ETV Bharat / state

LIVE UPDATES: వరద పరిస్థితుల గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్నమోదీ - Rains in Andhra Pradesh - RAINS IN ANDHRA PRADESH

Heavy Rains in Andhra Pradesh
Heavy Rains in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 6:39 AM IST

Updated : Sep 1, 2024, 10:53 PM IST

Heavy Rains in Andhra Pradesh : వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. అధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

LIVE FEED

10:52 PM, 1 Sep 2024 (IST)

  • సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
  • వరద పరిస్థితుల గురించి సీఎంను అడిగి తెలుసుకున్న ప్రధాని
  • కేంద్రం నుంచి అన్నిరకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని
  • తీసుకుంటున్న వరద సహాయ చర్యలను మోదీకి వివరించిన చంద్రబాబు
  • ఆయా కేంద్ర శాఖలకు ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబుకు తెలిపిన మోదీ
  • రాష్ట్రానికి అవసరమైన సాయం చేయాలని ఆదేశించామన్న మోదీ
  • అవసరమైన సామగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చామన్న ప్రధాని
  • కేంద్ర సాయంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

10:51 PM, 1 Sep 2024 (IST)

  • మరోసారి సింగ్‌నగర్ క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు
  • బాధితులకు అందుతున్న ఆహారం, సహాయ చర్యలను పర్యవేక్షించనున్న సీఎం

10:27 PM, 1 Sep 2024 (IST)

  • సీఎం ఇంటి వద్ద కృష్ణా కరకట్టకు గండిపడే ప్రమాదం గుర్తించిన రైతులు
  • వరదనీరు కట్ట నుంచి నీరు లీక్ అవడాన్ని గుర్తించిన రాజధాని రైతులు
  • కట్టమీదకు చేరుకుని గండి పూడ్చే పనులు స్వచ్ఛందంగా చేపట్టిన రైతులు
  • ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించిన రాజధాని రైతులు
  • త్వరగా స్పందించకుంటే వరదనీరు సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి వస్తుందన్న రైతులు

9:54 PM, 1 Sep 2024 (IST)

  • భారీవర్షాలు, వరదల గురించి కేంద్రానికి ఇప్పటికే చెప్పాం: సీఎం
  • జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరతాం: సీఎం
  • పులిచింతల ప్రాజెక్టు కింద నుంచే ఎక్కువ నీళ్లు వస్తున్నాయి: సీఎం
  • మున్నేరు, బుడమేరు, ఇతర వాగుల నుంచే ఎక్కువ నీళ్లు వచ్చాయి: సీఎం
  • ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం..: సీఎం
  • విపత్తుల వేళ మానవ తప్పిదం లేకుండా మావంతు ప్రయత్నిస్తాం: సీఎం
  • వరద ప్రాంతాల గురించి ప్రతి గంటకు బులెటిన్‌ విడుదల చేస్తాం: సీఎం

9:54 PM, 1 Sep 2024 (IST)

  • ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మోహరించాం: చంద్రబాబు
  • సహాయ చర్యలను రాత్రిపూట కూడా పర్యవేక్షిస్తా: సీఎం చంద్రబాబు
  • రేపు కూడా వరదనీరు రావొచ్చు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం..
  • వరద బాధితుల్లో నమ్మకం కలిగించాక, అన్నీ సరిచేశాక ఇంటికెళ్తాం
  • 9.72 లక్షల క్యూసెక్కుల వరదనీరు రావడం ఇదే తొలిసారి
  • వరదనీరు తగ్గేవరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాం
  • కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు వరదనీరు రాకుండా చర్యలు
  • ఎన్ని అవసరమో అన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
  • బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టాం
  • ప్రజల ప్రాణాలు కాపాడటమే మా ప్రధాన కర్తవ్యం..
  • పైనుంచి వచ్చే వరదనీటిని మనం ఆపలేం.. జాగ్రత్తలు మాత్రమే తీసుకోగలం..

9:41 PM, 1 Sep 2024 (IST)

  • సింగ్‌నగర్‌లో పరిస్థితి పరిశీలించా.. బాధితులను కలిశా..:చంద్రబాబు
  • బుడమేరుకు గండ్లు పడి వరదనీరు పోటెత్తింది:చంద్రబాబు
  • 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు భారీ వర్షాలు పడ్డాయి:చంద్రబాబు
  • వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది:చంద్రబాబు
  • యుద్ధప్రాతిపదికన నష్టనివారణ చర్యలు చేపట్టాం:చంద్రబాబు
  • శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి భారీగా వస్తున్నాయి:చంద్రబాబు
  • మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా నీరు వస్తోంది:చంద్రబాబు
  • బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు విజయవాడకు వచ్చాయి:చంద్రబాబు
  • బుడమేరు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదు:చంద్రబాబు
  • వరద బాధితులు సుమారు 2.76 లక్షల మంది ఉన్నారు:చంద్రబాబు
  • సింగ్‌నగర్‌ వరద బాధితుల కష్టాలు స్వయంగా చూశా
  • వరద బాధితులకు పూర్తిగా భరోసా వచ్చాకే ఇంటికెళ్తా:చంద్రబాబు
  • రాష్ట్రానికి 10 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు వస్తున్నాయి:చంద్రబాబు
  • రాష్ట్రానికి 40 పవర్‌ బోట్లు వస్తున్నాయి:చంద్రబాబు
  • రాష్ట్రానికి కేంద్రం 6 హెలికాప్టర్లు పంపిస్తోంది:చంద్రబాబు
  • వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించాలని ఆదేశించా:చంద్రబాబు
సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఎన్టీఆర్​ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటా:చంద్రబాబు (ETV Bharat)

9:20 PM, 1 Sep 2024 (IST)

  • కృష్ణానది లంకలో చిక్కుకున్న ఆరుగురు పాడిరైతులు
  • గుంటూరు: తాడేపల్లి మం. చిర్రావూరు వద్ద చిక్కుకున్న పాడిరైతులు
  • పాడిరైతులను తీసుకువచ్చేందుకు అధికారుల ప్రయత్నం

9:19 PM, 1 Sep 2024 (IST)

  • సీఎం ఆదేశాలతో వరద బాధితులకు ఆహారం సిద్ధం చేసిన అక్షయపాత్ర
  • మంగళగిరి కిచెన్‌లో లక్ష భోజన ప్యాకెట్లు సిద్ధం చేసిన అక్షయపాత్ర
  • భోజన ప్యాకెట్లను విజయవాడ తరలించిన అక్షయపాత్ర ప్రతినిధులు
  • అవసరమైతే మరో 50 వేల మందికి ఆహారం సిద్ధం చేసేలా ఏర్పాట్లు

8:57 PM, 1 Sep 2024 (IST)

