ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వానలు, వరద గుప్పెట్లో ఊళ్లు - జలదిగ్బంధంలో వందలాది ఇళ్లు - Heavy Rains in Khammam 2024

Heavy Rains in Khammam 2024 : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద బీభత్సంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగుల ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

Khammam Floods 2024
Rain In Khammam District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 7:06 PM IST

Heavy Rain Across Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వాన ముంచెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వరద గుప్పెట్లో చిక్కుకుంది. అశోక్ నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న ఓ గర్భిణీ స్త్రీని, వృద్ధులను రెస్క్ బృందం బోటు సాయంతో వెళ్లి రక్షించింది. అటు బోనకల్ ప్రధాన రహదారిలో నాగులవంచ వద్ద ఆర్​అండ్​బీ రహదారిపై మూడు అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఆ మార్గంలో రవాణాన్ని నిలిపివేశారు. లింగాల-డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోగా, కారేపల్లిలో కస్తూర్బా పాఠశాల ఆవరణలోని వరద నీరు భారీగా చేరింది. దంసలాపురం కాలనీలోకి వరద నీరు చేరడంతో, కాలనీవాసులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు.

ఖమ్మంలోని భారీవర్షాల కారణంగా 15 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారు. వాల్య తండాలో చెరువు తెగడంతో 10 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకోగా, ఓ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి అదే వరదలో మరో నలుగురు చిక్కుకున్నారు. అటు తీర్థాల వరద ఉద్ధృతిని చూసేందుకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు అక్కడే ఇరుక్కపోయారు. ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు చెరువు అలుగు పోస్తూ, వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఇందిరమ్మ కాలనీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి : వైరా మండలంలో వరద ఉద్ధృతికి పలుచోట్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నల్లచెరువు పొంగి వరద నీరు ఇందిరమ్మ కాలనీకి పోటెత్తింది. నీరు ఇళ్లల్లోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిరమ్మ కాలనీని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

కొనిజర్ల మండలంలో పగిడేరు, వైరా ఏరు రహదారిపై నుంచి ప్రవహించడంతో ఖమ్మం -ఏన్కూరు రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. పలు చోట్ల భారీ వర్షాలతో పొలాల్లోకి వరద నీరు చేరి పంటలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలో ఉన్న పెద్ద వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో తాత్కాలికంగా నిర్మించిన రింగ్ బాండ్‌కు భారీగా గండ్లు పడటంతో నిలిచిన నీరంతా బయటకు వెళ్లింది.

నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం నిండుకుండలా తలపిస్తోంది. ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి లక్షా 4 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 404.5 అడుగులకు చేరుకుంది. కిన్నెరసాని గేట్లు ఎత్తి ఉన్నందున, పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటి విడుదలతో ఇప్పటికే రాజాపురం గ్రామం వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఖమ్మంలో మున్నేరు వాగు బీభత్సం - వరదలో చిక్కుకుపోయిన 9మంది, రంగంలోకి హెలికాప్టర్లు - Munneru Vagu Heavy Flood

తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.