ETV Bharat / state

LIVE UPDATES : రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్​రెడ్డి - telangana rains live updates - TELANGANA RAINS LIVE UPDATES

Heavy Rains
Heavy Rains in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 7:19 AM IST

Updated : Sep 2, 2024, 10:37 PM IST

Heavy Rains in Telangana : వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోతకు 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వరదతో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహించగా, గ్రామాలతో పాటు లోతట్టు కాలనీల్లోని ఇళ్లను నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తగా, జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో గడపాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు మహోగ్రరూపం దాల్చింది. జోరు వానకు ఊర్లు, ఏర్లు ఏకమయ్యాయి. పలుచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన జోరు వానకు మొత్తం 15 మంది మృత్యువాతపడగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

LIVE FEED

10:35 PM, 2 Sep 2024 (IST)

చిక్కుకున్న 9 మంది మత్స్యకారులు - వారిలో ఇద్దరు చిన్నారులు

  • నాగర్‌కర్నూల్: డిండి వాగులో చేపల వేటకు వెళ్లి చిక్కుకున్న మత్స్యకారులు
  • చిక్కుకున్న 9 మంది మత్స్యకారులు, వారిలో ఇద్దరు చిన్నారులు
    ఆహార పొట్లాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్న అచ్చంపేట పోలీసులు
  • ఉన్నతాధికారులకు సమాచారం అందజేసిన పోలీసులు
    బాధితులు డిండి మం. గోనబోయినపల్లి గ్రామం వారిగా గుర్తింపు

10:34 PM, 2 Sep 2024 (IST)

వాగు మధ్యలో చిక్కుకున్న 10 మంది

  • నల్గొండ: డిండి మండలం గోనబోయినపల్లి వద్ద చిక్కుపోయిన గ్రామస్థులు
    గోనబోయినపల్లి వద్ద వాగు మధ్యలో చిక్కుకున్న 10 మంది వ్యక్తులు

10:34 PM, 2 Sep 2024 (IST)

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

  • రేపు మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
    మహబూబాబాద్: అకేరువాగు వంతెన సందర్శించనున్న సీఎం
    రేపు నెల్లికుదురు మం. రావిరాల గ్రామాన్ని సందర్శించనున్న సీఎం

7:57 PM, 2 Sep 2024 (IST)

కేంద్ర బలగాల కోసం చూడకూడదు : సీఎం రేవంత్​

సీఎం రేవంత్​రెడ్డి

  • అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర బలగాల కోసం చూడకూడదు
  • ఎన్డీఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్‌ను బలోపేతం చేస్తాం
  • బీఆర్‌ఎస్‌ అనుకూల మీడియా సహాయచర్యలపై తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తప్పవు

7:56 PM, 2 Sep 2024 (IST)

ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

సీఎం రేవంత్​రెడ్డి

  • పంటనష్టం వివరాలు సేకరిస్తున్నాం పరిహారం ప్రకటిస్తాం..
  • నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తాం
  • వరద బాధిత కుటుంబాలకు తక్షణం రూ.10 వేలు ఇస్తున్నాం
  • దెబ్బతిన్న జిల్లాలకు కలెక్టర్లు రూ.5 కోట్ల వరకు ఇవ్వవచ్చు
  • విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు బృందాలు ఏర్పాటు చేస్తాం
  • రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలను ఉంచుతాం
  • అన్ని శాఖల అధికారుల సెలవులు రద్దు చేశాం
  • ఎక్కడైనా సాయం అందకపోతే వెంటనే అధికారులకు చెప్పాలి
  • ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేస్తాం

7:38 PM, 2 Sep 2024 (IST)

ఎన్టీఆర్ జిల్లాలో గరికపాడు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి

  • ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి
    ఎన్‌హెచ్-65పై నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిన రాకపోకలు
    పాలేరు వాగు ఉద్ధృతి తగ్గాక రోడ్డు మరమ్మతు చేస్తామన్న అధికారులు
    ఏపీ-తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
    ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
    అత్యవసరంగా వెళ్లేవారిని రోడ్డు దాటిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • అత్యవసరమైతే నల్లబండగూడెం మీదుగా జగ్గయ్యపేట వరకు అనుమతి
  • నల్లబండగూడెం, గరికపాడు వద్ద నిలిచిన వాహనాలను పంపిన పోలీసులు
    హైదరాబాద్-విజయవాడ మధ్య కోదాడ మీదుగా రాకపోకలు నిలిపివేత
  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
  • నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా మళ్లింపు
    విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
  • గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లింపు

7:08 PM, 2 Sep 2024 (IST)

ప్రాణ నష్ట నివారణ చర్యలు తీసుకున్నాం: భట్టి

  • నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంతటి వరద చూడలేదు: భట్టి
    వర్షాలు, వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రాణ నష్ట నివారణ చర్యలు తీసుకున్నాం: భట్టి

