Governor Tamilisai watched Ayodhya Ceremony on Screen : బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్రీన్ ద్వారా అమె అయోధ్య రామ మందిర క్రతువులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Central Minister Kishan Reddy), రాజ్యసభ సభ్యులు లక్ష్యణ్ సైతం పాల్గొన్నారు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ - భద్రాద్రిలో సీతారాముల శోభాయాత్ర
క్రతువు జరుగుతున్న సమయంలో నిజాం కళాశాల మైదానం పరిసర ప్రాంతాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. నేడు ఒక ప్రత్యేకమైన రోజని, రాముడు జన్మించిన స్థలంలోనే ఆయన ఆలయం నిర్మించడం, విగ్రహం ప్రతిష్ఠించడం శుభ పరిణామమని ఆమె తెలిపారు. రామ మందిరం ప్రారంభం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందని అన్నారు.
Ayodhya Ram Mandir Celebrations in Hyderabad : అయోధ్య రామమందిరలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలను హైదరాబాద్ నగరంలోనూ వైభవంగా నిర్వహించారు. రాజ్ భవన్‌లో శ్రీరాముడి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. రాజ్‌భవన్(Raj Bhavan) ఆవరణలో ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణ విగ్రహాల వద్ద మహిళలు సంకీర్తనలు ఆలపించారు. పూజా కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఔరా రామా!! - బియ్యపు గింజలతో అయోధ్య మందిరం
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరాముల పూజా కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట శ్రీరాముని మాట వినపడుతోందని, ఎంతో మంది త్యాగాల పునాదులపై అయోధ్య కల సహకారమైందని అన్నారు.
శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ అడిక్ మెట్ శ్రీఆంజనేయ స్వామి దేవాలయం వద్ద వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అయోధ్య రామ విగ్రహ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆయన తిలకించారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Ayodhya Ram Mandir Inauguration : దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు కార్యక్రమానికి వచ్చారని ఈ మహా క్రతువులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవ వేళ సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో(Hanuman Temple) ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది.
గచ్చిబౌలి మైహోం విహంగాలో సీతారామాంజనేయ ఉత్సవాలను కన్నుల పండువగా ఏర్పాటు చేశారు. మైహోం విహంగా అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపార్ట్‌మెంట్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఆ ప్రాంతమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ప్రత్యేక పూజలతోపాటు సాయంత్రం శోభాయాత్ర(Sri Rama Shobhayatra), దీపారాధనలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
షేక్‌పేటలోని జి.నారాయణమ్మ విద్యాలయంలో రామప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాలేజ్ ఆవరణలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాలేజీ వైస్ చైర్మన్ శ్రీ విద్యా రెడ్డి హాజరయ్యారు. ప్రతి విద్యార్థి రాముడు చూపించిన మార్గాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా రామాయణాన్ని వివరించే నాణేలు
రాష్ట్రంలో ఘనంగా రాములోరి శోభాయాత్రలు - సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామాలయాలు