Good Jobs with AI Skills: ఏ రంగంలో చూసినా ఏఐ హవా నడుస్తోంది. దీంతో ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలామందిలో ఉంది. అది అపోహే అంటున్నారు నిపుణులు. వచ్చే ఐదేళ్లలో ఏఐ లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేవారి కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదని సూచిస్తున్నారు. ఆ మార్గాన్నే అనుసరించారా ఇంజినీరింగ్ యువత. ఫలితంగా మల్టీనేషనల్ కంపెనీల్లో లక్షల వేతనంతో కొలువులు సాధించారు. ఆ విశేషాలు మీకోసం.
కాలంతో పాటు టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు అన్నిరంగాల్లో వినిపిస్తోంది. ఈ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటే యువత భవిత బంగారుమయమే. ఈ విషయాన్ని గుర్తించిన ఈ విద్యార్థులు చదువుకుంటూనే కృత్రిమమేధపై పట్టు సాధించారు. అమెజాన్, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీల్లో లక్షల ప్యాకేజీలతో కొలువులు సాధించారు.
కృత్రిమ మేధస్సుపై పట్టు సాధిస్తే ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయో నిరూపిస్తున్నారీ విద్యార్థులు. VR సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న వీరంతా బీటెక్ పూర్తికాకముందే లక్షల వేతనంతో జాబ్ సంపాదించారు. జేపీ మోర్గాన్, అమెజాన్, గూగుల్‌లాంటి ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిష్, ఉద్యోగం చేసే అవకాశం దక్కించుకున్నారు.
గూగుల్ మ్యాప్స్‌లో AI ఫీచర్స్- ఇకపై ట్రిప్ ప్లానింగ్ సూపర్ ఈజీ!
స్కిల్ ఉంటే లక్షల్లో జీతం: వేగంగా, క్షుణ్ణంగా పనిచేసే సామర్థ్యం ఏఐకి ఉండటంతో ఆటోమేషన్ తప్ప అన్నిరంగాల్లో కృత్రిమమేధ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. తద్వారా ఏఐతో కొత్త తరహా ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుందంటున్నారీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ . జెనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా అనాలిటిక్స్ , క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్ , జావా, పైథాన్, AWS సెక్యూరిటీ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో నైపుణ్యం ఉంటే లక్షల్లో జీతం వస్తుందని చెబుతున్నారు.
ఏఐ టెక్నాలజీ వినియోగించే ఏ కంపెనీకైనా వాటిని నడిపించేందుకు ప్రాంప్టర్లు అవసరం. ఈ స్కిల్స్ నేర్చుకుంటే తాత్కాలిక ఉద్యోగులకే నెలకు లక్షల వరకు జీతం వస్తుందంటున్నారీ విద్యార్థులు. దిగ్గజ కంపెనీలు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి సైతం ఏడాదికి లక్షల్లో ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయని అంటున్నారు.
రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్‌తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్ సహా అన్నిరంగాల్లో కృత్రిమ మేధ కీలకపాత్ర పోషించనుంది. ఇప్పటికే చాలా కంపెనీలు AI ద్వారా పనులను సులభతరం చేసుకుంటున్నాయి. దీంతో ఏఐ స్కిల్డ్ పర్సన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇంజినీరింగ్ చేస్తూనే AI టెక్నాలజీ నేర్చుకుని ఉద్యోగ అవకాశం పొందమంటున్నారీ ఇంజినీరింగ్ యువత.
'AIతో జాబ్స్ పోవు - అలా చేసే వారి వల్లే ఉద్యోగాలు పోతాయి'
భవిష్యత్ అంతా ఏఐపైనే: భవిష్యత్ AIపైనే ఆధారపడి ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, దిల్లీ వంటి ఐటీ నగరాల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వారికి లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెబుతున్నారు. వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్యం ఇలా ఏ రంగాల్లో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. రాబోయే పదేళ్లలో ప్రపంచమంతా ఏఐ యుగంగా మారనుంది. ఈ క్రమంలో కృత్రిమమేధలోని నైపుణ్యాలను నేర్చుకుంటే ఉపాధి అవకాశాలతో పాటు లక్షల ప్యాకేజీలు సాధించవచ్చని నిరూపించారీ ఏఐ స్కిల్డ్ జాబర్స్.
"రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫారం అనేది ఒక సర్వే చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారు అనే అనుమానాలు వ్యక్తం చేసింది. అదే వరల్డ్ ఎకనామిక్ ఫారం ఏం చేసింది అంటే, 2030కి 9 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించబడతాయి అని తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మన జాబ్స్ని రిప్లేస్ చేస్తుందేమో అనే భయాన్ని వదిలేసి, దానిని ఉపయోగించి ఆ రంగంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది ఆలోచించాలి". - రాం గోపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్
దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- భారీ పెట్టుబడులతో ఇన్నోవేషన్ సెంటర్ కూడా..