7:07 PM, 2 Sep 2024 (IST)

నీటిపారుదల శాఖ తక్షణమే పనులు ప్రారంభిస్తుంది : ఉత్తమ్

ఉత్తమ్

  • ఖమ్మం జిల్లాలో అసాధారణ పరిస్థితి ఎదురైంది
  • భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీ నష్టం
  • నీటిపారుదల శాఖ తక్షణమే పనులు ప్రారంభిస్తుంది

6:06 PM, 2 Sep 2024 (IST)

70 ఏళ్లలో 40 సెం.మీ. వర్షాన్ని చూడలేదు : రేవంత్​రెడ్డి

సీఎం రేవంత్​రెడ్డి

  • చాలా బాధాకరమైన సందర్భం
  • వరద మీ బతుకుల్లో విషాదాన్ని తెచ్చిపెట్టింది
  • మంత్రులు, అధికారులు నిరంతరం మీకోసం కష్టపడుతున్నారు
  • మంత్రి పొంగులేటి నిద్ర లేకుండా సమీక్షిస్తున్నారు
  • రీటైనింగ్‌వాల్‌తో వరదను నిలువరించవచ్చని నిర్మాణాన్ని ప్రారంభించాం
  • రీటైనింగ్‌వాల్‌ పూర్తి కాకముందే వరదలు వచ్చాయి
  • 70 ఏళ్లలో 40 సెం.మీ. వర్షాన్ని చూడలేదు

5:03 PM, 2 Sep 2024 (IST)

వరదల కారణంగా 481 రైళ్లు రద్దు

  • వర్షాలు, వరదలతో 481 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
    13 రైళ్లు పాక్షికంగా రద్దు: దక్షిణ మధ్య రైల్వే
    152 రైళ్లు దారి మళ్లింపు: దక్షిణ మధ్య రైల్వే

4:52 PM, 2 Sep 2024 (IST)

పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌

  • ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
    పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
    వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన సీఎం
  • ఖమ్మం: నాయకనిగూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్డు పరిశీలించిన సీఎం
  • ఖమ్మం: పాలేరు ఏరును పరిశీలించిన సీఎం, మంత్రులు
  • ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలిస్తున్న సీఎం
  • రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్‌ రెడ్డి
  • సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల
  • సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి, కోమటిరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి

4:36 PM, 2 Sep 2024 (IST)

పాలేరు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • ఖమ్మం పాలేరు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించనున్న సీఎం

  • రాత్రి ఖమ్మంలో బస చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
  • రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

4:18 PM, 2 Sep 2024 (IST)

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్‌

  • ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్‌ రెడ్డి

  • మార్గమధ్యలో కోదాడలో వరద ప్రాంతాలు పరిశీలించనున్న సీఎం
  • వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

4:04 PM, 2 Sep 2024 (IST)

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె వాగు

  • నిజామాబాద్: సిరికొండ-కొండూరు మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె వాగు
  • నిజామాబాద్: ఒర్రె వాగు ఉద్ధృతితో నిలిచిపోయిన రాకపోకలు
    వాగు దాటుతూ కొట్టుకుపోయిన బైక్‌, ఈదుతూ బయటకు వచ్చిన వ్యక్తి

3:54 PM, 2 Sep 2024 (IST)

సూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా రూ.5 కోట్లు : సీఎం రేవంత్

  • సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురంలో సీఎం సమీక్ష
  • సూర్యాపేట జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
    సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై సీఎం ఆరా
  • సూర్యాపేట జిల్లాలో 30 సెం.మీ. అతి భారీ వర్షం పడింది: సీఎం
    అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు: సీఎం
    పంట, ఆస్తి నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు: సీఎం
    రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా: సీఎం
    కేంద్రం తక్షణమే రాష్ట్రానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి: సీఎం
    కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలి: సీఎం
  • జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధానిని ఆహ్వానించాం: సీఎం
  • వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: సీఎం
    వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు: సీఎం
    సూర్యాపేట కలెక్టర్‌కు తక్షణ సాయంగా రూ.5 కోట్లు: సీఎం
    మంత్రులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ఉంచాం: సీఎం
    ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం: సీఎం
  • ఖమ్మం, నల్లగొండ పరిస్థితి ప్రధాని, హోంమంత్రికి వివరించాను: సీఎం
  • మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా సమీక్ష చేస్తున్నా: సీఎం
    సొంతంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించుకుంటున్నాం: సీఎం
    వరదల సమయంలో బురద రాజకీయాలు వద్దు: సీఎం

3:42 PM, 2 Sep 2024 (IST)