  • అమిత్ షాతో మాట్లాడాక హోంశాఖ కార్యదర్శితో మాట్లాడిన సీఎం
  • పవర్ బోట్లను అత్యవసరంగా రాష్ట్రానికి పంపాలని కోరిన సీఎం
  • 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే పంపుతున్నామన్న కేంద్ర హోంశాఖ
  • ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 25 మంది ఉంటారన్న కేంద్రం
  • రేపు ఉదయంలోగా పవర్ బోట్లు విజయవాడ చేరుకుంటాయన్న కేంద్రం
  • మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నామన్న కేంద్ర హోంశాఖ
  • రేపు వాయుమార్గంలో 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు పంపుతున్నామన్న హోంశాఖ
  • సహాయ చర్యల కోసం 6 హెలికాప్టర్లు పంపుతున్నామన్న కేంద్ర హోంశాఖ

7:48 PM, 1 Sep 2024 (IST)

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్రంలో వరద సహాయ చర్యలను అమిత్ షాకు వివరించిన చంద్రబాబు
  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ద్వారా పవర్ బోట్లు పంపాలని అమిత్‌ షాను కోరిన సీఎం
  • అవసరమైన మేరకు సాయం చేస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా
  • హోంశాఖ కార్యదర్శి ద్వారా తక్షణం సాయం అందేలా చూస్తామన్న అమిత్ షా

7:43 PM, 1 Sep 2024 (IST)

  • సీఎం పడవలో క్షేత్రస్థాయికి వెళ్లాక వెలుగుచూసిన పలు ఘటనలు
  • రాత్రి నుంచి ఆహారం, నీరు లేక ఇళ్లపై ఉన్నామని సీఎంకు చెప్పిన బాధితులు
  • అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకుని కలెక్టరేట్‌కు వచ్చి అత్యవసర సమీక్ష
  • ముంపు బాధితులకు ఆహారం ఇచ్చే విషయంలో హోటళ్లకు ప్రభుత్వం ఆదేశం
  • అందుబాటులో ఉన్న ఆహారాన్ని వరద బాధితులకు పంపాలని హోటళ్లకు ఆదేశం

7:41 PM, 1 Sep 2024 (IST)

వరద సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు ట్వీట్‌

  • వర్షాలు, వరద సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు ట్వీట్‌
  • వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది: సీఎం
  • వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాం: సీఎం చంద్రబాబు
  • వరద ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు: సీఎం
  • విజయవాడ సింగ్‌నగర్‌లోని బుడమేరు వద్ద పర్యటించా: సీఎం
  • వరద బాధితుల కష్టాలు చూసి కలెక్టరేట్‌లోనే ఉన్నా: సీఎం
  • వరద సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కలెక్టరేట్‌లోనే ఉంటా: సీఎం
  • కలెక్టరేట్‌నే సీఎంవోగా చేసుకుని ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తా: సీఎం

7:03 PM, 1 Sep 2024 (IST)

  • ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేత
  • ఇవాళ, రేపు 80 రైళ్లు రద్దు, మరో 48 రైళ్లు దారి మళ్లింపు
  • హైదరాబాద్-విజయవాడ రూట్‌లోనే అత్యధిక రైళ్లు రద్దు
  • ఆలస్యంగా నడుస్తున్న పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు

6:54 PM, 1 Sep 2024 (IST)

హైదరాబాద్ పర్యటన రద్దు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ పర్యటన రద్దు
  • తాత్కాలిక సీఎం కార్యాలయంగా మారిన విజయవాడ కలెక్టరేట్
  • కలెక్టరేట్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సు
  • అవసరమైతే బస్సులోనే ఇవాళ సీఎం ఉండేలా ఏర్పాట్లు

6:52 PM, 1 Sep 2024 (IST)

సముద్రంలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చేందుకు ఏర్పాట్లు

  • బాపట్ల: వేటకు వెళ్లి తప్పిపోయిన మత్స్యకారుల ఆచూకీ లభ్యం
  • విశాఖ సముద్రతీరంలో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులు
  • తీరం నుంచి 150 కి.మీ. దూరంలో బోటు మరమ్మతుకు గురైనట్లు గుర్తింపు
  • సముద్రంలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చేందుకు ఏర్పాట్లు
  • మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్న కుటుంబసభ్యులు

6:23 PM, 1 Sep 2024 (IST)

  • బుడమేరు బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదు: సీఎం
  • పాలు, అహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్‌లు అందించాలి: సీఎం
  • లక్షమందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలి: సీఎం చంద్రబాబు
  • ఇతర ప్రాంతాల నుంచి బోట్లు, టాక్టర్లు తెప్పించాలి: సీఎం చంద్రబాబు
  • అక్షయపాత్ర, ఇతర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలి: సీఎం
  • ఖర్చు గురించి ఆలోచించకుండా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  • అధికారులకు మంత్రులకు ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి పంపిన సీఎం
  • అప్పగించిన బాధ్యతలను నిమిషాలు లెక్కన పూర్తి చేయాలి: సీఎం
  • నగరంలోని దుకాణాల నుంచి బిస్కట్లు, పాలు తెప్పించాలి: సీఎం

6:07 PM, 1 Sep 2024 (IST)

సీఎం చంద్రబాబు సమీక్ష

  • విజయవాడ వరద పరిస్థితిపై కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష
  • వరద సహాయ, పునరావాస కార్యక్రమాలపై సీఎం సమీక్ష
  • సమీక్షకు హాజరైన మంత్రులు, కలెక్టర్, ఉన్నతాధికారులు

6:06 PM, 1 Sep 2024 (IST)

ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు

  • విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు
  • విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్‌కు బస్సులు
  • విజయవాడ బస్టాండ్‌ నుంచి బయలుదేరుతున్న ఆర్టీసీ బస్సులు
  • విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఐతవరం వద్ద ఇంకా వరదనీరు
  • విజయవాడ-హైదరాబాద్ హైవేపై వెళ్లి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

6:06 PM, 1 Sep 2024 (IST)

  • విజయవాడ: వరదముంపు ప్రాంతాల్లో పర్యటించాక కలెక్టరేట్‌కు వచ్చిన సీఎం
  • నీటమునిగిన ప్రాంతాలపై ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష
  • సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో పలువురు చిక్కుకున్నారని ఫిర్యాదులు
  • బుడమేరు ప్రాంతంలోనూ పలువురు చిక్కుకున్నారని ఫిర్యాదులు
  • వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలని సీఎం ఆదేశం
  • వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశం

5:29 PM, 1 Sep 2024 (IST)

  • సింగ్‌నగర్‌ వరద ప్రాంతాన్ని బోటులో వెళ్లి పరిశీలించిన సీఎం
  • సింగ్‌నగర్‌ బాధితులను రక్షించేవరకు సహాయ చర్యలు పర్యవేక్షిస్తా: సీఎం
  • ఆఖరి వ్యక్తిని రక్షించేవరకు స్వయంగా సహాయ చర్యలు పర్యవేక్షిస్తా: సీఎం
  • కలెక్టరేట్‌ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తా: సీఎం
  • బాధితులందరికీ వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం: సీఎం
  • బోట్లు సరిపోకుంటే మరికొన్ని రప్పిస్తాం: సీఎం చంద్రబాబు

