ETV Bharat / state

తిరుపతి టీడీఆర్‌ బాండ్ల స్కాంపై చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం - Tirupati TDR Bond Irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 7:57 PM IST

Updated : Aug 18, 2024, 8:55 PM IST

Govt Focused on Tirupati TDR Bond Irregularities: అభివృద్ధి పేరుతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. టీడీఆర్ బాండ్ల మాటున సాగిన అక్రమాలపై విచారణ చేపట్టాలన్న ఫిర్యాదులతో విజిలెన్స్‌ లేదా సీఐడీ విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

tdr_bond_irregularities
tdr_bond_irregularities (ETV Bharat)

Govt Focused on Tirupati TDR Bond Irregularities: అభివృద్ధి పేరుతో తిరుపతి నగరపాలక సంస్థలో గడిచిన మూడు ఏళ్ల కాలంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం తీవ్ర అక్రమాలకు నిలయమైంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాల పేరుతో సేకరించిన భూములకు టీడీఆర్ బాండ్ల రూపంలో చెల్లించిన పరిహారంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబులు నింపాయన్న విమర్శల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. 37 కోట్ల నిధులతో చేపట్టిన 12 రహదారుల సంఖ్యను ఏకంగా 42 కోట్లకు పెంచిన గత పాలకులు భూ సేకరణలో పలు అక్రమాలకు పాల్పడ్డారు.

పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలు గాలికొదిలేసిన వైసీపీ నేతలు ప్రైవేటు వ్యక్తుల భూముల్లో నిర్మాణాలు ప్రారంభించారు. సమగ్ర సర్వే, భూ యజమానులకు తాఖీదులు, పరిహారం, టెండర్లు వంటి వేవీ లేకుండానే రహదారుల నిర్మాణం చేపట్టారు. అడ్డగోలుగా సాగుతున్న మాస్టర్‌ ప్లాన్‌ రహదారులపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకొన్నా లెక్కచేయకుండా నిర్మాణాలు కొనసాగించారు.

అధికార పార్టీ నేతలతో పొలిటికల్ కమిటీ: టీడీఆర్‌ బాండ్ల ముసుగులో అక్రమాలకు తెరతీసిన గత పాలకులు తమకు వంతపాడే అధికారులను పట్టణ ప్రణాళిక విభాగంలో ఖాళీ అయిన కీలక పోస్టుల్లో నియమించుకొన్నారు. స్థాయి లేకున్నా పదిమంది నాలుగో తరగతి ఉద్యోగులను ప్రణాళికాధికారులుగా నియమించారు. గెజిటెడ్ హోదా కలిగిన ప్రణాళికాధికారుల విధులతో పాటు పూర్తి అధికారాలు కట్టబెట్టారు. నగరపాలక వ్యవస్థకు సమాంతరంగా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలతో కూడిన మాస్టర్ ప్లాన్ రోడ్ల పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేశారు. అనధికారికంగా ఏర్పాటైన ఈ కమిటీ కనుసన్నల్లో రోడ్ల నిర్మాణం, టీడీఆర్ బాండ్ల జారీ వాటి విక్రయాలు సాగాయి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల రీతిలో పొలిటికల్ కమిటీ గుత్తేదారులతో కలిసి వెళ్లి అర్ధరాత్రిళ్లు రోడ్డు విస్తరణకు భవనాలు కూల్చడం, ఎదురు తిరిగితే బెదిరించడం, మధ్యవర్తులుగా వ్యవహరించి భూములు, భవనాలు స్వాధీనం చేసుకొన్నారన్న విమర్శలు ఉన్నాయి.

'రాష్ట్రానికి కేటాయించిన నిధులు త్వరగా ఇవ్వండి'- ఆ విషయాలన్నీ మోదీ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు - CM Chandrababu met Modi

సమాచారం లేకుండా భూ సేకరణ: గొల్లవానిగుంట, కొర్లగుంట రోడ్లతో పాటు నగరపాలక సంస్థ ఆమోదం పొందిన 17 మాస్టర్‌ప్లాన్ రోడ్లకు పదకొండు వందల 21 మంది నుంచి భూములు సేకరించారు. వార్డు సచివాలయాల్లో నోటిఫికేషన్ ప్రదర్శించిన అధికారులు యజమానులకు సమాచారం లేకుండా భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నగరపాలిక అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇప్పటి వరకు 200 మందికి నోటీసులు కూడా ఇవ్వలేదు. 400 మందితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. నిర్మాణాలు చేపట్టిన రహదారులకు సంబంధించి టీడీఆర్ బాండ్ల జారీతో అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అక్రమాలు చోటు చేసుకొన్నాయని విచారణ నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు ముఖ్యమంత్రితో పాటు పురపాలక శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.

విచారణకు ప్రభుత్వం ఆదేశం: ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై చర్యలు ప్రారంభమయ్యాయి. విచారణకు ముందుగా అర్హత లేకున్నా పట్టణ ప్రణాళిక విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు చేపట్టారు. రాజంపేట నుంచి డిప్యుటేషన్‌పై పట్టణ ప్రణాళిక విభాగంలో ప్లానింగ్‌ అసిస్టెంట్‌ కమిషనర్​గా బాధ్యతలు అప్పగించిన అధికారి బాలసుబ్రమణ్యంను పూర్వస్థానానికి బదిలీ చేశారు. పూర్తి స్థాయి విచారణకు విజిలెన్స్‌ లేదా సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించనుంది.

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం- త్వరలో మ్యాపింగ్ సిద్ధం: ఆర్పీ సిసోదియా - visakha land issues

టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్​లో అగ్నిప్రమాదం - కీలక ఫైల్స్ దగ్ధం - Fire at TTD administrative building

Last Updated : Aug 18, 2024, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.