పలు రైళ్లు రద్దు

  • సికింద్రాబాద్-సిర్‌పూర్ కాగజ్‌నగర్ రైలు రద్దు
  • సికింద్రాబాద్ - షాలిమర్, ఎస్ఎంవీటీ బెంగళూరు - హావ్‌డా రైళ్లు రద్దు
  • కడప - విశాఖ, భువనేశ్వర్ - కేఎస్ఆర్ బెంగళూరు రైళ్లు రద్దు

3:37 PM, 2 Sep 2024 (IST)

పార్వతి బ్యారేజ్‌కు పోటెత్తుతున్న వరద

  • పెద్దపల్లి జిల్లా: పార్వతి బ్యారేజ్‌కు పోటెత్తుతున్న వరద
    పార్వతి బ్యారేజ్‌ 74 గేట్లు ఎత్తిన అధికారులు
    పార్వతి బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6,37,749 క్యూసెక్కులు
    మంథని వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
    మంథని వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన అధికారులు

3:31 PM, 2 Sep 2024 (IST)

ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రూ.5 లక్షల విరాళం : వెంకయ్యనాయుడు

  • రెండు రాష్ట్రాల్లో వరద పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయి: వెంకయ్యనాయుడు
  • ప్రధానికి ఫోన్‌ చేసి వరద పరిస్థితిని వివరించా: వెంకయ్యనాయుడు
  • తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశా: వెంకయ్యనాయుడు
    రెండు రాష్ట్రాల సీఎంలతో ఇప్పటికే మాట్లాడానని ప్రధాని చెప్పారు: వెంకయ్యనాయుడు
    సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు: వెంకయ్యనాయుడు
    ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రూ.5 లక్షల విరాళం: వెంకయ్యనాయుడు
    నా కుమారుడు, కుమార్తె విడివిడిగా చెరో రూ.2.5 లక్షల అందజేశారు: వెంకయ్యనాయుడు

3:14 PM, 2 Sep 2024 (IST)

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

  • ఖమ్మం: ముదిగొండ మం. గోకినపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
  • వర్షాలకు నష్టపోయిన పంటలను, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన భట్టి

3:07 PM, 2 Sep 2024 (IST)

నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: శ్రీధర్‌బాబు

  • వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలపై అధికారులతో రివ్యూ చేశాం: శ్రీధర్‌బాబు
    8 జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడింది: మంత్రి శ్రీధర్‌బాబు
    వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటాం: శ్రీధర్‌బాబు
  • నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: శ్రీధర్‌బాబు
    అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావోద్దు: శ్రీధర్‌బాబు
  • అధికారులందరూ ఫీల్డ్‌లో ఉండి పరిస్థితులను సమీక్షించాలి: శ్రీధర్‌బాబు
    విద్యుత్తు, రహదారులు, రోడ్డులను వెంటనే పునర్దించాలని కోరాం: శ్రీధర్‌బాబు
    రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్‌ బృందాన్ని ఏర్పాటు చేస్తాం: శ్రీధర్‌బాబు
  • పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయం: శ్రీధర్‌బాబు
  • ప్రతిపక్ష నేతలు కూడా సహాయచర్యల్లో పాల్గొనాలి: శ్రీధర్‌బాబు
  • వర్షాలతో ఇప్పటివరకు 16 మంది చనిపోయినట్టు రిపోర్టు వచ్చింది: శ్రీధర్‌బాబు

3:01 PM, 2 Sep 2024 (IST)

సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్​

  • సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురం చేరుకున్న సీఎం
  • ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తూ సూర్యాపేటలో ఆగిన సీఎం
  • వరద నష్టంపై సూర్యాపేట జిల్లా అధికారులతో సీఎం సమీక్ష
  • సమీక్షకు హాజరైన మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి

2:44 PM, 2 Sep 2024 (IST)

మెదక్ జిల్లాలో పాక్షికంగా దెబ్బతిన్న 223 ఇళ్లు

  • మెదక్ జిల్లాలో వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 223 ఇళ్లు
  • మెదక్‌: హవేలీ ఘనపూర్‌లో 105 ఎకరాల్లో దెబ్బతిన్న పంట
    బూరుగుపల్లిలో 35 ఎకరాలు, రాజ్‌పల్లిలో 25 ఎకరాల్లో పంట నష్టం

2:43 PM, 2 Sep 2024 (IST)

పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన

  • రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
  • ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్ష సూచన
  • నిజామాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్ష సూచన
  • మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
    భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
    మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
  • రానున్న 12 గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం
    హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

2:43 PM, 2 Sep 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా 570 బస్సులు రద్దు

  • వర్షాలు, వరదల దృష్ట్యా భారీగా బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ
    రాష్ట్రవ్యాప్తంగా 570 బస్సులను రద్దు చేసిన ఆర్టీసీ
    ఖమ్మం, విజయవాడ, మహబూబ్‌బాద్ వెళ్లే బస్సులు రద్దు
  • వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్లీ బస్సులు నడపనున్న ఆర్టీసీ
  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు గుంటూరు మీదుగా మళ్లింపు
    ఖమ్మం జిల్లాకు యధావిధిగా బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
    వికారాబాద్‌లో 212 బస్సులకు 50 నడుపుతున్న ఆర్టీసీ

