Heavy Rains are Falling in Many Districts of AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. జోరువానకు కాకినాడ, రాజమహేంద్రవరం తడిసిముద్దయ్యాయి. వాననీరు రోడ్లను ముంచెత్తడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనానికి ఆటంకం కలిగింది.
Kakinada District: వర్షాల ప్రభావంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో వారపుసంత చిన్నబోయింది. ప్రతీ శుక్రవారం ఇక్కడ ఎండు చేపల వర్తకం అధికంగా జరుగుతుంది. వర్షానికి సంతలోని సరుకులన్నీ తడిసిపోయాయి. వ్యాపారులు నష్టపోయారు. సరైన సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోయారు. ఇక్కడ సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు. వర్షానికి నక్కపల్లిలోని జగనన్న కాలనీ కూడా జలమయమై జనం ఇబ్బంది పడ్డారు.
Anakapalli District: కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వానకు కాకినాడ నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు, జగన్నాధపురం, సాంబమూర్తి నగర్, గుడారిగుంట, డైరీ ఫామ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు రహదారుల్ని ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీజీహెచ్ ప్రాంగణంలో భారీగా వర్షం నీరు నిలిచింది. రోగులు వారి వెంట వచ్చిన సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది వాన నీటిలో నడుచుకుంటూ సేవలందించారు. ఆర్టీసీ ప్రాంగణంలోకి భారీగా వర్షం నీరు చేరటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. జిల్లాలోని పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షం వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Rajamahendravaram: రాజమహేంద్రవరం వర్షానికి తడిసి ముద్దైంది. రామకృష్ణ నగర్, రామచంద్రరావుపేట, మోరంపూడి జంక్షన్, వీఐ పురం తదితర లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. శీలం నూకరాజు కాంప్లెక్స్ మార్గంలో రోడ్డు కుంగి రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది.
విజయనగరం జిల్లాలో వరదలు - వందల ఎకరాల్లో పంటలు నేలమట్టం - Crop Damage in Vizianagaram