Government has Extended Deadline for Registration : విజయవాడ నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో కష్టం వచ్చిన ప్రతి ఒక్కరి నష్టాన్ని గణించేలా బృందాలు వివరాలు నమోదు చేస్తున్నాయి. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారి వివరాలు కూడా నమోదు చేసేందుకు ఒకరోజు గడువు పెంచారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు డాక్టరు జి.సృజన తెలిపారు. ఈరోజు(గురువారం) సంబంధిత సచివాలయాల్లో సంప్రదిస్తే నష్టం గణన బృందాలు ఇళ్లను పరిశీలించి వివరాలు నమోదు చేస్తాయని తెలిపారు.
సీఎం మార్గదర్శకాలకు అనుగుణంగా : విజయవాడ నగరంలోని వరద ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న 32 వార్డులు, అయిదు గ్రామాల్లో రక్షణ, ఉపశమన చర్యలను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ సృజన తెలిపారు. ప్రస్తుతం పునరావాస చర్యలను ప్రణాళికాయుతంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి నష్టం నమోదు ప్రక్రియ ప్రారంభించామని, బాధితులను ముంపు నష్టాల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు.
గుడ్ బై 'సెబ్'- ఆబ్కారీ శాఖ పునర్‌వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు - SEB Cancellation in AP
హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే : దాదాపు 2,32,000 కుటుంబాలకు సంబంధించిన నష్ట గణాంకాలను నమోదు చేసినట్లు కలెక్టర్ సృజన చెప్పారు. నష్ట గణనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్లలో సబ్ కలెక్టర్ కార్యాలయం (0866 2574454), విజయవాడ మున్సిపల్ కార్యాలయం (8181960909) సంప్రదించి వరద నష్టాలను వివరాలను నమోదు చేసుకొవచ్చాని తెలిపారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరూవూరు తదితర ప్రాంతాల్లోనూ ఎన్యూమరేషన్‌కు యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఈ ప్రాంతాల్లోనూ నష్టగణనను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిచేస్తామని కలెక్టర్ తెలిపారు.
"ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాల్లో వరద నష్టం నమోదు ప్రక్రియ మెుత్తం పూర్తయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. ముంపు వల్ల ఇళ్లలో అందుబాటులో లేనివారు, ఇతర కారణాలతో ఇప్పటిదాకా వివరాలు నమోదుచేసుకోని వారు వార్డు సచివాలయాల్ని సంప్రదించాలి. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లుకు ఫోన్ చేసి కూడా సమాచారం ఇవ్వొచ్చు. వరద బాధితులంతా వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వం నుంచి సహకారం పొందండి" - సృజన, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి : రిలీఫ్ అంటే కేవలం ఆహారం, ఆర్థిక సహకారమే కాకుండా బాధితులకు ఎన్ని విధాలా సహాయం అందించాలో అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాధితులకు చేసే సహాయం క్రియాశీలంగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆదేశమన్నారు. ఈ క్రమంలోనే బాధితుల వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ రిపేర్లు వంటివి చాలా తక్కువ ధరలో చేయించడం జరుగుతోందని అవసరమైతే ప్రభుత్వమే రాయితీతో ఇవన్నీ చేయిస్తుందని తెలిపారు. అయితే ఈరోజు ఇవాళ విజయవాడలో వరద నష్టాల్ని కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది.
తక్కువ ధరకే నాణ్యమైన సరుకు - నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు - Cabinet Meeting on Liquor Policy