ETV Bharat / state

ప్రాణనష్టం జరగకుండా చూడండి - కలెక్టర్లతో సీఎస్ - CS On Heavy Rains In Telangana - CS ON HEAVY RAINS IN TELANGANA

CS Teleconference on Heavy Rains : తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్తర తెలంగాణాలోని 11 జిల్లాలలో శని, ఆదివారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్​ను ప్రకటించగా జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనితోపాటు 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు పక్కా భవనాల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనా, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం తదితర అంశాలపై కూడా ఈ టెలికాన్ఫరెన్స్​లో సమీక్షించారు.

CS Teleconference on Heavy Rains In Telangana
CS Teleconference on Heavy Rains In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 10:03 AM IST

CS Teleconference on Heavy Rains In Telangana : తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు పాల్గొన్నారు.

పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిందని ఆయా జిల్లాల కలెక్టర్లు ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణలో భారీ వర్షాలు - కొట్టుకుపోయిన రోడ్లు - నిలిచిపోయిన రాకపోకలు - Heavy Rains In Telangana

ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ 11 జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా రాష్ట్ర రాజధానిని ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని ఆమె అన్నారు.

నూతన మెడికల్ కాలేజీలకు భవనాల గుర్తింపు : మరోవైపు ప్రభుత్వం కొత్తగా ఎనిమిది జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు తాత్కాలిక ప్రాతిపదికన పక్కా భవనాలను గుర్తించడంతో పాటు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాలు కలెక్టర్లకు సూచించారు. గద్వాల్, నర్సంపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నర్సంపేట జిల్లాలో భవనాలను గుర్తించాలన్న ఆమె భువనగిరి, మెదక్ జిల్లాల్లో కాలేజి భవనాలను గుర్తించారని తెలిపారు.

ఈ రెండు జిల్లాలు ఆయా భవనాలను 40 ఏళ్లకు లీజ్ అగ్రిమెంట్ చేసుకోవాలని కలెక్టర్లకు తెలిపారు. ఈ ఎనిమిది జిల్లాలలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 220 పడకల ఆసుపత్రులను అనుసందానం చేయాలన్నారు. వీటితో పాటు కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి ఆయా కళాశాల్లో ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించాలని తెలిపారు. టీచింగ్ స్టాఫ్ నియామకంపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా సీటీ స్కాన్, బయోమెట్రిక్ అటెండెన్స్ మెషిన్లను హైదరాబాద్‌లోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సరఫరా చేస్తుందని సీఎస్ తెలిపారు.

భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

పెద్దవాగు ఉద్ధృతితో అశ్వారావుపేట అతలాకుతలం - స్తంభించిన జనజీవనం, ముంపు ప్రాంతాల్లో చిమ్మచీకట్లు - Heavy Floods In Bhadradri

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.