ETV Bharat / state

అన్నమయ్య జిల్లా: పెళ్లిపందిట్లో వరుడిపై కత్తితో దాడి చేసి, యాసిడ్ పోసిన యువతి - Girlfriend Acid Attack on Young Man - GIRLFRIEND ACID ATTACK ON YOUNG MAN

Girlfriend Acid Attack on Young Man In Annamaiya District: పెళ్లి చేసుకుంటున్న వరుడిపై ప్రియురాలు యాసిడ్​తో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోయింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

girlfriend_acid_attack_on_young_man
girlfriend_acid_attack_on_young_man (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 7:09 PM IST

Updated : Aug 11, 2024, 10:29 PM IST

Girlfriend Acid Attack on Young Man In Annamaiya District: బంధు మిత్రులతో కల్యాణ మండపం సందడిగా ఉంది. కాసేపట్లో వివాహ బంధంతో వధూవరులిద్దరూ ఒక్కటి కానున్నారు. ఇంతలో అనుకోకుండా ఓ యువతి దూసుకొచ్చింది. నాకు అన్యాయం చేసి మరో యువతిని పెళ్లి చేసుకుంటావా యాసిడ్‌, కత్తితో బీభత్సం సృష్టించి, దాడికి దిగింది. దీంతో పెళ్లి మండపం అంతా రణరంగంలా మారింది. అక్కడ ఏ జరుగుతుందో అర్థం కాక పెళ్లికి వచ్చిన బంధువులంతా షాక్​ కు గురైయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నందలూరు మండలం రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్‌ బాషా అనే వ్యక్తి తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ యువతి ఆరోపించింది. బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆమె అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసింది. దీంతో ఆదివారం నందలూరులో బాషా వివాహం జరగనుందని తెలుసుకొని నేరుగా వివాహం జరిగే షాదీ ఖానా మండపం వద్దకు వచ్చింది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

విజయవాడలో దారుణం - మందలించాడని వ్యాపారిని హత్య చేసిన యువకుడు - Vijayawada Kirana Shop Owner Murder

దీంతో తను తెచ్చుకున్న యాసిడ్‌, కత్తితో బాషాపై ఆ యువతి దాడికి యత్నించింది. అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయగా జరిగిన వాగ్వాదంలో వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్‌ పడింది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన బాషా కత్తితో ప్రియురాలిపై దాడి చేశాడు. దీంతో ఆ యువతి వీపు, భుజంపై గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని రాజంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇద్దరి మహిళలకు ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధరించారు. తమకు న్యాయం చేయాలని వధువు తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించగా స్టేషన్‌లో పంచాయితీ జరుగుతోంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మరో వైపు వరుడి ప్రియురాలు మీడియాతో మాట్లాడకుండా ఆమెను పోలీసులు నిర్బంధించారు.

ఇది ఇలా ఉంటే, సదరు యువతితో తనకు గతంలో పరిచయం ఉందని వరుడు సయ్యద్ పేర్కొన్నాడు. ఇంతకు ముందుకూడా ఓ వ్యక్తిని ఇలానే యాసిడ్​తో బెదిరించిందని ఆయన తెలిపాడు. కొంత కాలంగా తనతో విభేదించి ఆమెతో మాట్లడటం లేదని సయ్యద్ చెప్పాడు.

గతంలో ఒక వ్యక్తిని కూడా ఇలానే యాసిడ్ తీసుకెళ్లి బెదిరించింది. అది తెలిసిన తరువాత నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశంతో వచ్చి నా మీద దాడి చేసింది. తను నాకు 2015లో పరిచయమయింది. వాళ్లకి నాకు ఒకసారి గొడవ జరిగింది. అప్పటి నుంచి వాళ్లకి మాకు మాటలులేవు. నేను మండపంలోకి వెళ్లే సమయంలో యాసిడ్, కత్తి తీసుకొచ్చి నా మీద దాడి చేసింది. నన్ను నేను కాపాడుకునే సమయంలో ఎదురుదాడి చేయడం జరిగింది.- సయ్యద్, వరుడు

పెద్దల తీర్పు అనుకూలంగా రాదేమోనని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - ప్రేయసి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం - Lovers Suicide AttemptGirlFriendDie

పబ్​జీలో లవ్​- ప్రియుడి కోసం భారత్​కు అమెరికా యువతి- చివరకు! - American woman PUBG love

Last Updated : Aug 11, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.