2:42 PM, 2 Sep 2024 (IST)

హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు

  • ఎన్టీఆర్‌ జిల్లా గరికపాడు వద్ద తెగిపోయిన వంతెన
  • హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
  • నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన రాకపోకలు
  • పాలేరు వాగు ఉద్ధృతి కారణంగా కోతకు గురైన రహదారి
  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాల మళ్లింపు
  • రహదారి మరమ్మతులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల భేటీ
    కోతకు గురైన రహదారిని పరిశీలించిన ఇంజినీరింగ్ అధికారులు
  • వంతెనను పరిశీలించిన ఎన్‌హెచ్ సిబ్బంది, ఆర్‌ అండ్‌ బీ అధికారులు
    ఇప్పటికే రహదారిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    పాలేరు వాగు ఉద్ధృతి తగ్గాక సహాయ చర్యలకు సిద్ధమైన అధికారులు

2:41 PM, 2 Sep 2024 (IST)

వరదలపై ఎక్స్‌ వేదికగా స్పందించిన రాహుల్‌గాంధీ

  • తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలపై ఎక్స్‌ వేదికగా స్పందించిన రాహుల్‌గాంధీ
    వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్‌
    వరద సహాయక చర్యల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి: రాహుల్‌
    రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోంది: రాహుల్‌
    విపత్తులో నష్టపోయిన వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి: రాహుల్‌

2:40 PM, 2 Sep 2024 (IST)

పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

  • ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
  • మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
    రానున్న 12 గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం
    ఇవాళ హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

2:38 PM, 2 Sep 2024 (IST)

మోకిలలో రహదారులు జలమయం

  • రంగారెడ్డి: శంకర్‌పల్లి మోకిలలోని గేటెడ్‌ కమ్యూనిటీలోకి వరద
  • రెండ్రోజులుగా భారీ వర్షాలకు గేటెడ్ కమ్యూనిటీలోకి వరద నీరు
  • వరదల కారణంగా మోకిలలో రహదారులు జలమయం
  • రంగారెడ్డి: వరదల వల్ల అలుగు పారుతున్న నల్లగండ్ల చెరువు

2:15 PM, 2 Sep 2024 (IST)

రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం రేవంత్‌

2:09 PM, 2 Sep 2024 (IST)

  • రాష్ట్రవ్యాప్తంగా 570 బస్సులను రద్దు చేసిన ఆర్టీసీ
  • ఖమ్మం, విజయవాడ, మహబూబ్‌బాద్ వెళ్లే బస్సులు రద్దు

  • ఖమ్మం జిల్లాకు యధావిధిగా బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
  • వికారాబాద్‌లో 212 బస్సులకు 50 నడుపుతున్న ఆర్టీసీ

2:04 PM, 2 Sep 2024 (IST)

1:40 PM, 2 Sep 2024 (IST)

ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

  • మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • రానున్న 12గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం
  • ఇవాళ హైదారాబాద్‌ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం

1:32 PM, 2 Sep 2024 (IST)

ఏపీ, తెలంగాణలో వరదలు, వర్షాలపై ఎక్స్‌లో స్పందించిన రాహుల్‌గాంధీ

  • ఏపీ, తెలంగాణలో వరదలు, వర్షాలపై ఎక్స్‌లో స్పందించిన రాహుల్‌గాంధీ
  • తెలుగు రాష్ట్రాల్లో వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు రాహుల్‌ ప్రగాఢ సానుభూతి
  • వరదల దృష్ట్యా సహాయక చర్యల్లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి: రాహుల్‌
  • సహాయక చర్యల్లో రాష్ట్రప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది: రాహుల్‌
  • ఈ విపత్తులో నష్టపోయిన బాధితులకు అన్ని రకాలుగా ఆదుకోవాలి: రాహుల్‌
  • బాధితులను ఆదుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను: రాహుల్‌

1:07 PM, 2 Sep 2024 (IST)

12:42 PM, 2 Sep 2024 (IST)

ఖమ్మం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

  • ఖమ్మం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
  • రోడ్డు మార్గం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పయనం
  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష ముగించుకుని
  • రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

12:21 PM, 2 Sep 2024 (IST)

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా కమిషనర్లు చూడాలి: సీఎం

  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా కమిషనర్లు చూడాలి: సీఎం
  • వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలి: సీఎం
  • విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సీఎం

12:17 PM, 2 Sep 2024 (IST)

హనుమకొండ-సిద్దిపేట మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు

  • కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు ఉద్ధృతి
  • వాగు ఉద్ధృతికి కోతకు గురైన హనుమకొండ-సిద్దిపేట మార్గంలో లోలెవల్ వంతెన
  • హనుమకొండ-సిద్దిపేట మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు

12:13 PM, 2 Sep 2024 (IST)

సూర్యాపేట మేళ్లచెరువు మం. కందిబండ వద్ద కూలిన వంతెన

  • సూర్యాపేట మేళ్లచెరువు మం. కందిబండ వద్ద కూలిన వంతెన
  • కందిబండ చెరువుకు గండి పడటంతో కోతకు గురై కూలిన వంతెన
  • సూర్యాపేట: కోదాడ-మేళ్లచెరువు మధ్య నిలిచిన రాకపోకలు

11:53 AM, 2 Sep 2024 (IST)

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం రూ.5 లక్షలకు పెంపు

  • వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
  • భారీ వర్షాలు ఉన్నచోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
  • జిల్లాల్లోని కలెక్టరేట్‌లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి: సీఎం
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలి: సీఎం
  • 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలి: సీఎం
  • భారీ వర్షాల వేళ అత్యవసర సేవల కోసం శిక్షణ ఇవ్వాలి: సీఎం
  • వరదల వల్ల చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం: సీఎం
  • మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం రూ.5 లక్షలకు పెంపు: సీఎం
  • ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలి: సీఎం

11:46 AM, 2 Sep 2024 (IST)

సాగర్ ఎడమ కాలువ గండి ప్రదేశాన్ని పరిశీలించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేటలో నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువ గండి ప్రదేశాన్ని పరిశీలించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

11:43 AM, 2 Sep 2024 (IST)

బైకు పైనుంచి కిందపడటంతో మంత్రి పొంగులేటి కాలికి గాయం

  • బైకు పైనుంచి కిందపడటంతో మంత్రి పొంగులేటి కాలికి గాయం
  • వరద ప్రాంతాల్లో బైకుపై ప్రయాణించిన మంత్రి పొంగులేటి

11:35 AM, 2 Sep 2024 (IST)

ఖమ్మం వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

  • ఖమ్మం వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

  • ఖమ్మం గ్రామీణ మండలం మున్నేరు వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన
  • ఖమ్మం పెద్దతండా, సాయికృష్ణనగర్‌, నాయుడుపేటలో మంత్రి పర్యటన
  • ఖమ్మం జలగం నగర్‌, ఆర్టీసీ కాలనీల్లో మంత్రి పొంగులేటి పర్యటన
  • తమవైపు ఎవరూ రాలేదని మంత్రి ఎదుట కన్నీరుమున్నీరైన సాయికృష్ణనగర్‌ మహిళలు
  • రెండ్రోజులుగా వరదల్లో మగ్గినా అధికారులు రాలేదన్న బాధితులు
  • వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ
  • వరద సహాయక చర్యల్లో అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు

11:19 AM, 2 Sep 2024 (IST)

  • వర్షాలు, వరదల కారణంగా 432 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
  • 140 రైళ్లు దారి మళ్లింపు, మరో 13 రైళ్లు పాక్షిక రద్దు: ద.మ.రైల్వే
  • కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ రైళ్లు రద్దు
  • విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రైళ్లు రద్దు
  • విజయవాడ-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట రైళ్లు రద్దు
  • దిల్లీ-సెంట్రల్ చెన్నై, దానాపూర్-బెంగళూరు రైళ్లు మళ్లింపు
  • రాయపురం-పటేల్ నగర్, హజ్రత్ నిజాముద్దీన్-రేణిగుంట రైళ్లు మళ్లింపు

11:09 AM, 2 Sep 2024 (IST)

సంగారెడ్డి నాందేడ్-అఖోలా జాతీయరహదారిపై వరద నీరు

  • సంగారెడ్డి నాందేడ్-అఖోలా జాతీయరహదారిపై వరద నీరు
  • ఫసల్‌వాడి అండర్ బ్రిడ్జ్‌ వద్ద భారీగా నిలిచిన వరద నీరు
  • అండర్ బ్రిడ్జ్‌ మూసివేసి వాహనాలు మళ్లిస్తున్న పోలీసులు
  • సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాల దారి మళ్లింపు

11:00 AM, 2 Sep 2024 (IST)

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
  • భారీ వర్షాలు, జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై సమీక్ష
  • సమీక్షకు హాజరైన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు
  • సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరు

10:54 AM, 2 Sep 2024 (IST)

మెదక్‌ హవేలీ ఘనపూర్‌లో పెద్ద చెరువుకు గండి

  • మెదక్‌ హవేలీ ఘనపూర్‌లో పెద్ద చెరువుకు గండి
  • పెద్దచెరువు గండి పూడ్చాలని గ్రామస్థుల డిమాండ్
  • పోచారం ప్రాజెక్టు వెనక జలాలతో పలు గ్రామాల్లోకి వరద

10:49 AM, 2 Sep 2024 (IST)

సూర్యాపేట కోదాడ బైపాస్‌ వద్ద భారీగా నిలిచిన సరకు లారీలు

  • సూర్యాపేట కోదాడ బైపాస్‌ వద్ద భారీగా నిలిచిన సరకు లారీలు
  • విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారిపై 3 కి.మీ మేర నిలిచిన లారీలు
  • గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురవడంతో నిన్నటి నుంచి ఎన్‌హెచ్‌పై లారీలు
  • నిన్నటి నుంచి జాతీయరహదారిపై లారీ డ్రైవర్ల పడిగాపులు

10:33 AM, 2 Sep 2024 (IST)

సంగారెడ్డిలో సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

  • సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం
  • కొత్తూరు నారింజ ప్రాజెక్టు నిండి గేట్ల పైనుంచి వరద ప్రవాహం
  • వరద ప్రవాహంతో జహీరాబాద్-బీదర్ మధ్య నిలిచిన రాకపోకలు

10:25 AM, 2 Sep 2024 (IST)

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం

  • సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం
  • సిద్దిపేట: మిర్దొడ్డిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • పొంగుతున్న కూడవెళ్లి, మోహితుమ్మెద, తాడూరు, ఖాతా వాగులు
  • వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
  • సిద్దిపేట: మిట్టపల్లి వద్ద కొట్టుకుపోయిన రహదారి
  • రోడ్డు కొట్టుకుపోవడంతో సిద్దిపేట నుంచి హుస్నాబాద్‌కు నిలిచిన రాకపోకలు
  • రాజీవ్‌రహదారిపై వరద నీటి వల్ల నెమ్మదిగా వెళ్తున్న వాహనాలు
  • చెరువులు, వాగులు పొంగే చోట ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు
  • సిద్దిపేట: మిర్దొడ్డిలో అత్యధికంగా 16 సెం.మీ వర్షపాతం
  • సిద్దిపేట రాఘవపూర్‌లో 14.7, నారాయణరావుపేటలో 14.5 సెం.మీ
  • సిద్దిపేట: కొండపాకలో 11, వెంకట్రావుపేటలో 11 సెం.మీ వర్షపాతం

10:20 AM, 2 Sep 2024 (IST)

ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం

  • కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

  • అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరనున్న సీఎం
  • ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం.

10:19 AM, 2 Sep 2024 (IST)

మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు మరమ్మతులు

  • మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు మరమ్మతులు
  • కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసలపల్లి మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌
  • ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు శరవేగంగా మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
  • సాయంత్రం వరకు మరమ్మతు పనులు పూర్తయ్యే అవకాశం
  • మరమ్మతు పనుల్లో 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు
  • మరమ్మతులు పర్యవేక్షిస్తున్న 15 మంది సీనియర్ అధికారులు
  • మరమ్మతు పనులు పరిశీలించిన ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్
  • రేపు ఉదయం కల్లా రైళ్లు నడపడానికి చర్యలు: ద.మ.రైల్వే జీఎం

10:18 AM, 2 Sep 2024 (IST)

రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి: గవర్నర్‌

  • రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి: గవర్నర్‌
  • రాష్ట్రానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు: గవర్నర్‌

10:07 AM, 2 Sep 2024 (IST)

వర్షాలు, వరదల కారణంగా భారీగా బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ

  • వర్షాలు, వరదల కారణంగా భారీగా బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ
  • పలుచోట్ల కోతకు గురైన విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారి
  • వరదల కారణంగా 560కి పైగా బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ
  • ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150 బస్సులు రద్దు
  • రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ

10:03 AM, 2 Sep 2024 (IST)

కాసేపట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

  • కాసేపట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

  • సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించనున్న సీఎం
  • మధ్యాహ్నం 3 గం.కు విద్యుత్ అధికారులతో సీఎం సమీక్ష

9:51 AM, 2 Sep 2024 (IST)

వరంగల్​ వరదల వల్ల నర్సంపేటలో పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు

  • వరంగల్: వరదల వల్ల నర్సంపేటలో పలు ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు
  • మూడు రోజులుగా భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • మాదన్నపేట పెద్దవాగు ఉద్ధృతితో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • మాదన్నపేటతో పాటు మరో 25 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • గురజాల వద్ద కల్వర్టుపై వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
  • ఖానాపురం మం. అశోక్‌నగర్ శివారు పాకాల చెరువుకు భారీగా వరద
  • నర్సంపేట, కొత్తగూడ మీదుగా భద్రాచలం వైపు నిలిచిన రాకపోకలు

9:46 AM, 2 Sep 2024 (IST)

రెండ్రోజులుగా మత్తడి పోస్తున్న కోదాడ పెద్ద చెరువు

  • సూర్యాపేట: కోదాడ మం. నల్లబండగూడెం వద్ద తగ్గిన వరద
  • రెండ్రోజులుగా మత్తడి పోస్తున్న కోదాడ పెద్ద చెరువు
  • పెద్దచెరువు ఉద్ధృతితో వరద ముంపులో కోదాడ లోతట్టు ప్రాంతాలు
  • వరద ముంపులో కోదాడ నయానగర్, శ్రీనగర్, షిర్డీసాయి నగర్
  • కోదాడ: వరద బాధితులను తరలించిన అగ్నిమాపక సిబ్బంది
  • సూర్యాపేట: నడిగూడెం, కోదాడ, చిలుకూరులో మంత్రి ఉత్తమ్ పర్యటన
  • కోదాడలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌
  • రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి ప్రాంతం పరిశీలన
  • నారాయణపురం చెరువుకు గండి ప్రాంతం పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌

9:32 AM, 2 Sep 2024 (IST)

హైదరాబాద్​లో వర్షాలకు పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీరు

  • హైదరాబాద్​లో వర్షాలకు పలుచోట్ల ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • బోరబండ, అల్లాపూర్, యూసఫ్‌నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు
  • ఇళ్లలోకి వరద నీరు రావడంతో స్థానికుల తీవ్ర ఇబ్బందులు

9:22 AM, 2 Sep 2024 (IST)

పెద్దపల్లి జిల్లా రామగుండంలో రెండ్రోజులుగా ఏకధాటి వర్షాలు

  • పెద్దపల్లి: రామగుండంలో రెండ్రోజులుగా ఏకధాటి వర్షాలు
  • సింగరేణి 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • రోజుకు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • సింగరేణి ఉపరితల గనుల్లో భారీగా చేరిన వరదనీరు
  • మోటార్ల సాయంతో వరదను బయటకు పంపుతున్న సిబ్బంది

9:13 AM, 2 Sep 2024 (IST)

  • ఖమ్మం: మున్నేరు వంతెన వద్ద వరద బాధితుల ఆందోళన
  • ఖమ్మం కరుణగిరి వద్ద సాయికృష్ణ నగర్ వాసుల ఆందోళన
  • రెండ్రోజులుగా వరదల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోవట్లేదన్న స్థానికులు
  • ఖమ్మం: తాగునీరు కూడా అందించట్లేదని మహిళల ఆవేదన

9:06 AM, 2 Sep 2024 (IST)

మెదక్ జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం

  • మెదక్: జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం
  • రెండు రోజులుగా జలదిగ్బంధంలో వనదుర్గా భవాని ఆలయం
  • రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం
  • వనదుర్గా మాత ఆలయం ముందు నదీ పాయ ఉద్ధృత ప్రవాహం
  • గర్భగుడిలో అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు
  • వరద ఉద్ధృతి తగ్గాక యధావిధిగా భక్తులకు దర్శనం: ఈవో
  • నక్క వాగు వరద మంజీరాలో చేరడంతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద
  • రెండ్రోజులుగా వర్షాలకు వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరద
  • ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
  • మంజీరాలో జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచన

9:02 AM, 2 Sep 2024 (IST)

సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి

  • సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి
  • ప్రాజెక్టు నీటి విడుదలతో తెగిన సింగూరు ఎడమ కాలువ
  • పుల్కల్ మం. ఈసోజీపేట శివారులో సింగూరు కాలువకు గండి
  • కాలువకు గండిపడటంతో పొలాల్లోకి వరద నీరు, ఆందోళనలో రైతులు

8:44 AM, 2 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • విజయవాడ ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 11.36 లక్షల క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాలువలకు 500 క్యూసెక్కులు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 24.2 అడుగుల మేర నీటిమట్టం

8:34 AM, 2 Sep 2024 (IST)

వర్షాలు, వరదల కారణంగా 86 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

  • వర్షాలు, వరదల కారణంగా 86 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
  • మరో 70కి పైగా రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే

7:40 AM, 2 Sep 2024 (IST)

సూర్యాపేట: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు

  • సూర్యాపేట: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగు
  • కోదాడ, మోతె, అనంతగిరి మండలాల్లో పాలేరు వాగు ఉద్ధృతి
  • నీటమునిగిన గొండ్రియాల, చిమిర్యాల, నల్లబండగూడెం
  • నీటమునిగిన రెడ్లకుంట, కూచిపూడి, తొగర్రాయి గ్రామాలు
  • సూర్యాపేట: రెండ్రోజులుగా గ్రామస్థుల తీవ్ర ఇబ్బందులు
  • సూర్యాపేట: రెండ్రోజులుగా మత్తడి పోస్తున్న కోదాడ పెద్దచెరువు

7:40 AM, 2 Sep 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీగా వర్షాలు

  • రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీగా వర్షాలు
  • నిన్న ఉ.8.30 నుంచి ఇవాళ ఉ.6 వరకు నమోదైన వర్షపాతం వివరాలు
  • కామారెడ్డిలో అత్యధికంగా 25.43 సెం.మీ వర్షపాతం నమోదు
  • తూంపల్లి (నిజామాబాద్‌)లో 22.1, గాంధారి (కామారెడ్డి)లో 18.6 సెం.మీ
  • కామారెడ్డి: తాడ్వాయిలో 18.1, లింగంపేటలో 17.8 సెం.మీ వర్షపాతం
  • కామారెడ్డి: రామారెడ్డిలో 17.78, సర్వాపూర్‌లో 17.7 సెం.మీ వర్షపాతం
  • మిన్పూర్‌ (మెదక్‌)లో 17.3, మిర్దొడ్డి (సిద్దిపేట)లో 16.63 సెం.మీ
  • చిమన్‌పల్లి (నిజామాబాద్‌)లో 16.28, ఉట్నూరు (ఆదిలాబాద్‌)లో 15.8 సెం.మీ
  • జైనూరు (ఆసిఫాబాద్‌)లో 15.8, నేరెళ్ల (జగిత్యాల)లో 14.8 సెం.మీ
  • నిర్మల్‌: అక్కాపూర్‌లో 14.4, పెంబిలో 13.9 సెం.మీ వర్షపాతం

7:39 AM, 2 Sep 2024 (IST)

  • ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మం. గరికపాడు వద్ద కోతకు గురైన రహదారి
  • పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కోతకు గురైన రహదారి
  • హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల మళ్లింపు
  • విజయవాడ నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాల మళ్లింపు
  • హైదరాబాద్‌-విజయవాడ: నార్కట్‌పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు
  • విజయవాడ-హైదరాబాద్‌: గుంటూరు, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి
  • సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు నిలిపివేత
  • ఖమ్మంలో వరదల కారణంగా వాహనాలు నిలిపివేత
  • సూర్యాపేట-ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలు నిలిపివేత
  • నిన్నటి నుంచి నిలిచిపోయిన విజయవాడ వెళ్లే వాహనాలు
  • సూర్యాపేట-ఖమ్మం బైపాస్‌ మార్గంలో భారీగా నిలిచిన లారీలు

7:38 AM, 2 Sep 2024 (IST)

రాష్ట్రవ్యాప్తంగా నేడూ భారీ వర్షాలు

  • రాష్ట్రవ్యాప్తంగా నేడూ భారీ వర్షాలు
  • నేడు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక
  • భారీ వర్షాల నేపథ్యంలో మరింత అప్రమత్తమైన జిల్లా కలెక్టర్లు, అధికారులు

7:38 AM, 2 Sep 2024 (IST)

పరీక్షలు వాయిదా

  • హైదరాబాద్‌: వర్షాల కారణంగా నేడు జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలలకు సెలవు
  • అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన వర్సిటీ అధికారులు
  • అన్ని అనుబంధ, అటానమస్ కళాశాలలు నేడు సెలవు పాటించాలని స్పష్టం
  • నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన జేఎన్‌టీయూ
  • బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ పరీక్షలు వాయిదా వేసిన జేఎన్‌టీయూ
  • ఇవాళ జరగాల్సిన పరీక్షలను ఈనెల 5న నిర్వహిస్తాం: జేఎన్‌టీయూ
  • నిజామాబాద్‌: టీయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా
  • తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఇవాళ పరీక్షలు వాయిదా
  • భారీ వర్షాల కారణంగా నేటి పరీక్షలు వాయిదా: రిజిస్ట్రార్ యాదగిరి
  • భారీ వర్షాల వల్ల నేడు సెలవు ప్రకటించిన ఉస్మానియా వర్సిటీ
  • ఓయూ పరిధిలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన వర్శిటీ
  • ఓయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసిన అధికారులు
  • రేపటి నుంచి జరిగే పరీక్షలు యథాతథం: ఓయూ పరీక్షల విభాగం

7:37 AM, 2 Sep 2024 (IST)

కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేత

  • ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేత
  • వర్షాల కారణంగా ఇవాళ 80 రైళ్లు రద్దు, మరో 48 రైళ్లు దారి మళ్లింపు
  • హైదరాబాద్-విజయవాడ రూట్‌లోనే అత్యధిక రైళ్లు రద్దు
  • ఆలస్యంగా నడుస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు

7:35 AM, 2 Sep 2024 (IST)

  • హైదరాబాద్‌-విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడ మళ్లింపు
  • విజయవాడ: గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లింపు

7:34 AM, 2 Sep 2024 (IST)

సింగరేణి సంస్థ నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

  • పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు
  • రామగుండం సింగరేణి సంస్థ నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • రోజుకు 50 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • ఉపరితల గనుల్లో భారీగా చేరిన వరద నీరు
  • మోటర్ల సహాయంతో బయటకు పంపుతున్న అధికారులు

Last Updated : Sep 2, 2024, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.