Hyderabad Rains Today : హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, సరూర్‌నగర్, నాగోల్, చంపాపేట, సైదాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వాన దంచికొట్టింది. అశోక్‌నగర్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, అడిక్‌మెట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఉప్పల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, లంగర్‌హౌస్, కార్వాన్, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. గచ్చిబౌలి, రాయదుర్గం, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, బండ్లగూడ, గండిపేట, అత్తాపూర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రాజేంద్రనగర్‌లోని బాబుల్‌రెడ్డి నగర్ కాలనీలో ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. కీసరలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
హైదరాబాద్ పరిసరాల్లో భారీ వర్షం.. రంగంలోకి జీహెచ్ఎంసీ..!
దీనికితోడు వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వారు దుకాణాల వద్ద, మెట్రో పిల్లర్ల కింద తలదాచున్నారు. మరోవైపు పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పనులపై బయటకు వెళ్లిన వారు, ఉద్యోగాలకు వెళ్తున్న వారు ట్రాఫిక్‌లో చిక్కుకుని వానలో తడిసిముద్దయ్యారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత అల్లాడిన నగర ప్రజలకు ఈరోజు పడిన వర్షానికి కాస్త ఉపశమనాన్ని కలిగించింది.
Heavy Rains In Telangana Today : మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వాన దంచికొట్టింది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, ధర్మసాగర్, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో జోరు వాన కురిసింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్, తరిగొప్పుల మండలాల్లో కురిసిన వర్షంతో గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో పలు చోట్ల వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage In Telangana
సిద్దిపేట జిల్లాలో భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. సుల్తానాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం వర్షార్పణమైంది. గత 15 రోజులుగా ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తున్నా అధికారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. యాదగిరిగుట్టలో కాసేపు చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది, బొమ్మలరామారం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన జనం