ETV Bharat / state

హైదరాబాద్​లో గంజాయి చాకెట్ల స్మగ్లింగ్ - ఆరుగురు అరెస్ట్‌ - Ganja Chocolates in Hyderabad

Ganja Gang Arrest In Hyderabad : రాష్ట్రంలో గంజాయి అనే మాట వినపడకూడదన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సోదాల్లో రోజుకు ఎక్కడో ఒకచోట ఆ మత్తు పట్టుబడుతూనే ఉంది. ఇప్పటివరకు కేవలం సరకు మాత్రమే విక్రయించగా ఇప్పడు గంజాయి చాకెట్లు పట్టుబడుతున్నాయి. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నా చాపకింద నీరులా విక్రయాలు జరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Ganja Chocolates in Hyderabad
Ganja Gang Arrest in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 10:21 AM IST

హైదరాబాద్​లో గంజాయి చాకెట్ల కలకలం - ఆరుగురి అరెస్ట్‌

Ganja Gang Arrest In Hyderabad : కొరియర్‌ సర్వీస్‌ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గంజాయి చాక్లెట్లు తెప్పించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న పాన్‌డబ్బా యజమానిని టీఎస్ న్యాబ్‌ పోలీసులు నానక్‌రాంగూడలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 2.8 కిలోల బరువున్న 560 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అసోంకి చెందిన హిలాలుద్దీన్‌ మజుందార్‌ మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి నానక్‌రాంగూడలో పాన్‌ దుకాణాల్లో పనిచేశాడు. రెండేళ్ల క్రితం సొంతంగా కావూరీ కపిల్‌ హబ్‌ దగ్గర హిలాలుద్దీన్‌ పేరిట దుకాణం ఏర్పాటు చేశాడు.

Ganja Chocolates In Hyderabad : మజుందార్‌ యూపీలోని లఖ్‌నవూకు చెందిన బిపిన్‌ అనే వ్యక్తి ద్వారా గంజాయి చాక్లెట్లు తెప్పించేవాడు. బాగా పరిచయం ఉన్నవారికి మాత్రమే విక్రయించేవాడు. గత కొన్ని రోజులుగా ఆ దందాపై నిఘా ఉంచిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌ కోకాపేట వద్ద గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని ఒడిశాకు చెందిన సౌమ్యారాజన్‌గా గుర్తించారు. అతడి నుంచి 4 కిలోల బరువున్న గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓఅపార్ట్‌మెంట్‌లో కార్మికులకు విక్రయిస్తుండగా సౌమ్యారాజన్‌ని వలపన్ని పట్టుకున్నారు.

శంకర్​పల్లిలో 44 కేజీల గంజాయి స్వాధీనం - నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ganja Chocolates In Khammam : హైదరాబాద్ తరహాలో ఖమ్మంలోనూ గంజాయి చాక్లెట్లు గుట్టురట్టయ్యాయి.కాల్వొడ్డు ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్న ఇద్దరిని ఆబ్కారీశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లు సహా మరి కొంత సరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ ప్రాంతం నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

Ganja Gang Arrest In Sangareddy : సంగారెడ్డి జిల్లాలో గంజాయి తరలిస్తున్న అజయ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏపీలోని కాకినాడ నుంచి కర్ణాటక గుల్బర్గాకు అజయ్ గంజాయి తీసుకెళ్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి రామచంద్రాపురం బస్టాండ్‌ సమీపంలో పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలో ఒక్క కిలో రూ. 2వేల 500కి కొనుగోలు చేసి కర్ణాటకలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.సరకు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కిలో గంజాయి విక్రస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. సాయిలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి కిలో 190 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఖమ్మంలో గంజాయి చాక్లెట్ల కలకలం - ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు

కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్ల అమ్మకం - ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.