ETV Bharat / state

హైదరాబాద్​లో 11 లక్షల మందికే ఫ్రీ కరెంట్! - మరి ఆ దరఖాస్తులన్నీ ఏమైనట్లు?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 10:37 AM IST

Updated : Feb 26, 2024, 12:03 PM IST

Gruha Jyothi Scheme in Telangana : రాష్ట్రంలో ఉచిత కరెంట్ సరఫరా పథకం గృహజ్యోతి అమలు ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్​లో 11 లక్షల మంది వినియోగదారులకే మొదట వర్తించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పటికే సీజీజీకి చేరాయి.

Gruha Jyothi Scheme in Telangana
Gruha Jyothi Scheme in Telangana

Gruha Jyothi Scheme in Telangana : గృహజ్యోతి పథకంలో భాగంగా తొలుత హైదరాబాద్​లో 11 లక్షల మంది వినియోగదారులకే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వివరాలన్నీ సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కు (సీజీజీ) చేరాయి. మార్చి నెలలో వీరికి మాత్రమే సున్నా బిల్లులు జారీ కానున్నాయి. త్వరలో పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఎంతమందికి వర్తిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

200 Units Free Power in Hyderabad : ప్రజాపాలనలో గృహజ్యోతికి అర్జీ చేసుకున్న వినియోగదారుల ధ్రువీకరణ ప్రక్రియని, వివరాల సేకరణను విద్యుత్ సిబ్బంది బిల్లుల జారీ సమయంలో చేపట్టారు. ఇది ఇంకా కొనసాగుతోంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఇప్పటివరకు 30 లక్షల వినియోగదారుల వివరాలను పరిశీలన పూర్తి చేసి పథకం అమలు కోసం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ)కి సమర్పించారు. ఇందులో హైదరాబాద్​కు చెందిన వినియోగదారులు 11 లక్షల వరకు ఉన్నారు. ఆహారభద్రత కార్డు తప్పనిసరి అనడంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో 55 శాతం మందికి మాత్రమే గృహజ్యోతి వర్తించే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణ సర్కార్ జారీ చేసే మార్గదర్శకాలను బట్టి వీరి శాతం తగ్గొచ్చు లేదంటే పెరగొచ్చు. ప్రజాపాలనలో 19.85 లక్షల మంది అర్జీ చేసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : రేవంత్ రెడ్డి

హబ్సిగూడలో అత్యధికం : గృహజ్యోతి (Gruha Jyothi Scheme) కోసం పరిశీలన పూర్తయిన వినియోగదారులు అత్యధికంగా హబ్సిగూడ సర్కిల్‌ పరిధిలో ఉన్నారు. ఇక్కడ 1.62 లక్షల మంది ఇళ్లకు ఉచిత కరెంట్ వర్తించే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 1.59 లక్షలు, సరూర్‌నగర్‌ సర్కిల్‌లో 1.47 లక్షలు, హైదరాబాద్‌ సౌత్‌లో 1.27 లక్షల వినియోగదారుల పరిశీలన పూర్తయింది. బంజారాహిల్స్‌ సర్కిల్‌లో 59,000ల వినియోగదారులు గృహజ్యోతి కోసం వివరాలు ఇవ్వగా మిగతా సర్కిళ్లలో లక్షలోపే ఉన్నారు. ఈ నెల 16 వరకు 10 లక్షల మంది వివరాలను విద్యుత్ సిబ్బంది సేకరించగా, ఈ పది రోజుల్లో మరో లక్ష దాకా మాత్రమే అదనంగా మ్యాపింగ్‌ చేశారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కార్యాలయాలకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఉచిత కరెంటుతో గ్రిడ్​పై ఎంత భారమెంత - అధ్యయనానికి కర్ణాటకకు అధికారులు

మిగతా వారు ఏమైనట్లు? : ప్రజా పాలనలో జీహెచ్‌ఎంసీ, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చిన 19.85 లక్షల దరఖాస్తుల్లో గృహజ్యోతి (200 Units Free Power Sceheme)మ్యాపింగ్‌ ప్రక్రియ 11 లక్షల వరకే జరిగింది. ఇంకా 8.85 లక్షల దరఖాస్తుదారులు ఏమైనట్లు? అధికారులేమో 99 శాతం పూర్తయిందని చెబుతున్నారు. ఒక ఇంట్లోనే రెండు అర్జీలు రావడం, వేర్వేరు పోర్షన్లలో నాలుగు కుటుంబాలు ఉంటున్న అందరికి కలిపి ఒకటే మీటర్‌ ఉండటం ఊర్లో, ఇక్కడ దరఖాస్తు చేయడమని అంటున్నారు. అదేవిధంగా అద్దెదారుల వివరాలతో మ్యాపింగ్‌ చేసేందుకు కొందరు యాజమానులు ఒప్పుకోకపోవడం వంటి సమస్యలతో వాటి వివరాలు నమోదు కాలేదని క్షేత్రస్థాయిలో సిబ్బంది పేర్కొంటున్నారు. 16 లక్షల వరకు అర్హులు ఉంటారని అంచనా వేసినా ఆహారభద్రత కార్డు ఉన్న వాటి వివరాలనే సీజీజీకి సమర్పించడంతో లబ్ధిదారులు తగ్గినట్లు తెలియజేస్తున్నారు.

గృహజ్యోతి పథకంపై ప్రభుత్వం కసరత్తు - అర్హుల వివరాల సేకరణలో విద్యుత్​ పంపిణీ సంస్థలు

రాష్ట్రంలో వారికి మాత్రమే ఫ్రీ కరెంట్​! - ప్రభుత్వ మార్గదర్శకాలివే!!

Last Updated : Feb 26, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.