Heavy Income To Telangana From Pending Challans : పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దీంతో చలాన్లు(Challons) ఉన్నవారు గడువు ముగియముందుకే చెల్లింపులు చేయాలని పోలీసులు సూచించారు. కాగా గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాయితీతో వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల చెల్లింపులతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,52,47,864 కోట్ల చలాన్లకు రూ.135కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్‌లో రూ.25 కోట్లు, రాచకొండలో రూ.16 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు 42.38 శాతం చలాన్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయని అధికారులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది. 15 రోజులు అవకాశం కల్పించిన ప్రభుత్వం సర్వర్ సమస్య సహా చలాన్లు చెల్లించేందుకు వాహనదారులు ఉత్సాహం చూపడంతో జనవరి 31వ తేదీ వరకు గడువు పొడిగించింది.
ఫైన్లైనా కడతాం కానీ రూల్స్ పాటించం - గంటకు 1,731 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు
Telangana Traffic Challan Discount : రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్(Traffic rules) ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెబుతున్నా వాహనదారులు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువైపోతున్నాయి. రాంగ్ రూట్‌లో వెళ్లడం, లైసెన్స్, హెల్మెట్ లేకుండా నడపడం, మద్యం తాగి వాహనాలు (Drunk And Drive) డ్రైవ్ చేయడం తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
పెండింగ్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ - ఈ నెల 26 నుంచి ఛాన్స్
ట్రిపుల్ రైడింగ్ చేయడమే ట్రాఫిక్ రూల్స్‌కు (Traffic Rules) విరుద్ధం. అయితే కొంతమంది నలుగురిని, ఐదుగురిని వాహనాలపై కూర్చో పెట్టుకుని డ్రైవ్ చేస్తుంటారు. ఇలా వారు రూల్స్ పాటించకుండా వాహనాలు నడపటం కారణంగా చలాన్లు పెరిగిపోతున్నాయి. కానీ వాహనదారులు మాత్రం చలాన్లు పడుతున్నా, వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ట్రాఫిక్ పోలీసు అధికారులు రాయితీ అవకాశం కల్పించారు.
పోలీస్ శాఖ ప్రకటించిన డిస్కౌంట్‌ల వివరాలు :
- ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ
- ద్విచక్రవాహనాల చలాన్లపై 80 శాతం డిస్కౌంట్
- ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం రాయితీ
- లారీలు, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం డిస్కౌంట్
Traffic Pending Challan: మూడు రోజుల్లో రూ.39 కోట్లు.. పెండింగ్ చలాన్లకు భారీ స్పందన
Hyderabad Traffic Challan: పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన.. మొరాయించిన సర్వర్