ETV Bharat / state

హైదరాబాద్​లో మరోసారి వరుణుడి బీభత్సం - జిల్లాల్లోనూ సేమ్ సిచ్యువేషన్​ -​ రెడ్ అలర్ట్ జారీ - Heavy Rainfall in Hyderabad - HEAVY RAINFALL IN HYDERABAD

Heavy Rains In Hyderabad : హైదరాబాద్​ సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా రాజధాని మరోసారి వరుణుడి దెబ్బకు విలవిల్లాడింది. గురువారం నాటి బీభత్సం నుంచి తేరుకోకముందే తిరిగి ఇవాళ అదే సమయానికి వరుణుడు విరుచుకుపడ్డాడు. కొద్దికొద్దిగా మొదలైన వర్షం, క్రమంగా విస్తరిస్తూ నగర మంతటా వ్యాపించింది.

HEAVY RAINFALL IN HYDERABAD
Heavy Rains In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 6:28 PM IST

Updated : Aug 16, 2024, 10:23 PM IST

Heavy Rains In Hyderabad : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుసింది. కుండపోతగా కురిసిన వర్షం, సిటీ రోడ్లను మరోసారి చెరువులుగా మార్చింది. మధ్యాహ్నం నుంచి మొదలైన వర్షం, క్రమంగా నగరమంతటా విస్తరించింది. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, మారేడుపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్ ప్రాంతాల్లో జడివాన పడింది. ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం : ఏకధాటిగా వర్షం కురువడం వల్ల ప్రధాన రహదారులపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపోవడంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది. చాలాచోట్ల వాహనాలు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది.

అటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్‌, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లోనూ వరుణుడు విరుచుకుపడ్డాడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, దిల్​సుఖ్​ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్​నగర్​లోనూ భారీ వర్షం పడింది. ఈ ప్రభావంతో రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు విడిచిపెట్టే సమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రద్దీ ప్రాంతాలైన అమీర్​పేట, పంజాగుట్ట, కూకట్​పల్లి, బయో డైవర్సిటీ, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్​ రద్దీ ఎక్కువగా ఉంది.

హైదరాబాద్​లో భారీ వర్షంపై వాతావరణ శాఖ ముందే రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో రహదారులపై నీరు చేరకుండా జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఏమైనా ఇబ్బందులుంటే 040 - 21111111కు ఫోన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

Heavy Rains In Telangana : జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది. నిర్మల్‌లో అరగంటలోనే ఆగమాగం చేసింది. ఒక్కసారిగా కుండపోత కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివాజీ చౌక్‌లో నలువైపులా కిలోమీటర్ పొడవున రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

పక్షం రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఊరట లభించింది. జగిత్యాల, గంగాధర, రామడుగు, చొప్పదండి, ధర్మపురి, చిగురుమామిడి, బోయినపల్లి మండలాల్లో వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లాలోనూ వర్షం దంచి కొట్టింది. పలు చోట్ల కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి - Heavy Rains In Telangana

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం - అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి - Heavy Rains in Hyderabad

Last Updated : Aug 16, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.