ETV Bharat / state

కండలు తిరిగిన దేహం కోసం ఆ డ్రగ్​ తీసుకుంటున్నారా? అయితే మీ ప్రాణాలకు ముప్పే! - Health Problems with Mephentermine - HEALTH PROBLEMS WITH MEPHENTERMINE

Health Problems with Mephentermine Use : మెఫెంటర్మైన్. డాక్టర్ల సలహా లేకుండా వాడకూడని ఔషధం. దీనిని ఉపయోగించడం వల్ల అత్యవసర సమయాల్లో ప్రాణం నిలవడమే కాదు, ఎక్కువగా వాడితే ప్రాణాంతకర సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే జిమ్​లో కసరత్తులు చేసే వారిని టార్గెట్​గా చేసుకుని కొన్ని ముఠాలు వారికి ఈ మెఫెంటర్మైన్​ను సరఫరా చేస్తూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. దీనిని తీసుకోవడం వల్ల నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

Health Problems with Mephentermine Use
Health Problems with Mephentermine Use
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 7:37 PM IST

మెఫెంటర్మైన్ అతిగా వాడితే ప్రాణానికే ముప్పు : డ్రగ్​ కంట్రోల్ అధికారులు

Health Problems with Use : మెఫెంటర్మైన్‌. ఇది వైద్యుల సలహా లేకుండా వాడకూడని ఔషధం. దీనిని వాడటం వల్ల అత్యవసర సమయాల్లో ప్రాణం నిలవడమే కాదు. అధికంగా వాడితే ప్రాణానికి ముప్పు తప్పదని డ్రగ్‌ కంట్రోల్ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. భారీగా కండలు పెంచాలనుకునే వారిని టార్గెట్‌గా చేసుకుని కొన్ని ముఠాలు వారికి మెఫెంటర్మైన్‌ను సరఫరా చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.

Muscle-Growth Injections can Do More Harm : దీర్ఘకాలిక ప్రమాదకారి అయిన మెఫెంటర్మైన్ (Mephentermine) నగరంలో పలుచోట్ల దర్శనమిస్తుంది. సిక్స్‌ప్యాక్‌తో పాటు భారీగా కండలు కనిపించేలా చేసే స్టెరాయిడ్‌గా ఇది పని చేస్తుండటంతో కొందరు యువత (Youth) దీనివైపు ఆకర్షితులవుతున్నారు. ఇదే అదనుగా భావించి కొందరు అవకాశవాదులు ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.2 వేలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇంజెక్షన్‌ (Injection) తీసుకుంటే ఎక్కువ సేపు కసరత్తులు చేయవచ్చని కొందరు జిమ్‌ ప్రేమికులు వీటిని వాడుతున్నారు. వీటి వాడకం వల్ల అనారోగ్యం పాలవుతారని నిపుణులు అంటున్నారు.

"మెఫెంటర్మైన్‌ అనే ఔషధం ఒక షెడ్యులైజిడ్ డ్రగ్. దీనిని డాక్టర్ల సలహా లేకుండా ఉపయోగిస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు హైబీపీ, నిద్ర లేమి లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఇంజెక్షన్లను ఉపయోగించకపోవడమే మంచిది. దీనిని అత్యవసర సమయాల్లో మాత్రమే వైద్యులు ఉపయోగిస్తుంటారు." - రాజమౌళి, అసిస్టెంట్ డైరెక్టర్, డీసీఏ

డాక్టర్ల సలహా లేకుండా ఇంజక్షన్ తీసుకోవద్దు : ఇటీవల ఆసిఫ్‌నగర్‌లో ఓ జిమ్‌కు సంబంధించిన యజమాని, జిమ్‌ ట్రైనర్, రిసెప్షనిస్ట్‌ ముగ్గురు మెఫెంటర్మైన్‌ ఔషధాన్ని అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు నగరంలో చాలా జరిగాయి. 8 నెలల క్రితం మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో 400 మెఫెంటర్మైన్‌ ఇంజెక్షన్‌లను డ్రగ్ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇంజెక్షన్‌ వాడటం వల్ల దీర్ఘకాలికంగా గుండె పోటు (Heart Attack) వస్తుందని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు చెబుతున్నారు. అనవసరంగా కండల కోసం ఆశపడి డాక్టర్ సలహా లేకుండా ఇది తీసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. శారీరక శ్రమ ద్వారా దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి గానీ, నిషేధిత డ్రగ్స్‌ వాడి, కండలు పెంచుదాం అనుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అక్రమంగా మెఫ్టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.