5:29 PM, 1 Sep 2024 (IST)

తప్పిపోయిన చినగంజాం మత్స్యకారులు

  • బాపట్ల: వేటకు వెళ్లి తప్పిపోయిన చినగంజాం మత్స్యకారులు
  • చెన్నై నుంచి విశాఖ వైపు చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు
  • రాముడు, బాబూరావు, జయరాజు, మునియ్యగా గుర్తింపు
  • విశాఖ సముద్ర తీరంలో చిక్కుకున్న మత్స్యకారుల పడవ
  • సమస్యను మంత్రులు అనిత, అనగాని దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఏలూరి
  • రెవెన్యూ అధికారులు, పోలీసులను అప్రమత్తం చేసిన మంత్రులు
  • మంత్రుల విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్స్
  • మత్స్యకారుల ఆచూకీ కోసం విశాఖ తీరంలో గాలింపు చేపట్టిన కోస్ట్ గార్డ్స్

5:28 PM, 1 Sep 2024 (IST)

మున్నేరు ఉగ్రరూపం

  • ఎన్టీఆర్ జిల్లా: మున్నేరు ఉగ్రరూపం
  • నందిగామ వద్ద పలు లోతట్టు ప్రాంతాలు నీటమునక
  • మున్నేరుకు 2.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
  • నందిగామ-మధిర రోడ్డుపై వరదనీరు, వాహనాల రాకపోకలకు ఆటంకం

5:19 PM, 1 Sep 2024 (IST)

విజయవాడలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

  • విజయవాడలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు
  • వరద బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశా: చంద్రబాబు
  • బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం: చంద్రబాబు
  • ఆరోగ్యం బాగాలేని వారిని ఆస్పత్రులకు తరలిస్తాం: చంద్రబాబు
  • సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటా: చంద్రబాబు
  • సింగ్‌నగర్‌ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా: చంద్రబాబు

5:06 PM, 1 Sep 2024 (IST)

ప్రజలను హెచ్చరిస్తున్నఅధికారులు

  • పల్నాడు: అమరేశ్వరాలయం వద్ద ప్రమాదకరస్థాయిలో కృష్ణా ప్రవాహం
  • పూర్తిగా మునిగిన అమరేశ్వరాలయంలోని స్నానఘట్టాలు
  • నదీతీరం వైపు ఉన్న ఆలయ ద్వారం వరకు చేరుకున్న వరదనీరు
  • బారికేడ్లు పెట్టి భక్తులు, ప్రజలను హెచ్చరిస్తున్నఅధికారులు

4:58 PM, 1 Sep 2024 (IST)

  • విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన
  • వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలు పరిశీలించిన చంద్రబాబు
  • భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా బోటులో వెళ్లిన చంద్రబాబు
  • బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్న సీఎం
  • సింగ్‌నగర్‌లో గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడిన సీఎం
  • వరద బాధితులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
  • ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు
  • వరద ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు అందించాలన్న సీఎం చంద్రబాబు
  • తాళ్లు, ట్రాక్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయ సిబ్బంది
  • ఇంతటి వరదను గతంలో ఎప్పుడూ చూడలేదన్న సింగ్‌నగర్‌ వాసులు

4:32 PM, 1 Sep 2024 (IST)

సీఎం చంద్రబాబు పర్యటన

3:43 PM, 1 Sep 2024 (IST)

జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయి: సీఎం చంద్రబాబు

  • తుపాను తీరం దాటినచోట కంటే ఇతరచోట్ల ఎక్కువ వర్షాలు: సీఎం
  • కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిశాయి: సీఎం
  • ఇప్పుడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ వర్షం పడుతోంది: సీఎం
  • జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయి: సీఎం చంద్రబాబు
  • వాగులు, చెరువులకు నీరు వెళ్లేదారిలో సత్వర క్లియరెన్స్‌ చర్యలు: సీఎం
  • సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు: సీఎం
  • నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం: సీఎం చంద్రబాబు
  • పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తాం: సీఎం చంద్రబాబు

3:33 PM, 1 Sep 2024 (IST)

  • ప్రకాశం బ్యారేజ్‌ కింద పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి: సీఎం
  • గట్లు బలహీనంగా ఉన్నచోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నాం: సీఎం
    భారీ వర్షాలు, వరదలను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి: సీఎం
  • వర్షాలు, వరదల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి: సీఎం చంద్రబాబు
  • 107 క్యాంపులు పెట్టాం.. 17 వేలమందిని తరలించాం..: సీఎం
  • ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం: సీఎం
  • వరదముంపు ప్రాంతాలకు బోట్లు పంపించాం: సీఎం చంద్రబాబు
  • ప్రాణ, ఆస్తి నష్టం పెరగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశాం: సీఎం
  • వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ: సీఎం
  • మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తున్నాం: సీఎం

3:29 PM, 1 Sep 2024 (IST)

జాతీయ రహదారిపైకి చేరిన వరదనీరు

  • ఏపీ-తెలంగాణ సరిహద్దులో నిలిచిన వాహనాల రాకపోకలు
  • ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతి
  • కోదాడ దిగువన ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిమిర్యాల వాగు, పాలేరు
  • కోదాడ నుంచి దిగువకు భారీగా ప్రవహిస్తున్న వరదనీరు
  • నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి చేరిన వరదనీరు
  • చిమిర్యాల వద్ద జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు
  • అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు
  • నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
  • బస్సు నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న 30 మంది ప్రయాణికులు

3:27 PM, 1 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్‌కు 8.8 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి: సీఎం

  • కొన్నిచోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది: సీఎం చంద్రబాబు
  • కాజా టోల్‌గేట్‌, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉంది: సీఎం చంద్రబాబు
  • విజయవాడ, గుంటూరులో సత్వర చర్యలు చేపట్టాం: సీఎం చంద్రబాబు
  • అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోయారు, ఒకరు గల్లంతు: చంద్రబాబు
  • విజయవాడలో కొండచరియలు పడి చనిపోవడం బాధాకరం: చంద్రబాబు
  • వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరం: చంద్రబాబు
  • పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోంది: సీఎం చంద్రబాబు
  • ప్రకాశం బ్యారేజ్‌కు 8.8 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి: సీఎం
  • బుడమేరు వల్ల వీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి ఆగింది: సీఎం చంద్రబాబు

2:53 PM, 1 Sep 2024 (IST)

