ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమైన 'అన్న క్యాంటీన్లు' - government launch 100 Anna Canteens - GOVERNMENT LAUNCH 100 ANNA CANTEENS

Government has Started 100 Anna Canteens in First Phase : పేదోడి ఆకలికి చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వంద అన్నక్యాంటీన్లను ప్రారంభించింది. అట్టహాసంగా రిబ్బన్‌ కట్‌ చేసిన కూటమి ప్రజాప్రతినిధులు.. క్యాంటీన్లలోకి వచ్చిన వారికి భోజనం, అల్పాహారం వడ్డించారు.

Government has Started 100 Anna Canteens in First Phase
Government has Started 100 Anna Canteens in First Phase (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 10:45 PM IST

Updated : Aug 16, 2024, 10:52 PM IST

Government has Started 100 Anna Canteens in First Phase : పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించింది. రాష్ట్రంలో ఈరోజు 99 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం అయ్యాయి. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేశారు.

అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం : రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతగా వంద క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం గుడివాడలో అన్న క్యాంటీన్‌ను లాంఛనంగా ప్రారంభించగా మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రజాప్రతినిధులు రిబ్బన్‌ కట్‌ చేశారు. మంత్రి లోకేష్‌ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట, మంగళగిరి పాత బస్టాండ్‌ వద్ద అన్నక్యాంటీన్లు ప్రారంభించారు. అనతంరం పేదలతో కలిసి క్యూలైన్‌లో నిల్చొని అల్పాహారం తీసుకున్నారు. అందరితో కలిసి తింటూ ఆహార నాణ్యత, రుచి అడిగి తెలుసుకున్నారు.

అన్న కాంటీన్లలో వారంలో ఒక రోజు ప్రత్యేక వంటకం ఉంటుంది: అక్షయ పాత్ర ప్రెసిడెంట్ - Akshaya Patra Foundation

పేదలతో పాటు తింటూ రుచి, నాణ్యతపై ఆరా : గుంటూరు జిల్లా తెనాలిలోని మూడు అన్న క్యాంటీన్లను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌.. మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి ప్రారంభించారు. పేదలతో కలిసి ఇరువురు నేతలు క్యాంటీన్‌లో ఆల్పాహారం తిన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని అన్న క్యాంటీన్‌కు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ రిబ్బన్‌ కట్‌ చేశారు. పేదలకు అల్పాహారం వడ్డించి తాను అక్కడే అల్పాహారం తిన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో క్యాంటీన్‌ ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేదలకు భోజనం వడ్డించారు. నెల్లూరులో వేర్వేరు అన్న క్యాంటీన్లు స్థానిక ప్రజాప్రతినిధులు విడివిడిగా ప్రారంభించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏడు క్యాంటీన్ల ఫిష్‌ మార్కెట్‌ వద్ద పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఏసీ మార్కెట్‌ వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొత్త హాలు సమీపంలోని ఇందిరా భవన్‌ వద్ద క్యాంటీన్‌ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు.

పేదలకు వడ్డించిన ప్రజాప్రతినిధులు : ఏలూరు జిల్లా నూజివీడులో అన్న క్యాంటీన్‌కి మంత్రి పార్థసారథి రిబ్బన్‌ కట్‌ చేశారు. పేదలతో కలిసి మంత్రి అల్పాహారం తిన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పంగిడి రోడ్డులోని అన్నక్యాంటీన్‌ మంత్రి కందుల దుర్గేష్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. కాకినాడ ఘాటీ సెంటర్‌లో అన్నక్యాంటీన్‌ పునఃప్రారంభమైంది. పేదలకు అల్పాహారం వడ్డించిన ఎమ్మెల్యే వనమూడి కొండబాబు వారితో కలిసి తింటూ కాసేపు ముచ్చటించారు. డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్‌ వద్ద అన్న క్యాంటీన్‌ని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఎంపీ గంటి హరీష్‌ మాథూర్‌తో కలిసి ప్రారంభించారు. విజయనగరంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నక్యాంటీన్‌కి రిబ్బన్‌ కట్‌ చేశారు.

స్వయంగా వడ్డించిన ఎమ్మెల్యే బాలకృష్ణ : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో రెండు అన్నక్యాంటీన్లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తానే స్వయంగా అందరికీ అల్పాహారం వడ్డించారు. చిత్తూరు జిల్లా పలమనేరు బస్టాండ్‌ కూడలి వద్ద క్యాంటీన్‌ని స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి ప్రారంభించగా కుప్పం రాధాకృష్ణ రోడ్డులోని క్యాంటీన్‌కి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ రిబ్బన్‌ కట్‌ చేశారు.

పేదల ఆకలి తీర్చే మహత్తర పథకానికి మళ్లీ ప్రాణం - అన్నక్యాంటీన్ల పునఃప్రారంభం - Renovation of Anna Canteens

గుడివాడలో 'అన్న క్యాంటీన్‌' పునః ప్రారంభం - పేదలతో కలిసి సీఎం చంద్రబాబు దంపతుల భోజనం - CM CBN Inaugurated Anna Canteen

పేదోడి ఆకలికి చెక్‌ - పునఃప్రారంభమైన 'అన్న క్యాంటీన్లు' (ETV Bharat)

Last Updated : Aug 16, 2024, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.