Young Woman Got 3Govt Jobs Along With Civil Service: వరస అపజయాలు పలకరించినా కుంగిపోలేదు ఈ యువతి. పట్టుదలతో కఠిన సవాళ్లకు ఎదురు నిలబడి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. చదివింది ఇంజనీరింగ్(Engineering) అయినా 6 ఏళ్లు శ్రమించి కలల కొలువు ఒడిసి పట్టుకుంది. అన్ని అవాంతరాలనూ దాటుకుని చివరి ప్రయత్నంలో సివిల్స్(Civils) లో ఉత్తీర్ణురాలైంది. ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) చేస్తూనే అనుకున్నది సాధించింది భవ్య.
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన న్యాయవాది(Lawyer) లీలా ప్రసాద్ పెద్దకుమార్తె భవ్య. చిన్నప్పటి నుంచీ చదువులో చురుగ్గా ఉండేది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(Computer Science Engineering)లో బంగారుపతకం(Gold Medal) సాధించింది. కాలేజీలో ఉండగానే టీసీఎస్ కంపెనీలో ఉద్యోగ అవకాశం(Job Opportunity in TCS Company) వచ్చినా సివిల్స్ సాధించాలనే ఉద్దేశంతో వదులుకున్నానని అంటోంది. ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగంలో చేరకపోవడంతో బంధుమిత్రుల నుంచి విమర్శలు ఎదుర్కొంది భవ్య.
ఎత్తుకు పైఎత్తులు - చెస్‌లో దూసుకుపోతున్న విజయవాడ యువకుడు
వరసగా 5 సార్లు సివిల్స్‌లో వివిధ దశల్లో వెనుదిరగడంతో మరింత ఆందోళన పడింది. తోటివారంతా ఉద్యోగాలు సాధిస్తున్నా తాను విఫలం కావడంతో నిరాశ ఎక్కువై ఓ దశలో తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పడంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకుని స్పష్టమైన ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధమయ్యింది. పట్టుదలగా చదివి చివరి ప్రయత్నంలో 2023 నవంబర్‌లో వచ్చిన ఫలితాల్లో ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్(Indian Railway Engineering Service)కు ఎంపికయ్యింది.
శ్రేయోభిలాషులు కొందరు సివిల్స్‌కు ప్రయత్నించడం ఆపేయమని సూచించడంతో ఒక దశలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి(Software Job) వెళ్లాలని అనుకుంది భవ్య. అనుకోకుండా గ్రూప్స్‌లో ఎంపీడీవో(MPDO) పోస్టు రావటంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. తర్వాత ఎంపీడీవోగా పనిచేస్తూనే సివిల్స్ ప్రయత్నాలను కొనసాగించింది. ఈ క్రమంలోనే 2023 ఆగస్టులో స్పోర్ట్స్ అథారిటీ డైరక్టర్ ఉద్యోగం(Sports Authority Director Job) సాధించింది. అక్కడ కుదురుకుంటున్న దశలోనే యూపీఎస్సీ రిజర్వ్ లిస్టు(UPSC Reserve List)లో తన పేరును ప్రకటించడంతో భవ్య కల నెరవేరింది. అలా ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు(Three Govt Jobs) దక్కించుకుంది.
స్పోర్ట్స్ అథారిటి డైరక్టర్‌గా 4 నెలల పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించింది భవ్య. ఒలింపిక్ బిడ్(Olympic Bid)కు భారతదేశం(India) ఎలా సిద్ధం కావాలని ప్రణాళికలు రూపొందించే బృందంలోనూ పనిచేసింది. ఆ సమయంలో ప్రధాని మోదీ(Prime Minister Modi)తో సహా పలువురు క్రీడారంగ ప్రముఖులనూ కలిసింది. అలాగే తన లక్ష్య సాధనలో ఈనాడు పత్రిక(Eenadu Magazine) ఎంతగానో ఉపకరించిందని చెప్తోంది.
సివిల్స్‌లో ఐఆర్ఎస్ఈ(IRSE) ఈ సారే ప్రవేశపెట్టారని, తొలిబ్యాచ్‌లో తాను ఉండటం సంతోషంగా ఉందని అంటోంది భవ్య. 2 నెలలుగా శిక్షణ తీసుకుంటున్నానని, ఇంకా దేశంలోని 8 ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేయాలని చెబుతోంది. భారతీయ రైల్వే ఆధునీకరణ(Modernization of Indian Railways)కు తన వంతు కృషి చేస్తానని అంటోంది.
వరస ఓటములు, విమర్శలు ఎదురైనా కుమార్తె కల నెరవేర్చుకునేలా ప్రోత్సహించామని చెబుతున్నాడు భవ్య తండ్రి. చివరి అవకాశం వరకూ నిరాశ పడకుండా పట్టుదలతో శ్రమించి ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది భవ్య. అపజయాలకు బెదరకుండా పోరాటాన్ని కొనసాగిస్తే కచ్చితంగా లక్ష్యం చేరుకోగలమని సూచిస్తోంది.
ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు- గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు