Heavy Rains in AP : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, గెడ్డలు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Landslides in Alluri District : అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలోనే జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గల్లంతు అయ్యారు. మరో నలుగురిని స్థానికులు కాపాడారు. గల్లంతైన వారి కోసం పోలీసులు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు - ఐదుకు చేరిన మృతులు - రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం - LANDSLIDES IN VIJAYAWADA
జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అంతరాష్ట్ర రహదారిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో రాకపోకలు స్తంభించాయి. నర్సీపట్నం - భద్రాచలం అంతరాష్ట్ర రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో భారీగా బురద పేరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. సీలేరు - ధారకొండ మార్గ మధ్యలో దాదాపు 12 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అల్లూరి జిల్లా మొత్తంగా 16 కి.మీ మేర కొండచరియలు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.