Ganganamma Decorated with Currency of RS.2.30 Crores in Eluru District : రాష్ట్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువైన శ్రీ గంగానమ్మ అమ్మవారు రూ.2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆరో రోజు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా గంగానమ్మ విగ్రహం చుట్టూ నోట్ల కట్టలు, కాయిన్స్ ఉంచారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శోభ - Dasara Celebrationson Indrakeeladri
విద్యుత్తు కాంతుల్లో ఇంద్రకీలాద్రి - తుది దశకు చేరిన దసరా ఏర్పాట్లు - Dasara Sharan Navaratri 2024