Governor Quota MLC Appointments Case Reserved in TS High Court : గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు(High Court)లో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్సీల నియామకంపై మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ కుర్రా సత్యనారాయణ తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. గవర్నరు కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకంపై మంత్రి మండలి సంతృప్తి చెంది ఆమోదిస్తే చాలని, గవర్నరు వ్యక్తిగతంగా అంగీకరించాల్సిన అవసరంలేదని హైకోర్టుకు తెలిపారు.
ఎమ్మెల్సీ నియామకానికి(MLC Appointments) సంబంధించి మంత్రి మండలిదే బాధ్యత అని గవర్నర్ నామినేషన్‌ను తిరస్కరించడం పక్షపాతంతో కూడిన నిర్ణయమని దీన్ని న్యాయసమీక్ష చేయవచ్చని న్యాయవాది మయూర్ రెడ్డి వాదించారు. గవర్నరు పునఃపరిశీలించమని వెనక్కి పంపలేదని, తిరస్కరించారన్నారు. దీన్ని సాధారణ కేసులాగా పరిగణించరాదని, ఇది ప్రత్యేకమైన కేసుగా పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నందున నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు శ్రవణకుమార్ కేసులో జారీ చేసిన ఉత్తర్వులనే యథాతథంగా జారీ చేశారన్నారు.
Governor Quota MLC Appointments Delay : రాజకీయాల్లో ఉన్నారన్నది తిరస్కరించడానికి కారణం కాదన్నారు. మంత్రి మండలి నిర్ణయాలకు జవాబుదారీతనం మంత్రి మండలిదేనని పేర్కొన్నారు అలాంటప్పుడు మంత్రి మండలి నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నరుకు లేదన్నారు. గవర్నరు(Governor Tamilisai) విచక్షణాధికారం కొన్ని అంశాలకే పరిమితమని రాజ్యాంగ పరిధులకు లోబడే విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అన్ని పక్షాల వాదనలు పూర్తికావడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ నియామకం
Governor Quota MLCs Issue in Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నియమించారు. వీరిద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫారసు చేసింది. ఇందుకు ఆమె ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. 2023 జులై 31న కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ గత ప్రభుత్వం సిఫారసులను గవర్నర్కు పంపారు.
అయితే అదే ఏడాది సెప్టెంబరు 25న ఈ ఇద్దరి పేర్లను ఆమె తిరస్కరించి, నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారి పేర్లను గవర్నర్ ఆమోదించడం జరిగింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు!