Heavy rains Alert across Telangana : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాలతోపాటు భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఆదివారం, సోమవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. నగరంలో మరో రెండు గంటలపాటు తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు శుక్రవారం రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాదారులు రాకపోకలకు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే భారీగా వరదలు రావడంతో ప్రజలకు చాలా ఇబ్బందులకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి బడా భీంగల్ గ్రామంలో రోడ్డుపై ఆర పెట్టిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. భీంగల్‌కు వెళ్లేదారిలో చెట్టు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం - రోడ్లపై పారుతున్న వరద నీరు - Heavy Rain in Hyderabad