ప్రస్తుతం శిథిలాల తొలగింపు కొనసాగుతుంది: మంత్రి నారాయణ

  • విజయవాడ: కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ
  • రాళ్లు పడి ఐదుగురు చనిపోవడం దురదృష్టకరం: మంత్రి నారాయణ
  • చికిత్స పొందుతున్న మరో నలుగురి ఆరోగ్యం నిలకడగా ఉంది: మంత్రి నారాయణ
  • ప్రస్తుతం శిథిలాల తొలగింపు కొనసాగుతుంది: మంత్రి నారాయణ
  • కొండప్రాంతల్లో నివసిస్తున్న వారి ఇళ్ల విషయంలో దృష్టి పెడతాం: నారాయణ
  • ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి పెడతాం: నారాయణ
  • భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం: మంత్రి నారాయణ
  • అధికారులతో కలిసి ప్రణాళిక రూపొందిస్తాం: మంత్రి నారాయణ

2:52 PM, 1 Sep 2024 (IST)

మున్నేరు పరివాహక కాలనీలు జలదిగ్బంధం

  • ఖమ్మం పట్టణంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు
  • ఖమ్మంలోని మున్నేరు పరివాహక కాలనీలు జలదిగ్బంధం
  • ఖమ్మం: మున్నేరు వరద ఉద్ధృతిలో చిక్కుకున్న పలు కాలనీలు
  • రాజీవ్ గృహాకల్ప, వెంకటేశ్వరనగర్‌ కాలనీలు జలదిగ్బంధం
  • ఖమ్మం: మోతీనగర్‌, బొక్కలగడ్డ కాలనీలను ముంచెత్తిన వరద
  • ఖమ్మం: కాలనీలు నీట మునగడంతో ఇళ్లపైకి చేరిన స్థానికులు
  • వరద చుట్టుముట్టిన ఇళ్ల నుంచి రక్షించాలని బాధితుల ఆర్తనాదాలు
  • ఇళ్లపైకి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న వందలాది బాధితులు

2:51 PM, 1 Sep 2024 (IST)

ఆర్టీసీ నిలిపివేత

  • విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత ఐతవరం వద్ద నీటి ప్రవాహంతో ఆర్టీసీ బస్సుల నిలిపివేత
  • వరంగల్‌లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే నిలిచిన హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లు
  • బస్సుల నిలిపివేతతో విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు
  • ప్రైవేటు బస్సులు, వాహనాల నిలిపివేతతో ప్రయాణికుల ఇబ్బందులు

2:49 PM, 1 Sep 2024 (IST)

వరద పరిస్థితిపై సీఎం సమీక్ష

  • విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి సీఎం చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం సమీక్ష
  • హోంమంత్రి, సీఎస్‌, ఉన్నతాధికారులతో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష
  • తుఫాను ప్రభావం, వర్షపాతం నమోదు తదితర అంశాలు సీఎంకు వివరించిన సీఎస్
  • వరద ప్రవాహం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం
  • తాజా వర్షాలు ఓ పాఠంగా అధికారులు అధ్యయనం చేయాలన్న సీఎం
  • లెక్కలతో మొక్కుబడి వివరాలు తనకు వద్దన్న సీఎం చంద్రబాబు
  • సాంకేతికతతో కూడిన సమగ్ర అధ్యయనం వివరాలు కావాలన్న సీఎం
  • విజయవాడలో పలు ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించే అవకాశం
  • బ్యారేజీల్లో పెరుగుతున్న నీటిమట్టం వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం
  • తుంగభద్ర, సుంకేసుల, శ్రీశైలం, సాగర్, ప్రకాశం పులిచింతలపై సీఎం చర్చ
  • వరద ఉద్ధృతి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందని సీఎం ఆరా
  • ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో తీసుకున్న చర్యల వివరాలు అడిగిన సీఎం
  • తెలంగాణ నుంచి వాగుల ద్వారా వరద ఏ విధంగా వస్తుందని సీఎం ఆరా

2:49 PM, 1 Sep 2024 (IST)

రాకపోకలు నిలిపివేసిన అధికారులు

  • ఎన్టీఆర్ జిల్లా: జాతీయరహదారిపైకి చెరిన ఎదుళ్ల వాగు వరద
  • తిరువూరు మం. రామన్నపాలెం వద్ద రహదారిపైకి చేరిన వరద
  • తిరువూరు-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిపివేసిన అధికారులు

2:21 PM, 1 Sep 2024 (IST)

లంక గ్రామాలను చుట్టుముట్టిన వరద

  • బాపట్ల జిల్లా: కొల్లూరులోని లంక గ్రామాలను చుట్టుముట్టిన వరదనీరు
  • ఇప్పటికే లంక గ్రామాల్లో మునిగిన పంట పొలాలు
  • అరవింద వారధి సమీపంలో కృష్ణా నది నక్కపాయకు గండిపడే ప్రమాదం
  • గతంలో పడిన గండికి మట్టి కట్టలు వేసి పూడ్చిన అధికారులు

2:17 PM, 1 Sep 2024 (IST)

వరద పరిస్థితులపై సమీక్షించిన హోంమంత్రి అనిత

  • వరద పరిస్థితులపై సమీక్షించిన హోంమంత్రి అనిత
  • తాడేపల్లి: విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి సమీక్ష
  • ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాలు: అనిత
  • 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం: అనిత
  • 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: అనిత
  • అత్యవసర వైద్యం కోసం 61 మెడికల్ క్యాంపులు: అనిత
  • 600 మందిని సురక్షిత ప్రాంతాలకు సహాయ బృందాలు తరలించాయి: అనిత
  • 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాం: అనిత
  • ఎటువంటి పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: అనిత
  • వరద ప్రాంతాల్లోకి వెళ్లేందుకు 5 బోట్లు, 1 హెలికాఫ్టర్లు సిద్ధంగా ఉంచాం: అనిత
  • హెచ్చరికలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలి: అనిత

2:17 PM, 1 Sep 2024 (IST)

ఏపీ-తెలంగాణ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు

  • ఏపీ-తెలంగాణ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు

  • కోదాడ పట్టణం నుంచి దిగువకు భారీగా ప్రవహిస్తున్న వరద
  • నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి చేరిన వరద నీరు

2:08 PM, 1 Sep 2024 (IST)

వర్షాలు, వరద పరిస్థితులపై సమీక్షించనున్న సీఎం

  • కాసేపట్లో విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి సీఎం చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరద పరిస్థితులపై సమీక్షించనున్న సీఎం

2:04 PM, 1 Sep 2024 (IST)

వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌

  • విజయవాడ: క్రమంగా తగ్గుతున్న బుడమేరు వరద ఉద్ధృతి
  • విజయవాడ: వరద నీటిలోనే కండ్రిగ, వుడా కాలనీ, రాజీవ్‌నగర్‌
  • విజయవాడ: వరద నీటిలోనే ప్రజాశక్తి కాలనీ, సుందరయ్యనగర్‌
  • వరదల కారణంగా పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • కండ్రిగలోని పునరావాస కేంద్రానికి వరద బాధితుల తరలింపు
  • వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌

