ETV Bharat / state

వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొడుతున్న వర్షాలు- అత్యధికంగా చింతూరులో 21సెం మీ - Rains in Andhra Pradesh 2024

Heavy Rains in Andhra Pradesh : ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి అది బలహీనపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఒడిశాలోని చిల్క సరస్సుకు దగ్గరగా వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా- ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. మరోవైపు వాయుగుండం కారణంగా చింతూరులో అత్యధికంగా 21 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సెంటిమీటర్ కంటే అధిక వర్షపాతం కురిసింది.

Heavy Rains in Andhra Pradesh Today
Heavy Rains in Andhra Pradesh Today (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 1:40 PM IST

Updated : Jul 20, 2024, 3:22 PM IST

Rain Alert in AP 2024 : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి ఒడిశా-ఛత్తీస్​గఢ్ మధ్య తీరాన్ని దాటుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని చిలక సరస్సుకు దగ్గరగా కేంద్రీకృతమై ఉన్నట్టు పేర్కొంది. గడచిన మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు : ప్రస్తుతం ఒడిశాలోని పూరికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్​పూర్​కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వివరించింది. ఇది వాయువ్యంగా కదులుతూ ఒడిశా-ఛత్తీస్​గఢ్​ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆ తదుపరి 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడనున్నట్టు స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.

AP Weather Updates 2024 : కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ నుంచి విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితలంపై గాలులు వీస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వానలు కురుస్తాయని పేర్కొంది. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.

10 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం : మరోవైపు వాయుగుండం కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల 10 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా చింతూరులో 21 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 13, నూజివీడులో 10, పాడేరులో 9, వరరామచంద్రాపూరంలో 9, నర్సీపట్నం 9, అరకు 8, కుక్కునూరు 8, విశాఖ 7, కురుపాం , తెర్లాం, బొండబల్లె, టెక్కలి, కూనవరం, చోడవరం గురుగుబిల్లి 7 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యింది.

రాయలసీమలో అత్యధికంగా నద్యాల జిల్లా రుద్రవరంలో 7, డోర్నిపాడులో 7 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీవ్యాప్తంగా చాలా చోట్ల 5 సెంటిమీటర్ల కంటే అధికవర్షపాతం నమోదైందని తెలిపింది. ఇక అన్ని ప్రాంతాల్లోనూ ఒక సెంటిమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందని వాతవరణ కేంద్రం స్పష్టం చేసింది.

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు : మరోవైపు భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. నదుల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జిల్లా అధికారులకు సూచనలు జారీ చేస్తోంది.

రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు - Heavy Rains in AP 2024

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు- పొంగిపొర్లుతున్న వాగులు - AP Rain Update

Last Updated : Jul 20, 2024, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.