ETV Bharat / state

కుక్కకాటుతో ఆర్థికంగా కుదేలవుతున్న బాధితులకు దిక్కెవరు? - రేబిస్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం ఎటుపోతోంది? - Dog Bites in Hyderabad

GHMC Negligence Over Street Dogs Attack : నగరంలో కుక్కల బెడదపై యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ఇలా ఉంటే బాధితుల వేదన మాత్రం అరణ్య రోదనగా మారింది. కుక్కకాటుతో ఆర్థికంగా కుదేలవుతున్న బాధితులకు పరిహారం అందించడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు జీహెచ్ఎంసీ విఫలమవుతూనే ఉన్నాయి. ఫలితంగా గాయపడ్డ వారు, మరణించిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా, పరిహారం మాత్రం అందడం లేదు. రాజకీయంగా అలజడి తలెత్తినప్పుడు నానా హంగామా చేయడం తప్ప ఆ తర్వాత ఏ ఒక్కరూ బాధితులకు అండగా నిలబడింది లేదు. మరోవైపు వీధికుక్కలను నియంత్రించడం, పరిహారం అందించడం రెండింటా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తుంది. రేబిస్ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యమూ మందకొడిగానే సాగుతోంది. మరి, దీనికి పరిష్కమేంటి? అధికారులు ఏం చెబుతున్నారు.

Street Dogs Fear In GHMC
GHMC Negligence Over Street Dogs Attack
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 2:15 PM IST

కుక్కకాటుతో ఆర్థికంగా కుదేలవుతున్న బాధితులకు దిక్కెవరు? - రేబిస్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం ఎటుపోతోంది?

GHMC Negligence Over Street Dogs Attack In Hyderabad : కుక్కకాటు బాధిత కుటుంబాలను ఆర్థికంగా చితికిపోయేలా చేస్తోంది. కుక్కకాటుకు గురైన వారికి సమయానికి చికిత్స అందించడం కోసం బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. చికిత్స కోసం ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నారు. ఈ బాధ్యత తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ పట్టింపు లేకుండా వ్యవహారిస్తుండటంతో బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. నగరంలోనూ, రాష్ట్రంలోనూ కుక్కకాటు బాధితులకు నష్టపరిహారం అందించిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు.

Street Dogs Fear In GHMC : రాజకీయంగా అలజడి తలెత్తినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు పరిహారం అందజేసి చేతులు దులుపుకుంటున్నాయి. నష్ట పరిహారం విషయంలో రాష్ట్రంలో సరైన విధానం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నగర మేయర్ విజయలక్ష్మి మాత్రం బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం కంటే కుక్కల నుంచి కాపాడుకోడానికి తల్లిదండ్రులు, పిల్లలు అప్రమత్తంగా ఉండటమే శ్రీరామరక్ష అంటున్నారు.

'కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం'- రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశం

Telangana Dog Bite Cases : దేశంలో కుక్కకాట్లు నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండటం శోచనీయం. దేశంలో నిమిషానికి 6 కుక్కకాటు కేసులు నమోదవుతుండగా రోజుకు 8 వేల 151 కేసులు అవుతున్నట్లు తేలింది. ఈ సంఖ్య గడిచిన మూడేళ్లలో రెట్టింపైంది. 2023 జనవరి, అక్టోబర్ మధ్య దేశంలో 24.7 లక్షల కుక్క కాటు కేసులు నమోదైనట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి స్వయంగా పార్లమెంటులో ప్రకటించారు. ఐతే అందులో బాధితులకు ఏ మేరకు పరిహారం అందుతుందనేది ప్రశ్నార్థకరంగా మారింది.

Dog Bites in Hyderabad : వీధి కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో గతేడాది హరియాణ -పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని సూచించింది. కుక్కకాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు 10 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్కకాటు ఘటనలో 0.2 సెంటీమీటర్ల కోత పడితే బాధితులకు 20 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ప్రాణ నష్టం జరిగితే 5 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. అటు కర్ణాటకలో కుక్కకాటు కేసులను సమీక్షించడానికి, కుక్కకాటుకు గురైన వ్యక్తులకు పరిహారం అందించడానికి అక్కడి పట్టణాభివృద్ధి శాఖ పట్టణ, స్థానిక సంస్థలతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా 48 గంటల్లో బాధితులకు పరిహారం మొత్తాన్ని అందిస్తున్నారు.

GHMC Negligence Over Street Dogs Attack : దేశంలోని ఆయా రాష్ట్రాల్లో కుక్కకాట్ల బాధితులకు నష్ట పరిహారం అందిస్తుండగా జీహెచ్‌ఎంసీలో మాత్రం నష్టపరిహారం అనేదే కనిపించడం లేదు. నష్టపరిహారం దేవుడెరుగు ఇక్కడి అధికారులు ఫిర్యాదులే పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పొట్టకూటి కోసం నగరానికి వచ్చే వారి పిల్లలు కుక్కకాటుకు గురైతే వారి బాధ వర్ణాణాతీతం. బాధితుల్లో వారే అధిక సంఖ్యలో ఉంటున్నారు. ప్రభుత్వం గాని జీహెచ్‌ఎంసీ గానీ నష్టపరిహారం అందిస్తే బాధితులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే ఈ సమస్యపై స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించడంతోపాటు బాధితులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఒంటరిగా కనిపిస్తే బలి - పెరిగిపోతున్న వీధికుక్కల కాట్లు

కుక్క కరిచిందా - ఇలా చేయకపోతే మీకు ప్రాణాపాయం తప్పదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.