Ganja Peddler Neetu Bai Case Updates : హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న కేసులో అరెస్టైన నీతూబాయిపై (Ganja Seller Neetu Bai) పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సాదాసీదా కిరాణ దుకాణం నిర్వహించే ఆమె బ్యాంకు ఖాతాల్లో రూ.1.63 కోట్ల నగదు, హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన స్థిరాస్థులు ఉన్నాయని టీఎస్ న్యాబ్ పోలీసులు గుర్తించారు. గంజాయి అమ్ముతూ నీతూబాయి కుటుంబం ఎనిమిదేళ్లలో ఇలా సంపాదించినట్లు నిర్ధారించారు.
Nanakramguda Ganja Case Updates : గతంలో నీతూబాయిపై పీడీ చట్టం ప్రయోగించి ఏడాది పాటు జైళ్లో ఉంచినా విడుదలైన అనంతరం మళ్లీ దందా కొనసాగిస్తుండటం పోలీసులను విస్తుపోయేలా చేసింది. బుధవారం రోజున పోలీసుల డెకాయ్ ఆపరేషన్‌లో నీతూబాయి, ఆమె భర్త మున్నుసింగ్(53), సమీప బంధువులు సురేఖ(38), మమత (50)తోపాటు 13 మంది గంజాయి (Ganja Smuggling in Telangana) వినియోగదారులు వెరసి మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి, నానక్‌రాంగూడకు చెందిన నేహాబాయి, గౌతమ్‌సింగ్ పరారీలో ఉన్నారు. అరెస్టైన వారి నుంచి 22.6 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ.22.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పేర్కొన్నారు.
చీకటి దందాతో విలాస జీవనం : తేలిగ్గా డబ్బు సంపాందించేందుకు నీతూబాయి, మున్నుసింగ్, ఇతర కుటుంబసభ్యులు గంజాయి విక్రయాలు మొదలుపెట్టారు. ధూల్‌పేటకు చెందిన అంగూరిబాయి నుంచి కిలో గంజాయి రూ.8,000 చొప్పున కొనేవారు. దానిని 5 గ్రాముల చొప్పున చిన్న పొట్లాల్లో నింపి రూ.500కు అమ్మేవారు. అలా కిలో గంజాయి విక్రయాలతో రూ.50,000ల వంతు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో అంతా విలాసవంత జీవితాన్ని గడుపుతున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్లు, స్థిర, చరాస్థులు కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఆగస్ట్‌లో నీతూబాయి కుటుంబ నేపథ్యాన్ని పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రూ.4 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. వాటిని ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమె గంజాయి విక్రయాలు చేస్తూనే ఉంది.
మరో నైజీరియన్ గ్యాంగ్ అరెస్ట్ - రూ.8కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఇప్పటికే 18 కేసులు : మరోవైపు నీతూబాయిపై తొలుత 2017లో శేరిలింగంపల్లి ఎక్సైజ్ విభాగం కేసు నమోదు చేసింది. అది మొదలు 2021 సెప్టెంబర్ వరకు ఆమెపై 12 కేసులు నమోదు కావడంతో పీడీ చట్టం ప్రయోగించారు. ఏడాది అనంతరం జైలు నుంచి తిరిగి వచ్చిన రెండు నెలలకే మరోసారి గంజాయి విక్రయిస్తూ చిక్కింది. అలా గతేడాది అక్టోబర్ 25 వరకు మరో ఆరు కేసులు నమోదయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నీతూబాయిపై మరోసారి పీడీ చట్టం ప్రయోగించేందుకు హైదరాబాద్ పోలీసులు నివేదిక రూపొందించారు.
శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి
కిరాణా దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు - ముఠాల ఆట కట్టించిన పోలీసులు