ETV Bharat / state

గ్రూప్- 4 ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ - Group 4 Results Released by tspsc

Group- 4 Results Released : గ్రూప్‌ - 4 ఫలితాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల ర్యాంకుల జాబితాను వెబ్​సైట్​లో విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని బోర్డు సూచించింది. గతేడాది జులైలో గ్రూప్- 4 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Group 4 Results
Group 4 Results Released
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 9:21 PM IST

Updated : Feb 9, 2024, 9:32 PM IST

Group-4 Results Released : గత కొంతకాలంగా గ్రూప్‌ - 4 ఫలితాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇవాళ టీఎస్‌పీఎస్సీ గ్రూప్​-4 రిజల్ట్​ను వెల్లడించింది. అభ్యర్థుల ర్యాంకుల జాబితాను వెబ్​సైట్​లో విడుదల చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని కమిషన్​ సూచించింది. గతేడాది జులై 1న టీఎస్​పీఎస్సీ గ్రూప్- 4 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Group 4 Results Released by TSPSC : రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న గ్రూప్​-4 ఖాళీలను భర్తీ చేయడానికి 2022 డిసెంబరులో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ జారీ చేసింది. అందులో జూనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ అకౌంటెంట్​, జూనియర్​ ఆడిటర్​, వార్డు ఆఫీసర్​ వంటి తదితర పోస్టులు ఉన్నాయి. టీఎస్​పీఎస్సీ 8,180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్​ రిలీజ్​ చేయగా గతేడాది జులై 1న పరీక్ష నిర్వహించారు.

ఈ పరీక్షను రికార్డు స్థాయిలో 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 7 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్​- 4 పరీక్షకు సంబంధించిన తుది కీని టీఎస్​పీఎస్సీ గతేడాది అక్టోబరులో విడుదల చేసింది.

Last Updated : Feb 9, 2024, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.