Not Allowing Ganesh Immersion in Hussain Sagar : హైదరాబాద్ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్, జీహెచ్‌ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో వేయకుండా ట్యాంక్‌బండ్ చుట్టూ ఇనుప కంచెలతో భారీ గేట్లు ఏర్పాట్లు చేశారు. మరో పక్క ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినా, అమలు చేయట్లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ వేశారు. ఈ మేరకు హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్, హుస్సేన్‌సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అని పిటిషన్లో పేర్కొన్నారు.