ETV Bharat / state

నిప్పులకుంపటిగా తెలంగాణ - వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - heat waves in telangana - HEAT WAVES IN TELANGANA

Heat Waves in Telangana : మండిపోతున్న ఎండలు, రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇది ప్రతి ఏడాది ఉండేదే కదా, అంటారా? కానీ, ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇంతితై అన్నట్లు ఎప్పుడూ లేనంతగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుత వేసవి కాలంలో ఇప్పటికే 43.5 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు, రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ-ఐఎండీ తెలిపింది. మరి దీనికి కారణాలేంటి.? ఉష్టోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణమా? వడగాల్పుల భారిన పడకుండా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

Summer Precautions for Sunburn
Heat Waves in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 7:28 PM IST

నిప్పులకుంపటిగా తెలంగాణ- వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Heat Waves in Telangana : భారతదేశంలో ఏడాది పొడవునా ఏదో ఒక సీజన్‌ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి 4 నెలల కొకసారి మారే వాతావరణంతో ప్రజల జీవన విధానంలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సీజన్ల క్రమంలోనే ఇప్పుడొచ్చింది వేసవి కాలం. చలిగాలుల నుంచి నెమ్మదిగా బయటపడే మానవాళికి నేనున్నానంటూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్‌ నెలలో ప్రారంభమయ్యే ఎండల తీవ్రత ఈ ఏడు ఫిబ్రవరిలోనే మొదలైంది.

ఎండాకాలంలో స్ట్రోక్ ప్రమాదం! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! - Heart Stroke In Summer

దేశవ్యాప్తంగా నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికంగా నమోదయ్యాయి. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న ఉష్టోగ్రతలు(Temperatures Rises) గురువారం గరిష్టంగా 43.5 డిగ్రీలు నమోదయ్యాయి. 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్టోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉష్టోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపిన భారత వాతావరణ శాఖ(IMD), వడగాల్పులు కూడా వస్తాయని హెచ్చరించింది.

ఏప్రిల్‌ నెలలోనూ ఉష్ణోగ్రతలు(Heat Waves) తీవ్రస్థాయికి చేరతాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల గురించి ఓ సారి అంచనా వేస్తే, తెల్లవారుజామున చలి గాలులతో మొదలయ్యే వాతావరణం సమయం పెరిగేకొద్ది ఎండ తీవ్రత పెరుగుతోంది. ఓ విధంగా చెప్పాలంటే ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకూ ఎండ వేడికి భయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

పెరుగుతున్న ఉష్టోగ్రతలకు మానవ తప్పిదాలే కారణమని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం ముందు నాటి పరిస్థితితో పోలిస్తే చాలా వరకు పెరిగింది. వీటితో పాటు మనిషి సుఖజీవనానికి అలవాటుపడి వినియోగిస్తున్న ఏసీలు వంటి యంత్రాలు కూడా పర్యావరణాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే వాహనాల వినియోగం పెరిగి పోయింది. దీంతో కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి.

ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - how much water to drink in Summer

అధిక స్థాయిలో నమోదవుతున్న ఎండలు ఆర్థిక నష్టానికి కారణమవుతున్నాయి. పెరుగు తున్న ఎండలతో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ముఖ్యమైన రంగాలకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలింది. మునుపటితో పోల్చితే ఈ సారి వస్తున్న వేసవి, ప్రజలకు కూడా అగ్ని పరీక్ష లాంటిదే. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండల తీవ్రత ఇలా ఉంటే ఆ తాకిడి నుంచి బయట పడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అసలు ప్రశ్న. అనారోగ్య సమస్యలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు, పశువుల మేత, పంటల దిగుబడి తగ్గడం లాంటి అనేక సమస్యలు దీనితో ముడిపడి ఉన్నాయి.

Summer Precautions for Sunburn : ఎండల నుంచి బయటపడటానికి దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ -(ORS)ను వినియోగించాలి. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలను తీసుకోవాలి. పుచ్చ, కర్బూజ, ఆరెంజ్, ద్రాక్ష, వంటి అధిక నీటి కంటెంట్‌ ఉన్న సీజనల్‌ పండ్లు, కూరగాయలను తినాలి. అలాగే పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినాలని నిపుణులు సూచిస్తున్నా రు.

కళ్ళు తిరగడం, వికారంగా, తలనొప్పిగా ఉండడం, విపరీతమైన దాహం వేయడం, మూత్ర విసర్జన తగ్గడం, మూత్రం రంగు మారడం, గుండె దడ వంటి లక్షణాలు వడదెబ్బ(Sunburn) యొక్క సాధారణమైన లక్షణాలు. ఎవరైనా వడదెబ్బకు గురైతే అత్యవసర పరిస్థితిలో 108కి కానీ 102కు కానీ కాల్ చేసి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని పేర్కొంది. ఎండలు మండుతాయని ఈ నేపథ్యంలోప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఎండ తాకిడి నుంటి తమకుతాము రక్షించుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో పట్టపగలే చుక్కలు చూపిస్తోన్న సూరీడు - గడప దాటేందుకు జంకుతున్న ప్రజలు - Temperatures Rises in Telangana

తెలంగాణలో భానుడి భగభగ - కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జూస్​లతో చలచల్లగా - Demand For Fruit Juices In Summer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.