ETV Bharat / state

3 ఏళ్ల కిందట 6 కార్లు అదృశ్యం - కట్​చేస్తే పులివెందులలో ప్రత్యక్ష్యం - ఎట్టకేలకు బాధితుడి చెంతకు - HARI HARA TRAVELS SATISH CARS CASE

మూడేళ్ల నుంచి వైఎస్​ఆర్సీపీ నాయకుల చెరలో ఆరు కార్లు - తెలంగాణ ట్రావెల్స్ యజమాని విజ్ఞప్తిపై ఏపీ కూటమి ప్రభుత్వం స్పందన

Hari Hara Travels Owner Satish Cars Case Update
Hari Hara Travels Owner Satish Cars Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 5:06 PM IST

Hari Hara Travels Owner Satish Cars Case : సంగారెడ్డి జిల్లాకు చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీశ్​ ఆరు కార్లను ఎట్టకేలకు పులివెందుల నుంచి సంగారెడ్డి పోలీసులు తీసుకువచ్చారు. గత మూడేళ్ల నుంచి కార్ల అదృశ్యంపై పోరాడుతుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 30 రోజుల్లోనే తమ సమస్యను కొంతమేర పరిష్కరించినట్లు సతీశ్​ చెప్తున్నారు. అతని వద్ద నుంచి వికారాబాద్​కు చెందిన మణిరాజ్ ఆరు కార్లను అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆ కార్లను కడప జిల్లా పులివెందులలో ఎంపీ అవినాశ్​ అనుచరులకు మణిరాజ్ కొదవ పెట్టాడు. తెలంగాణలో ఉండాల్సిన కార్లు ఆంధ్రప్రదేశ్​లో కనిపించడంతో ట్రావెల్స్ యజమాని సతీశ్​కు అనుమానం వచ్చింది. పరిశీలించి చూడగా అవి తమ కార్లే అని నిర్ధారణకు వచ్చిన సతీశ్​, తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఎంపీ అవినాశ్​ అనుచరులు అతనిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ట్రావెల్స్​ యజమాని​ ఆరోపిస్తున్నారు.

కార్లకు కట్టాల్సిన ఈఎమ్​ఐల కోసం అప్పు : తన వద్ద అద్దెకు తీసుకున్న మణిరాజ్ మాత్రం పరారీలో ఉన్నాడని, కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో మూడేళ్ల నుంచి నరకయాతన అనుభవిస్తున్నట్లు సతీశ్​ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 30 రోజుల వ్యవధిలోని తమ కారులు తిరిగి సంగారెడ్డికి తెప్పించడంపై సతీశ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ మూడేళ్లలో కార్లకు కట్టాల్సిన ఈఎమ్​ఐల కోసం అప్పు తెచ్చి మరీ చెల్లించినట్లు చెప్తున్నారు.

దాదాపు తమకు కోటి రూపాయలు పైన ఈ కార్ల నుంచి అద్దె రావాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా తమకు చేరలేదని సతీశ్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు బాధలు తాళలేక ఏడాది నుంచి కూడా తమ తల్లిదండ్రులకు కనీసం మొహం కూడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కార్లను తెప్పించిన రీతిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయం చేసే విధంగా తమ కార్ల వినియోగించుకున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని హరిహర ట్రావెల్స్ యజమాని సతీశ్ విన్నవించారు.

ఏపీ డిప్యూటీ సీఎం దాకా వెళ్లిన 'BMW' కార్ల పంచాయితీ - అసలేమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.