ETV Bharat / state

హైదరాబాద్​లో దంచికొట్టిన భారీ వర్షం - ఖైరతాబాద్​లో అత్యధిక వర్షపాతం - heavy rains in telangana and hyd - HEAVY RAINS IN TELANGANA AND HYD

Heavy Rain in Hyderabad : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్​లో వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 7:58 PM IST

Updated : Sep 21, 2024, 11:05 PM IST

Heavy Rains Lash in Telangana : హైదరాబాద్ మహానగరంలో ఈ సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నగర పౌరులను అతలాకుతలం చేసింది. వరద నీటితో ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులు, కాలువలను తలపించాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాత్రి 8:30 గంటల వరకు కురిసిన వర్షానికి అత్యధికంగా ఖైరతాబాద్​లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గోల్కొండలో 7.3 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్​లో 7.1, మెహదీపట్నంలో 6.4, సికింద్రాబాద్​లో 5.8, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో జీహెచ్ ఎంసీ, డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఆ నీటిని నాలాల్లోకి మళ్లించాయి. బేగంపేట వద్ద ప్రధాన రహదారిపై వరద నీటితో వాహనాలు నిలిచిపోగా ఆ సమయంలో అక్కడే ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్వయంగా వాహనం దిగి వరద నీటిలో నడుచుకుంటూ వాహనాలను క్రమబద్దీకరించారు. RFO, DFO, DRF సిబ్బందికి సూచనలు చేస్తూ వరద నీరు నిలువకుండా అప్రమత్తం చేశారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో ఇళ్లకు వెళ్లే సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పలు ప్రాంతాల్లో వర్షం : నగరంలోని సికింద్రాబాద్​, తార్నాక, ఓయూ క్యాంపస్​, లాలాపేట్​ ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే హయత్ నగర్, దిల్​సుఖ్ నగర్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్​, ఉప్పల్​, రామంతాపూర్​, బోడుప్పల్​, పీర్జాదిగూడ, మేడిపల్లి, చిలుకానగర్​, కోఠి, అబిడ్స్​, బేగంబజార్​, నాంపల్లి, బషీర్​బాగ్​, లక్డీకాపూల్, పంజాగుట్ట​ ప్రాంతాల్లో భారీ వర్షమే పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. వాహనదారులు వర్షపు నీటితో ఇబ్బందులు పడ్డారు.

అలాగే ముషీరాబాద్​, చిక్కడపల్లి, బాగ్​లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్​ రోడ్ అడిక్​మెట్​, రాంనగర్​, గాంధీనగర్​, జవహర్​నగర్​, కవాడీ గూడ, దోమలగూడ, బోలకపూర్​, చంపాపేట్, సైదాబాద్​, సరూర్​ నగర్​, చైతన్యపురి, మలక్​పేట్, ఖైరతాబాద్​​ తదితర ప్రాంతాల్లో భారీగానే వర్షం పడి స్థానికులు ఇబ్బంది పడ్డారు. శుక్రవారం రాత్రి కూడా హైదరాబాద్​, సికింద్రాబాద్​ వ్యాప్తంగా విస్తారంగా వర్షం పడి రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని ఇళ్లల్లోకి సైతం నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. రాత్రి పడుకునే సమయంలో వర్షం కురవడంతో పనులు నిమిత్తం బయటకు వెళ్లినవాళ్లు పూర్తిగా వర్షానికి తడిసిపోయారు.

మెట్​పల్లిలో భారీ వర్షం : మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో సుమారు అరగంట పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం కురియడంతో మురుగు కాలువలు నిండి పొంగిపొర్లాయి. రోడ్లపై వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.

హుజూర్​నగర్​ నియోజకవర్గంలో భారీ శబ్దాలతో ఉరుములు : సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షానికి రహదారులపైన వరద నీరు పారింది. భారీ శబ్దాలకు ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోగా విద్యుత్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోనూ రేపు కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం - రోడ్లపై పారుతున్న వరద నీరు - Heavy Rain in Hyderabad

హైదరాబాద్‌లోని మళ్లీ వర్షం - ప్రధాన ప్రాంతాల్లో దంచి కొడుతున్న వాన - Heavy Rainfall in Hyderabad

Last Updated : Sep 21, 2024, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.