ETV Bharat / state

జంట నగరాల్లో భారీ వర్షం - చెరువులను తలపిస్తున్న రహదారులు - heavy rainfall in hyderabad - HEAVY RAINFALL IN HYDERABAD

Heavy Rainfall in Hyderabad and Secunderabad : జంట నగరాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​, సికింద్రాబాద్​ నగరాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

Heavy Rainfall in Hyderabad and Secunderabad
Heavy Rainfall in Hyderabad and Secunderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 7:52 PM IST

Updated : Jun 30, 2024, 8:24 PM IST

Heavy Rain in Hyderabad and Secunderabad : అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్, సికింద్రాబాద్​ జంట నగరాల్లో వాతావరణం చల్లబడింది. ఈ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోయిన్​పల్లి, తిరుమలగిరి, అల్వాల్​, మారేడుపల్లి, చిలకలగూడ, పారడైజ్​, బేగంపేట, కవాడిగూడ, బాగ్​లింగంపల్లి, జవహర్​నగర్​, ఖైరతాబాద్​, ఎర్రమంజిల్​, పంజాగుట్ట, బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​, బోరబండ, అమీర్​పేట, యూసఫ్​గూడ, ముషీరాబాద్​, చిక్కడపల్లి, గాంధీనగర్​, దోమలగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అలాగే ఆర్టీసీ క్రాస్​ రోడ్, భోలక్​పూర్​, నారాయణగూడ, హిమాయత్​నగర్​, కోఠి, అబిడ్స్​, నాంపల్లి, బషీర్​బాగ్​, చాదర్​ఘాట్​, మలక్​పేట్​, సైదాబాద్​, చంపాపేట్​, లక్డీకపూల్​, హిమాయత్​నగర్​, మేడ్చల్​, కండ్లకోయ, దుండిగల్​, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులు అన్నీ జలమయమయ్యాయి. రహదారులు, కాలనీల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజానికం ఇబ్బంది పడ్డారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్​లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీరు మొత్తం రోడ్లపై పారుతుండడంతో ఎక్కడ ఏ మ్యాన్​హోల్​ ఉందోనని జనం భయం గుప్పిట్లో ఉన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణపై ఉపరితల ఆవర్తనం - పలు జిల్లాల్లో భారీవర్ష సూచన - Hyderabad Rain Updates

వర్షంలో తడుస్తూ అమ్మాయి రీల్స్- సడెన్​గా భారీ శబ్ధంతో పిడుగు- ఆ తర్వాత ఏమైదంటే? - Lightning struck while making reels

Last Updated : Jun 30, 2024, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.