1:59 PM, 1 Sep 2024 (IST)

రహదారిపై విరిగిపడుతున్న చెట్లు

  • ఆత్మకూరు-దోర్నాల, దోర్నాల-శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిపివేత
  • భారీ వర్షాల కారణంగా రహదారిపై విరిగిపడుతున్న చెట్లు
  • ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలు నిలిపివేత
  • నంద్యాల: భారీ వర్షాల కారణంగా ఆత్మకూరు జలమయం
  • ఆత్మకూరు సాయిబాబా నగర్‌, ఇందిరానగర్‌ జలమయం
  • ఆత్మకూరు ఏకలవ్య నగర్‌, రహమత్‌ నగర్‌, లక్ష్మీనగర్‌ జలమయం
  • నంద్యాల: ఆత్మకూరు ఏకలవ్యనగర్‌లో 30కి పైగా ఇళ్లలోకి వరద నీరు
  • భవనాశి వాగు పొంగడంతో ఆత్మకూరు-కొత్తపల్లి మధ్య నిలిచిన రాకపోకలు
  • ఆత్మకూరు-దుద్యాల, ఆత్మకూరు-వడ్లరామాపురం మధ్య నిలిచిన రాకపోకలు
  • నంద్యాల: గుండ్లకమ్మ వాగు పొంగడంతో నిలిచిన రాకపోకలు

1:54 PM, 1 Sep 2024 (IST)

జలదిగ్బంధంలో గుంటూరు బస్టాండ్‌

  • జలదిగ్బంధంలో గుంటూరు బస్టాండ్‌
  • చెరువును తలపిస్తున్న గుంటూరు బస్టాండ్‌
  • గుంటూరు బస్టాండ్‌లో నీటమునిగిన 130 ఆర్టీసీ బస్సులు
  • గుంటూరు నుంచి జిల్లా నలుమూలలకు నిలిచిన బస్సులు
  • గుంటూరు బస్టాండ్‌లో 4 అడుగుల మేర చేరిన వరద నీరు
  • గుంటూరులో పలుచోట్ల నుంచి బస్సులు నడుపుతున్న అధికారులు
  • గుంటూరు నుంచి పలుచోట్లకు 70 బస్సు సర్వీసులు
  • పల్నాడు, తెనాలి, అమరావతి రోడ్డు నుంచి బస్సు సర్వీసులు
  • రాత్రి నుంచి 3 మోటార్లతో నీటిని తోడుతున్న సిబ్బంది
  • రేపటికి వరదనీరు తోడి బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామన్న అధికారులు

1:54 PM, 1 Sep 2024 (IST)

వరద ప్రవాహంతో జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు

  • విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
  • ఎన్టీఆర్‌ జిల్లా: నందిగామ మం. ఐతవరం వద్ద హైవేపైకి వరద నీరు
  • వరద ప్రవాహంతో జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
  • మున్నేరు వరద ఉద్ధృతితో జాతీయరహదారిపైకి వరద

1:54 PM, 1 Sep 2024 (IST)

రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల తేలిపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

  • కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం
  • దక్షిణ ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ భూభూగాలపై వాయుగుండం
  • ఛత్తీస్‌గఢ్‌ జగదల్‌పూర్‌కు 60 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • మల్కన్‌గిరికి 70 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
  • వాయవ్య దిశగా 20 కి.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం
  • ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలహీన పడే సూచన
  • వాయవ్య భారత్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి
  • రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల తేలిపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
  • కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • రాష్ట్రంపై క్రమంగా తగ్గుతున్న వాయుగుండం ప్రభావం
  • క్రమంగా వర్షాల ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టే సూచన
  • తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో వర్షాలకు కృష్ణా నదిలో వరద ఉద్ధృతి
  • కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 7.25 లక్షల క్యూసెక్కుల వరద
  • బుడమేరు వల్ల విజయవాడ పశ్చిమ ప్రాంతాన్ని ముంచెత్తిన వరద

1:53 PM, 1 Sep 2024 (IST)

వరద ముంపులో లంక గ్రామాలు

  • కృష్ణా నది ఉద్ధృతితో వరద ముంపులో లంక గ్రామాలు
  • ఉద్దండరాయునిపాలెం లంక గ్రామస్థులను పడవల్లో తరలింపు
  • పడవల్లో వెళ్లి లంక గ్రామస్థులను తరలిస్తున్న అధికారులు
  • బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
  • పడవల్లో లంక గ్రామాలకు వెళ్లిన తుళ్లూరు తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది

1:53 PM, 1 Sep 2024 (IST)

రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పైకి వరద నీరు

  • విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పైకి వరద నీరు
  • వరదల కారణంగా రాయనపాడు మీదుగా వెళ్లే పలు రైళ్లు నిలిపివేత
  • హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
  • హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
  • రైళ్ల నిలిపివేతతో బస్సుల్లో ప్రయాణికుల తరలింపు
  • ప్రయాణికులను 50 బస్సుల్లో విజయవాడ స్టేషన్‌కు తరలింపు
  • విజయవాడ నుంచి విశాఖ, చెన్నైకి ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల తరలింపు

1:03 PM, 1 Sep 2024 (IST)

వరద బాధితులను ఆదుకోవాలని జనసైనికులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు

  • వరద బాధితులను ఆదుకోవాలని జనసైనికులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు
  • ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి: పవన్ కల్యాణ్
  • ఆహారం, తాగునీటితో పాటు వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి: పవన్
  • లోతట్టు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టాలి: పవన్‌ కల్యాణ్‌

12:57 PM, 1 Sep 2024 (IST)

బాపట్లలో వేటకు వెళ్లిన నలుగురు జాలర్ల ఆచూకీ గల్లంతు

  • బాపట్లలో వేటకు వెళ్లిన నలుగురు జాలర్ల ఆచూకీ గల్లంతు
  • పది రోజుల క్రితం చిన్నగంజాం మం. రుద్రమాంబరం నుంచి వేటకు వెళ్లిన జాలర్లు
  • నాలుగు రోజుల క్రితం కుటుంబసభ్యులతో జాలర్లకు నిలిచిన కమ్యూనికేషన్‌
  • జాలర్ల విషయమై పర్చూరు ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు
  • జాలర్ల ఆచూకీ కోసం బాపట్ల కలెక్టర్‌తో మాట్లాడిన పర్చూరు ఎమ్మెల్యే
  • పర్చూరు ఎమ్మెల్యే, కలెక్టర్‌ చొరవతో రంగంలోకి కోస్టు గార్డు సిబ్బంది
  • విశాఖకు 150 కి.మీ దూరంలో జాలర్ల పడవ గుర్తించిన కోస్టుగార్డు సిబ్బంది

12:56 PM, 1 Sep 2024 (IST)

రైతులు, బాధితులకు వెంటనే సాయం అందించాలి: సీఎం

  • రైతులు, బాధితులకు వెంటనే సాయం అందించాలి: సీఎం
  • నష్టం అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలి: సీఎం
  • పంట నష్టం అంచనా వేసి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి: సీఎం
  • దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని కూడా మదింపు చేయాలి: సీఎం
  • వర్షాలు, వరదల వల్ల ఆహారం, నీరు కలుషితం కాకుండా చూడాలి: సీఎం
  • గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి: సీఎం
  • వీలైనంత త్వరగా నివాస ప్రాంతాల్లో వరద లేకుండా చేయాలి: సీఎం
  • వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లి వైద్య శిబిరాలు పెట్టాలి: సీఎం
  • డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితి పర్యవేక్షించాలి: సీఎం

12:55 PM, 1 Sep 2024 (IST)

భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై సీఎం సమీక్ష

  • భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై సీఎం సమీక్ష
  • సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
  • సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద: సీఎం
  • ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా: సీఎం
  • బ్యారేజ్ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి: సీఎం
  • ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు పంపాలి: సీఎం
  • రహదారులు, ఇళ్లలో వరద సమస్య పరిష్కరించాలి: సీఎం
  • పలు జాతీయరహదారులు చెరువులను తలపిస్తున్నాయి: సీఎం
  • హైవే అథారిటీకి లేఖ రాసి సమన్వయంతో పనిచేయాలి: సీఎం

12:54 PM, 1 Sep 2024 (IST)

వినుకొండలో మల్లెడ వాగు ఉద్ధృతి

  • పల్నాడు జిల్ల వినుకొండలో మల్లెడ వాగు ఉద్ధృతి
  • పిట్టంబండ-ఉమ్మడివరం మధ్య వాగు ఉద్ధృత ప్రవాహం
  • వాగు ఉద్ధృతి వల్ల రాకపోకలు నిలిపివేసిన పోలీసులు

12:23 PM, 1 Sep 2024 (IST)

పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

  • వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
  • సికింద్రాబాద్-గుంటూరు, విశాఖ-సికింద్రాబాద్ రైళ్లు రద్దు
  • విజయవాడ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్‌నగర్ రైళ్లు రద్దు
  • కాకినాడ పోర్ట్-లింగంపల్లి, గూడూరు-సికింద్రాబాద్ రైళ్లు రద్దు
  • భద్రాచలం-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట్, కాజీపేట్-డోర్నకల్ రైళ్లు రద్దు
  • హైదరాబాద్-శాలిమార్, సికింద్రాబాద్-హావ్‌డా రైళ్లు రద్దు
  • సికింద్రాబాద్-తిరువనంతపురం, మహబూబ్‌నగర్ -విశాఖ రైళ్లు రద్దు
  • లింగంపల్లి-సీఎస్‌టీ ముంబయి, కరీంనగర్-తిరుపతి రైళ్లు రద్దు

12:12 PM, 1 Sep 2024 (IST)

కొండవీడు ఘాట్‌రోడ్డుపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు

  • పల్నాడు జిల్లాలో కొండచరియలు విరిగిపడి నిలిచిన రాకపోకలు
  • ఎడ్లపాడు మం. కొండవీడు ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
  • మూలమలుపుల వద్ద దారి పొడవునా విరిగిపడిన బండరాళ్లు
  • కొండవీడు ఘాట్‌రోడ్డుపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు

12:10 PM, 1 Sep 2024 (IST)

ఎన్టీఆర్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన మున్నేరు

  • ఎన్టీఆర్ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన మున్నేరు
  • ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పెనుగంచిప్రోలు చెరువు
  • లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై ప్రమాద స్థాయిలో వరద
  • పెనుగంచిప్రోలు వద్ద నీట మునిగిన గార్డెన్లు
  • తిరుపతమ్మ ఆలయాన్ని చుట్టుముట్టిన వరద నీరు
  • తిరుపతమ్మ ఆలయం వద్ద దుకాణాల్లోకి చేరిన వరద
  • పెనుగంచిప్రోలు ఎస్సీ కాలనీ, బోస్ పేట జలమయం
  • పెనుగంచిప్రోలులో వందలాది ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • పెనుగంచిప్రోలు మండలంలో నిన్నటి నుంచి నిలిచిన విద్యుత్
  • పెనుగంచిప్రోలులో పలుచోట్ల కూలిన విద్యుత్ స్తంభాలు
  • రహదారులపై గుంతలు పడటంతో పూర్తిగా నిలిచిన రాకపోకలు
  • పెనుగంచిప్రోలులో పొలాలను ముంచెత్తిన వరద
  • మున్నేరు పరివాహక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • నవాబుపేట చెరువుకు గండి పడటంతో పోటెత్తిన వరద
  • పోలంపల్లి డ్యామ్‌ వద్ద 19 అడుగులకు చేరిన నీటిమట్టం
  • కృష్ణా నదికి చేరుతున్న 1.90 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

11:59 AM, 1 Sep 2024 (IST)

నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన

  • ఏలూరు జిల్లాలో నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన
  • పెద్దచెరువు గండితో నీటమునిగిన ప్రాంతాలు పరిశీలించిన మంత్రి
  • ఏలూరు: సహాయ చర్యలు పర్యవేక్షించిన మంత్రి పార్థసారథి
  • పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశం

11:43 AM, 1 Sep 2024 (IST)

హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై స్తంభించిన రాకపోకలు

  • హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై స్తంభించిన రాకపోకలు
  • ఎన్‌హెచ్- 65పై పలుచోట్ల ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • కోదాడ- జగ్గయ్యపేట మధ్య హైవేపై ఉద్ధృతంగా వాగుల ప్రవాహం
  • నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • పెనుగంచిప్రోలు వద్ద హైవేపై ఉద్ధృతంగా పొంగుతున్న వాగులు
  • వాగుల ఉద్ధృతి వల్ల నెమ్మదిగా సాగుతున్న వాహనాల రాకపోకలు
  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్‌పల్లి - అద్దంకి వైపు మళ్లింపు
  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఖమ్మం వైపు దారి మళ్లింపు
  • కోదాడ-రామాపురం చెక్‌పోస్ట్ వద్ద నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
  • కోదాడ వద్ద హైవేపై ఒక్కవైపు మాత్రమే వాహనాలకు అనుమతి

11:38 AM, 1 Sep 2024 (IST)

సహాయ చర్యల కోసం రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

  • రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరద ముంపు
  • సహాయ చర్యల కోసం రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • నూజివీడులో చిక్కుకున్న 62 మందిని రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
  • ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం శాంతినగర్ వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • పరిటాల నూకన్ బ్లాక్స్ ఫ్యాక్టరీ వద్ద వరదలో చిక్కుకున్న కూలీలు
  • వరదలో చిక్కుకున్న 50 మంది కూలీలను రక్షించిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌
  • రాయనపాడులో వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించిన సిబ్బంది
  • విజయవాడ, జి.కొండూరు, ఏఎస్ రావు నగర్‌లో సహాయక చర్యలు
  • నున్న, పెనుగంచిప్రోలులో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ఆరుచోట్ల వరదల్లో చిక్కుకున్న 588 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో 2 వేల మంది పోలీసులు

11:35 AM, 1 Sep 2024 (IST)

విజయవాడ నగరంలోకి ప్రవేశించిన బుడమేరు వరద

  • విజయవాడలో ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
  • విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే బొండా ఉమ పర్యటన
  • విజయవాడ సింగ్‌నగర్, పైపులరోడ్డులో భారీగా వరద ప్రవాహం
  • వరద నీటిలో దిగి పరిశీలించిన మంత్రి నారాయణ, నేతలు
  • విజయవాడ: భారీ వర్షంతో పొంగుతున్న బుడమేరు
  • విజయవాడ నగరంలోకి ప్రవేశించిన బుడమేరు వరద

11:25 AM, 1 Sep 2024 (IST)

నిజాంపట్నం హార్బర్ వద్ద మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక

  • నిజాంపట్నం హార్బర్ వద్ద మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరిక
  • బాపట్ల జిల్లా: జెట్టికే పరిమితమైన చేపల వేట బోట్లు

11:24 AM, 1 Sep 2024 (IST)

రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

  • కంట్రోల్ రూమ్‌ల సేవలపై మంత్రి అచ్చెన్న సమీక్ష
  • రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
  • వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక శాఖ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
  • పశు నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలి: మంత్రి అచ్చెన్న

11:24 AM, 1 Sep 2024 (IST)

విజయవాడలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు

  • విజయవాడలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదు
  • 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెం.మీ వర్షపాతం
  • రెండు రోజులపాటు విజయవాడలో కుండపోత వర్షం
  • విజయవాడలో పలు కాలనీల్లో 4 అడుగుల మేర నిలిచిన నీరు
  • విజయవాడ ఆటోనగర్ నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు వరద నీరు

11:24 AM, 1 Sep 2024 (IST)

విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

  • విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు
  • హైదరాబాద్‌కు వెళ్లే రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్తలు
  • హైదరాబాద్-విజయవాడ మధ్య 30 రైళ్లు రద్దు
  • దూరప్రాంత రైళ్లు దారి మళ్లించి హైదరాబాద్‌కు నడుపుతున్న అధికారులు
  • విజయవాడ, గుంటూరు, నల్గొండ, పగిడిపల్లి మీదుగా హైదరాబాద్ మళ్లింపు

11:24 AM, 1 Sep 2024 (IST)

విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

  • విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత
  • ఖమ్మం: చింతకాని మం. గాంధీనగర్‌ వద్ద రైలు నిలిపివేత
  • మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్‌ దెబ్బతినడంతో రైలు నిలిపివేత
  • అర్ధరాత్రి 2.30 నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
  • మంచినీరు కూడా దొరక్క ప్రయాణికుల ఇబ్బందులు

10:55 AM, 1 Sep 2024 (IST)

విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు అంతరాయం

  • విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా వరద నీరు
  • విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు అంతరాయం
  • విజయవాడ సింగ్ నగర్, పైపుల రోడ్డు జలమయం
  • విజయవాడ సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్ నగర్ జలమయం
  • నున్న ప్రాంతంలో నీటమునిగిన అగ్నిమాపకశాఖ సిబ్బంది ఇళ్లు

10:47 AM, 1 Sep 2024 (IST)

తెలంగాణవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ

  • వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో అతి నుంచి అత్యంత భారీ వర్షసూచన
  • తెలంగాణలో మరో 24 గంటలపాటు అతి నుంచి అత్యంత భారీ వర్షసూచన
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షసూచన
  • రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • తెలంగాణవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ

10:07 AM, 1 Sep 2024 (IST)

భారీ వర్షాల దృష్ట్యా కృష్ణా జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

  • భారీ వర్షాల దృష్ట్యా కృష్ణా జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు 94910 63910, 08672 252090
  • 24 గంటలపాటు అందుబాటులో పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు
  • లోతట్టు ప్రాంతాల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామన్న జిల్లా ఎస్పీ
  • నదీ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

10:06 AM, 1 Sep 2024 (IST)

వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారుతుంది: ఐఎండీ

  • కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం
  • దక్షిణ ఒడిశాపై కేంద్రీకృతమైన వాయుగుండం
  • విశాఖకు 90 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
  • కళింగపట్నం, మల్కన్‌గిరికి 120 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • వాయవ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు కదిలే సూచన
  • వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారుతుంది: ఐఎండీ

9:30 AM, 1 Sep 2024 (IST)

కుందునదికి కొనసాగుతున్న వరద ప్రవాహం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నంద్యాల సమీపంలో కుందునది, మద్దిలేరికి నీటి ఉద్ధృతి పెరుగుతోంది. కుందునదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. మద్దిలేరు వాగు పొంగి ప్రవహించడంతో వంతెనపైకి నీరు వచ్చి చేరింది. మహనంది సమీపంలోని పాలేరుకి వరద ప్రవాహం కొనసాగుతోంది.

Heavy Rains in Andhra Pradesh
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న కుందునది (ETV Bharat)

9:14 AM, 1 Sep 2024 (IST)

వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయ చర్యలు

  • భారీ వర్షాలు, జిల్లాల్లో పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • చాలా ప్రాంతాల్లో వరద ఇబ్బందులున్నాయన్న అధికారులు
  • వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయ చర్యలు
  • సహాయ చర్యలు చేపడుతున్నట్లు సీఎంకు తెలిపిన అధికారులు
  • బాధితుల వద్దకు సహాయ బృందాలు వెళ్లేలా చూడాలని సీఎం ఆదేశం

9:01 AM, 1 Sep 2024 (IST)

భారీ వర్షాలతో ద.మ.రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

  • భారీ వర్షాలతో ద.మ.రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు
  • విజయవాడ డివిజన్ పరిధిలో సుమారు 30 రైళ్లు రద్దు
  • మహబూబాబాద్‌ జిల్లాలో పలుచోట్ల ధ్వంసమైన రైల్వేట్రాక్‌
  • విజయవాడ-కాజీపేట మార్గంలో ట్రాక్‌పైకి వరద చేరికతో 24 రైళ్లు నిలిపివేత
  • సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత
  • గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత
  • ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన ద.మ.రైల్వే

8:45 AM, 1 Sep 2024 (IST)

