ETV Bharat / state

ఏపీలో దంచికొడుతున్న వానలు - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు - Heavy Rains in AP

Rains in Andhra Pradesh 2024 : వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వేల హెక్టార్లలో వరి నారు మళ్లు నీటమునిగాయి. రహదారులపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గోదావరికి వరద పోటుతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

Heavy Rains in Andhra Pradesh
Heavy Rains in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 9:40 AM IST

Heavy Rains in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్​లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం పడుతోంది. రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సీతానగరం మండలంలో వర్షాలకు బొబ్బిల్లంక - మిర్తిపాడు రహదారిపై వంతెన కొట్టుకుపోయింది. గోదావరి వరద ఉద్ధృతికి ములకల్లంక రహదారి నీట మునిగింది. కొవ్వాడ కాల్వ పంటలను ముంచేసింది.

Rain Alert in AP 2024 : తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు మండలాల్లో వానలకు వరి పంటలు మునిగాయి. వేల ఎకరాల్లో నాట్లు నీటిలో నానుతున్నాయి. ఏళ్ల తరబడి కొవ్వాడ కాల్వలో పూడిక తీయకపోవడం వల్ల వరద పంటలను ముంచెత్తింది. నల్లజర్ల మండలంలో ఎర్ర కాల్వ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 8,000ల హెక్టార్లపైగా వరి పొలాలు నీటిలో నానుతున్నాయి. మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, రాజానగరం ఎమ్మల్యే బత్తుల బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని పరిశీలించారు

తెలంగాణలో భారీ వర్షాలు - కొట్టుకుపోయిన రోడ్లు - నిలిచిపోయిన రాకపోకలు - Heavy Rains In Telangana

లంక గ్రామాల ప్రజలకు మరబోట్లు ఏర్పాటు : కోనసీమ జిల్లాలోనూ వర్షాలు పంటలను ముంచాయి. మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బూరుగుల్లంక వద్ద గోదావరిలో లంకవాసులు రాకపోకలు సాగించే రహదారి కొట్టుకు పోయింది. 4 లంక గ్రామాల ప్రజలకు మరబోట్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,000ల హెక్టార్లలో వరి నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. కలెక్టర్ మహేశ్​కుమార్ వరద పరిస్థితిని పరిశీలించారు. గోదావరి వరదలకు 45 లంక గ్రామాలు ప్రభావితం అయ్యాయి.

కాకినాడ జిల్లాలోనూ వానలకు లోతట్టు ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. అనకాపల్లి జిల్లా రావి కమతం మండలం కల్యాణపులోవ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో జలవనరుల శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 459 అడుగులకు చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - నిండుకుండలా మారిన ప్రాజెక్టులు - Telangana Dams With Full Water

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. అత్తిలి మండలం తిరుపతిపురంలో మీనవల్లూరు లాకుల వద్ద యనమదుర్రు కాలువ ఉద్ధృతిని పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. యనమదుర్రు కాలువ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న వారిని కలెక్టర్ పరామర్శించారు. అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అత్తిలిలో సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌, వర్షాల వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Heavy Rains in AP : ఏలూరు జిల్లాలో ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు అందించేందుకు అధికారులంతా సమన్వయంతో సాగాలని కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులకు భోజనం, మంచినీరు అందించాలన్నారు. పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించాలని చెప్పారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

గోదావరికి వరద పోటుతో అప్రమత్తమైన యంత్రాంగం : అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శబరి, సీలేరు పరివాహక ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా వరద వస్తోంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.8 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 4,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బ్యారేజీ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి మూడున్నర లక్షల పైగా వరద నీరు విడుదల చేస్తున్నారు.

సోమవారం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.