ETV Bharat / state

మందుబాబులకు బ్యాడ్​ న్యూస్​ - జంట నగరాల్లో ఆ రోజు వైన్సులు బంద్ - Liquor Stores Close in Hyderabad - LIQUOR STORES CLOSE IN HYDERABAD

Hyderabad CP orders to close liquor shops : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని జంట నగరాల్లో నిర్వహించే విజయ యాత్రకు సర్వం సిద్దమైంది. ఈ నెల 23న జరిగే హనుమాన్‌ శోభాయాత్ర దృష్ట్యా జంట నగరాల్లోని మద్యం దుకాణాలు అన్ని మూసివేయాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Hanuman Shobha Yatra in Hyderabad
Hanuman Shobha Yatra in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 8:05 PM IST

Liquor Stores Close in Hyderabad : ఈ నెల 23న జరిగే హనుమాన్‌ శోభాయాత్ర దృష్ట్యా జంట నగరాల్లోని మద్యం దుకాణాలు అన్ని మూసివేయాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్లు అన్ని మూసివేయాలన్నారు.

Hyderabad CP orders to close liquor shops : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ చట్టంలో సెక్షన్ 20 (1) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హనుమాన్​ జయంతి నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగే విజయయాత్ర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హనుమాన్ విజయయాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను దారి మళ్లించనున్నట్లు ఆయన వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.