ETV Bharat / state

హైడ్రాకి ఇక స్పెషల్ పవర్స్ - ప్రభుత్వ ఆర్డినెన్స్‌కి గవర్నర్‌ ఆమోదం - GOVERNOR APPROVED HYDRA ORDINANCE

Governor approved ordinance on Hydra : చెరువులతోపాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు విశేష అధికారాలు దక్కాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి గవర్నర్‌ జిష్షుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. రాజ్​భవన్​ ఆమోదముద్రతో, జాప్యానికి తావులేకుండా స్వయంగా చర్యలను సకాలంలో తీసుకునే అవకాశం హైడ్రాకు కలగనుంది.

Special Powers To HYDRA
Special Powers To HYDRA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 7:03 AM IST

Updated : Oct 2, 2024, 7:18 AM IST

Special Powers To HYDRA : విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ- హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. రాజముద్ర పడటంతో ఇకపై హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఆ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకి ఈ ఆర్డినెన్స్‌ రక్షణగా ఉండనుంది.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ పలు సందేహాలు వ్యక్తం చేయగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌ నివృత్తి చేయడంతో జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు వచ్చినప్పడు ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపకశాఖ సేవలకు ఎన్​ఓసీ జారీ తదితర లక్ష్యాలతో జులై 19న జీవో ఎమ్​ఎస్ 99 ద్వారా రాష్ట్రప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.

రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఓఆర్​ఆర్​ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా, ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు దాఖలుపడ్డాయి. ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది.

ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్‌ 374బీ ని ఆర్డినెన్స్‌లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌కి ఉన్న అధికారాలు, బీపాస్‌ చట్టం-2020 ప్రకారం జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలోని జోనల్‌ టాస్క్‌ఫోర్స్ కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలను హైడ్రాకు ఇచ్చారు.

హెచ్‌ఎండీఏ చట్టం-2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారం, భూ ఆదాయ చట్టంలోని సెక్షన్‌ 1317ఎఫ్‌ ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకి ఆర్డీవో, కలెక్టర్‌కు ఉన్న అధికారాలు, అవే అంశాలకు సంబంధించి నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీవో ఎం.ఎస్‌-67 ద్వారా 2002లో యూడీఏ/ఎగ్జిక్యూటివ్‌ అధికారికిచ్చిన అధికారాలని హైడ్రాకు కట్టబెట్టారు.

భూ ఆక్రమణ చట్టం-1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం-2002, తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్, ఫైర్‌ సర్వీసెస్‌ చట్టంలోని పలు అధికారాలను హైడ్రాకి వర్తింపజేశారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతుంది.

మా లక్ష్యం కూల్చివేతలు కాదు, చెరువుల పునరుద్దరణ మాత్రమే- హైడ్రా​ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు - HYDRA Clarity on Musi Demolitions

సామాన్యుల్లోనూ 'హై'డ్రా గుబులు - నివాసాల కూల్చివేతలపై ఆందోళనలు - Hyderabad FTL And Buffer Zones

Last Updated : Oct 2, 2024, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.