నున్న ప్రాంతంలో నీటమునిగిన అగ్నిమాపకశాఖ సిబ్బంది ఇళ్లు

  • విజయవాడలో పలు కాలనీలు జలమయం
  • విజయవాడ సుందరయ్య నగర్‌, రాజీవ్‌నగర్‌ జలమయం
  • విజయవాడ ప్రకాశ్‌నగర్‌, పైపులరోడ్డు జలమయం

  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు, వాగులేరు కట్ట, పాముల కాలువ

8:45 AM, 1 Sep 2024 (IST)

విజయవాడ బస్టాండ్ వద్ద జాతీయరహదారిపై భారీగా వరద నీరు

  • విజయవాడ బస్టాండ్ వద్ద జాతీయరహదారిపై భారీగా వరద నీరు
  • జాతీయరహదారిపై నిలిచిన వరదనీటిని తొలగించిన అధికారులు
  • విజయవాడ బస్టాండ్‌ వద్ద రైల్వే అండర్‌పాస్‌ కింద భారీగా వరద నీరు
  • వరద నీటిని భారీ మోటార్ల ద్వారా కృష్ణా నదిలోకి పంపింగ్
  • విజయవాడ: రైల్వేట్రాక్ అండర్ పాస్ వద్ద మునిగిన 4 బస్సులు
  • వరద నీటిలో మునిగిన బస్సులను క్రేన్ల సాయంతో బయటకు తీసిన అధికారులు
  • రైల్వేట్రాక్ కింది నుంచి కనకదుర్గ పైవంతెన మీదుగా వెళ్లే మార్గం పునరుద్ధరణ
  • విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నడుస్తోన్న బస్సులు

8:44 AM, 1 Sep 2024 (IST)

ధ్వంసమైన రైల్వే ట్రాక్‌

  • మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్‌
  • కేసముద్రం-ఇంటికన్నె మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌
  • రైల్వే ట్రాక్‌ కిందకు వరద చేరడంతో గాల్లో తేలిన పట్టాలు
  • రైల్వే ట్రాక్‌కు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీరు
  • మహబూబాబాద్: రైలు పట్టాల కింద కొట్టుకుపోయిన కంకర
  • మహబూబాబాద్: తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై వరద నీరు
  • మహబూబాబాద్ మం. అయోధ్య గ్రామంలో తెగిన చెరువు కట్ట
  • చెరువు కట్ట తెగడంతో మహబూబాబాద్ శివారు రైలు పట్టాలపై వరద
  • పందిళ్లపల్లి వద్ద 4 గంటలపాటు నిలిచిన మహబూబ్‌నగర్‌ - విశాఖ ఎక్స్‌ప్రెస్‌
  • విజయవాడ-కాజీపేట మార్గంలో నిలిచిపోయిన పలు రైళ్లు
  • మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో నిలిచిన మచిలీపట్నం, సింహపురి రైళ్లు

8:22 AM, 1 Sep 2024 (IST)

చెరువుకు గండి పెట్టి నీటిని బయటకు వదిలిన అధికారులు

పల్నాడు జిల్లాలోని దొడ్లేరు గ్రామంలో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో దొడ్లేరు చెరువు నిండి అలుగు పారుతోంది. దీంతో అధికారులు చెరువుకు గండి పెట్టి నీటిని బయటకు వదిలారు. మరోవైపు తమ పంటలు పాడవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Heavy Rains in Andhra Pradesh
పల్నాడు జిల్లాలోని దొడ్లేరు చెరువు (ETV Bharat)

8:18 AM, 1 Sep 2024 (IST)

పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్​ ఫోలో 6,82,000ల క్యూసెక్కులుగా ఉంది. క్యాచ్​మెంట్ ఏరియా నుంచి 76,000 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. అధికారులు మొత్తం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఔట్ ఫ్లో 5,91,000ల క్యూసెక్కులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 16,000 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.16 టీఎంసీలకు చేరింది.

Pulichinthala Project
Pulichinthala Project (ETV Bharat)

8:06 AM, 1 Sep 2024 (IST)

అల్లూరి జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు

  • అల్లూరి జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు
  • ఘాట్‌రోడ్లలో భారీ వాహనాలకు అనుమతి నిషేధించిన కలెక్టర్ దినేష్‌ కుమార్‌
  • అల్లూరి: జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశం
  • వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన
  • రంపచోడవరం ముంపు ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

8:05 AM, 1 Sep 2024 (IST)

కాజా టోల్‌ప్లాజా వద్ద చక్కబడిన పరిస్థితి

  • గుంటూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై కాజా టోల్‌ప్లాజా వద్ద చక్కబడిన పరిస్థితి
  • నిన్న టోల్‌ప్లాజా వద్ద వరదతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
  • అర్థరాత్రి వరకు శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు

7:40 AM, 1 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి

  • ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజీకి 5,66,860 క్యూసెక్కుల వరద ప్రవాహం
  • బ్యారేజీ మొత్తం 70 గేట్లు ద్వారా వరదనీరు దిగువకు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
Heavy Rains in Andhra Pradesh
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉద్ధృతి (ETV Bharat)

7:39 AM, 1 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

  • కొనసాగుతున్న కృష్ణా నది వరద ఉద్ధృతి
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
  • ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5,67,360 క్యూసెక్కలు
  • లోతట్టు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • కాలువలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచన
  • పడిపోయిన విద్యుత్ లైన్లు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచనృ
  • పొంగే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచన

7:38 AM, 1 Sep 2024 (IST)

కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం

  • కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం
  • అర్ధరాత్రి 2.30 సమయంలో తీరం దాటిన వాయుగుండం
  • ఇవాళ చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్ష సూచన
  • శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • అల్లూరి, కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • విశాఖ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు
  • ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు
  • వైఎస్‌ఆర్‌, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షసూచన

6:35 AM, 1 Sep 2024 (IST)

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

  • నేడు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • నేడు తీరంలో 45-65 కి.మీ వేగంతో గాలులు: విపత్తుల నిర్వహణ సంస్థ
  • మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు: విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్
  • తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

6:35 AM, 1 Sep 2024 (IST)

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం

  • పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
  • గడిచిన 6 గంటలుగా స్థిరంగా అదే ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం
  • కళింగపట్నానికి దక్షిణంగా 40 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • విశాఖకు ఈశాన్యంగా 80 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • ఇవాళ విశాఖ-గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం
  • రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం
  • మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

6:34 AM, 1 Sep 2024 (IST)

భారీవర్షాల వల్ల పలు మార్గాల్లో రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

  • భారీవర్షాల వల్ల పలు మార్గాల్లో రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే
  • ఇవాళ, రేపు తిరిగే రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ
  • విజయవాడ డివిజన్‌లో పలు మార్గాల్లో తిరిగే 41 రైళ్లు రద్దు చేసిన రైల్వే
  • ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు

Last Updated : Sep 1, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.