Rain Alert In Telangana : ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో ఇవాళ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వర్షం పడే అవకాశముందని వివరించింది. రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడతాయి కాబట్టి ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
Ronald Ras Inspection In Sherlingampally : మరోవైపు హైదరాబాద్ మహానగరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. శేరిలింగంపల్లి జోన్లోని హైటెక్ సిటీ, బయో డైవర్సిటీ, క్యూ మార్ట్, డీఎల్ఎఫ్ ప్రాంతాలను కమిషనర్ రోనాల్డ్ రాస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. వరద నీరు నిలిచిపోవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారులకు చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. వర్షం పడిన ప్రతీసారి చాలాచోట్ల పదే పదే నీరు నిలవడంతో అధికారులపై మండిపడ్డారు. నీటిని మళ్లించేందుకు అవసరమైన ప్రతిచోటా బాక్స్ డ్రైయిన్లను నిర్మించాలని ఆదేశించారు.
TS Weather Report: బీ అలర్ట్.. రాగల మూడు రోజులు వడగళ్ల వర్షాలు..!