ETV Bharat / state

అలర్ట్ అలర్ట్ - కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - FIRST ALERT TO KALESHWARAM - FIRST ALERT TO KALESHWARAM

Telangana Projects Floods Today : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. 85 గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తి ఉండడంతో 8లక్షల 19వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 16వేల 850 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 66 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.

Flood Water Reaches Medigadda
Rains To Continue Across Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 12:37 PM IST

Updated : Jul 22, 2024, 2:07 PM IST

Medigadda Floods Updates : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తి 8లక్షల 19వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 16వేల 850 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 66 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.

Kaleshwaram Floods Latest News : మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహంతో గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉప్పొంగడంతో పుష్కర ఘాట్లు, స్నాన ఘాట్లలను వరద ముంచెత్తింది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి పుష్కర ఘాట్ల వద్ద స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వరద ఉద్దృతికి పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచాయి.

Flood Water Flows to Sriram Sagar Project : నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.518 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండుకున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నూర్, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు.

Huge Flood Water At Krishna River : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకండలా దర్శనమిస్తున్నాయి. ఆలమట్టి , నారాయణపూర్ నుంచి జూరాల జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో జూరాల వద్ద 27 గేట్లు తెరిచి దిగువకు లక్షా 33 వేల 497 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్య 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.115 టీఎంసీలుగా ఉంది. దీంతో పరిసర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఏకధాటిగా వర్షాలు - ఆనందంలో రైతన్నలు - సాగు పనిలో బిజీబిజీగా - TELANGANA RAINS 2024

మేడిగడ్డకు పెరిగిన వరద ఉద్ధృతి - నిండు కుండలా మారిన బ్యారేజీ - Flood Water Reaches Medigadda

Last Updated : Jul 22, 2024, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.