ETV Bharat / state

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు - Palamuru Rangareddy Project

Government on Palamuru Rangareddy Lift Irrigation : ట్రైబ్యునల్ తీర్పుతో సంబంధం లేకుండా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు మొదటి దశ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. మొత్తం 90 టీఎంసీలు కాకపోయినా చిన్ననీటి వనరుల మిగులుకు చెందిన 45 టీఎంసీలకు అయినా అనుమతులు ఇవ్వాలని అంటోంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి.

Central Water Commission about Palamuru Project
Government on Palamuru Rangareddy Lift Irrigation
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 20, 2024, 3:31 PM IST

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల అనుమతి కోసం ప్రభుత్వం వినతులు

Government on Palamuru Rangareddy Lift Irrigation : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. ప్రస్తుతం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని, ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజన కింద పాలమూరు - రంగారెడ్డికి కేంద్రం నుంచి సాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

అయితే ప్రాజెక్టుకు ఇంకా అవసరమైన అన్ని అనుమతులు రాలేదు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ఉంది. అనుమతుల కోసం ప్రాజెక్టు డీపీఆర్​(DPR)ను కేంద్ర జలసంఘానికి పంపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 811 టీఎంసీ(TMC)ల కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీకి పంపిణీ చేసే అంశాన్ని బ్రిజేశ్​ కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. 90 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టింది.

Central Water Commission about Palamuru Project : రాష్ట్ర వాటాలో ఉన్న చిన్ననీటి వనరుల్లో మిగులు 45 టీఎంసీలు పట్టిసీమ, పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నందున ఎగువన రావాల్సిన 45 టీఎంసీలను ఇందుకోసం ప్రతిపాదించారు. డీపీఆర్​లో ఆ మేరకు పొందుపరిచారు. అయితే కృష్ణా జలాల అంశం ట్రైబ్యునల్ పరిధిలో ఉన్నందున, తీర్పు వచ్చే వరకు పాలమూరు - రంగారెడ్డి డీపీఆర్​ను పరిశీలించలేమని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా ఇచ్చింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే నష్టం జరుగుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది.

మొదటి దశ- 45 టీఎంసీలతో : ఏపీతో సంబంధం లేని 45 టీఎంసీలతో మొదటి దశ అనుమతులు ఇవ్వాలని కోరుతోంది. తాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటామని చెబుతోంది. అలా అయితే ట్రైబ్యునల్ తీర్పు వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ కూడా రాసింది. ఈ విషయంలో కొంత సానుకూలత కూడా ఉందని అంటున్నారు. 45 టీఎంసీలతో మొదటి దశ అనుమతులు తెచ్చుకొని ఆ తర్వాత మిగిలిన 45 టీఎంసీలతో పూర్తిస్థాయి అనుమతులు పొందవచ్చని చెప్తున్నారు.

వీలైనంత త్వరగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

పాలమూరు-రంగారెడ్డి నిధులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం : కాంగ్రెస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.