ETV Bharat / state

'సంతానలేమికి కోడల్ని నిందించడం ఆపండి - లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు - దానికి మీరు కూడా కారణం కావొచ్చు' - Infertility Reasons in Male - INFERTILITY REASONS IN MALE

Gene On X Chromosome Role in Male Fertility : సంతానలేమికి అమ్మాయిలే కాదు అబ్బాయిల్లోనూ లోపం ఉండొచ్చు అంటున్నారు సీసీఎంబీ పరిశోధకులు. పురుషుల్లో వీర్య కణ అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు (టీఈఎక్స్13బి) అవసరమని మొదటిసారిగా సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. తల్లి నుంచే ఇది బిడ్డలకు సంక్రమిస్తుందని పేర్కొన్నారు.

Gene On X Chromosome Role in Male Fertility
Infertility Reasons in Male (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 1:46 PM IST

Infertility Reasons in Male : సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు ఇప్పటి నుంచి అలా అనడం మానేయాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు, దానికి మీరు కూడా కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. పురుషుల్లో సంతానలేమిపై ఈ సంస్థ తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలను గుర్తించి వివరించారు. పురుషుల్లో వీర్య కణ అభివృద్ధికి ఎక్స్ క్రోమోజోమ్ జన్యువు (టీఈఎక్స్13బి) అవసరమని మొదటిసారిగా సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. తల్లి నుంచే ఇది బిడ్డలకు సంక్రమిస్తుందని పేర్కొన్నారు. వేర్వేరు సంస్థలతో కలిసి సీసీఎంబీ ప్రధాన సైంటిస్టు డాక్టర్ తంగరాజ్, డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ స్వస్తిరాయ్ చౌధరి చేసిన పరిశోధన వివరాలు తాజాగా హ్యూమన్ రీప్రొడక్షన్ జర్నర్​ళో వెల్లడయ్యాయి. దాంట్లోని వివరాలు..

  • TEX13b Gene Leading to Infertility In Male : శాస్త్రవేత్తల బృందం నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఉపయోగించి సంతానం ఉన్న, సంతానలేమితో బాధపడుతున్న పురుషుల జన్యు కోడింగ్ రీజియన్లను విశ్లేషించింది. టీఈఎక్స్13బి జన్యువులోని రెండు కారణాలు ఉత్పరివర్తనాలను కనుక్కొని ఈ మేరకు ఫలితాలను రాబట్టినట్లు పీహెచ్​డీ విద్యార్థి, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ పోస్ట్​డాక్టొరల్ రీసెర్చర్ డాక్టర్ ఉమేశ్​కుమార్ వివరించారు.

పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలకు కారణాలేంటి? ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి?

  • పరిశోధకులు ఎలుకల్లో స్పెర్మ్‌ ఉత్పత్తి కణాల సెల్‌ కల్చర్‌ మోడల్‌ను అభివృద్ధి చేసి క్రిస్పర్‌ కాస్‌9 సాంకేతికత ఉపయోగించి టీఈఎక్స్‌13బి జన్యువును తొలగించి చూశారు. అప్పుడు స్పెర్మ్‌ కణాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు గుర్తించినట్లు తెలిపారు.
  • స్పెర్మ్‌ ఉత్పత్తి కణాల్లో జీవక్రియను టీఈఎక్స్‌13బి ప్రభావితం చేస్తుందని నిర్ధారించుకున్నారు. స్పెర్మాటోజెనిక్‌ కారణంగా సంతానలేమితో బాధపడుతున్న మగవారిని పరీక్షించడానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ నందికూరి చెప్పారు. ‘టీఈఎక్స్‌13బి జన్యువు ఎక్స్‌ క్రోమోజోమ్‌లో ఉంటుందని తల్లుల నుంచి మగవారు దీన్ని పొందుతారని తెలిపారు. ఒకవేళ తల్లి లోపభూయిష్ట ‘టీఈఎక్స్‌13బి’ని కలిగి ఉంటే అది వారి మగ సంతానానికి సంక్రమిస్తుందని వివరించారు. ఆమె తనయుడు వంధ్యత్వానికి గురవుతాడు’ అని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు.

అధిక బరువు ఉన్న మహిళలకు పిల్లలు పుట్టరా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

సంతానలేమికి మగవారూ కారకులే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.