ETV Bharat / state

'నాపై, నా తమ్ముడిపై తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా' - MLA GUMMANUR WARNING TO JOURNALISTS

పాత్రికేయులకు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు స్ట్రాంగ్ వార్నింగ్ - తాను వెళ్లిపోయాక తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక - ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం

MLA Gummanur Jayaram Warning To journalists
MLA Gummanur Jayaram Warning To journalists (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 6:12 PM IST

Updated : Jan 29, 2025, 10:50 PM IST

MLA Gummanur Jayaram Warning To journalists : అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాత్రికేయులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంతకల్లులోని ధోనిముక్కల రోడ్డు సమీపంలో తహసీల్దార్‌తో కలిసి ఇళ్ల పట్టాల పరిశీలనకు వెళ్లిన ఆయన జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన నిన్న(మంగళవారం) సాయంత్రం జరిగింది. తనపై, తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఏవైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే తన ఎదుటనే అడగాలని, తాను వెళ్లిపోయాక తప్పుగా రాస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ వీడియోపై పలు జర్నలిస్టు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

పార్టీ అధిష్ఠానం ఆగ్రహం : తనపై వ్యతిరేక వార్తలు రాస్తే పాత్రికేయులను రైలు పట్టాలపై పడుకోబెడతానన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్​కి ఫోన్ చేసి మాట్లాడారు. పాత్రికేయలను బెదిరించటం టీడీపీ సంస్కృతి కాదని ఎమ్మెల్యే జయరాంకు చెప్పారు.

అందరినీ అనలేదు: పాత్రికేయులను బెదిరించిన వీడియో మీడియాలో ప్రసారం కావటంతో పాటు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వచ్చాయి. దీంతో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జయరాం, తాను రెండు చానళ్లకు సంబంధించిన వారిని ఉద్దేశించి మాట్లాడానని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని చెప్పారు. రెండు చానల్లో మాత్రమే తన గురించి తప్పుడు రాతలు రాస్తుంటే మాట్లాడాల్సి వచ్చిందని, మిగతా ఛానల్ వారంతా తనకు మిత్రులేనని తెలిపారు.

అధికారుల సైకో ఇజం: టీడీపీ నేతలు ఓట్లు అభ్యర్థించారని- విశ్రాంత ఉద్యోగుల షెడ్డులను కూల్చే యత్నం

వైసీపీ నేతల కుట్రలు - ఆ పార్టీ కార్యకర్తలకే కండువా కప్పి టీడీపీ నుంచి చేరినట్టు ప్రచారం

Last Updated : Jan 29, 2025, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.