిక్​ పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపు అయింది. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్​, కాలేజీ బస్సులు రోడ్లపైకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంకా వాహన రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖుల వాహనాలు, ప్రొటోకాల్​ అని చెప్పి తరచూ ట్రాఫిక్​ను నిలిపి వేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేటు వాహనాలు : ప్రైవేటు బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. ఇలా గతంలో నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. ప్రైవేటు వాహనదారులు చలాన్లు వేయడం వల్ల పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలోనే మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సుమారు 40 లక్షల కేసులు నమోదు చేశారు.

రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలుపుదల : ట్రాఫిక్​కు ప్రధాన సమస్యగా రోడ్లపై ఇరువైపులా వాహనాలు నిలపటమే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, నగరంలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. కీలకమైన ఎల్బీనగర్​, ఉప్పల్, నాగోల్​, దిల్​సుఖ్​నగర్​, అబిడ్స్​, తార్నాక, నారాయణగూడ, బంజారాహిల్స్​, చాదర్​ఘాట్​, సికింద్రాబాద్​, జూబ్లీహిల్స్​, గచ్చిబౌలి, మాదాపూర్​, మియాపూర్​, కూకట్​పల్లి మార్గాల్లో వేలాది వాహనాలు రోడ్లుకు ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు.

రోజుకు సగటున 20 వాహనాలు మొరాయింపు : నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ సగటున 20 వాహనాలు ఇంధనం లేక, మరమ్మతులకు గురై మొరాయింపునకు గురవుతున్నాయి. ఒకవేళ రద్దీ ప్రాంతాలు, పై వంతెనలపై వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్​ సిబ్బందికి సుమారు 1 గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది వాటిని తొలగించడానికి. ఈ సమస్యలతో పాటు చీకటి పడితే చాలు వచ్చే సమస్యగా ప్రైవేటు బస్సులు తయారయ్యాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ప్రయాణికులను తీసుకెళ్లే ఈ బస్సులు మియాపూర్​, కేవీహెచ్​బీ, ఎస్సార్​నగర్​, లక్డీకాపూల్​, అమీర్​పేట, అబిడ్స్​, కాచిగూడ, అత్తాపూర్​, ఉప్పల్​, దిల్​సుఖ్​నగర్​, ఎల్బీనగర్​, మెహిదీపట్నం, వనస్థలిపురం ప్రాంతాల్లో గంటల తరబడి నిలపడం వల్ల ట్రాఫిక్​ సమస్య తీవ్రం అవుతుంది.

హిమాయత్​నగర్ లిబర్టీ కూడలి వద్ద పాము కలకలం - గంటపాటు ట్రాఫిక్​కు అంతరాయం - Snake on Current Wire at Himayat Nagar

మైనర్ బైక్ నడుపుతుంటే ఏం చేస్తున్నారు? - నెటిజన్​ పోస్టుకు దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చిన పోలీసులు - HYD POLICE ON MINORS BIKE DRIVING

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.