Digital Arrest In Vijayawada : మనీలాండరింగ్ కేసులో పట్టుబడిన ఒక నేరగాడి వద్ద గుర్తింపు కార్డు దొరికిందంటూ వృద్ధుడిని అరెస్టు చేస్తున్నామంటూ బెదిరించి మరీ రూ.60లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. రెండు నెలల క్రితం ఈ ఘటన జరగింది. అయితే తాజాగా వృద్ధుడు మాత్రం సైబర్ క్రైం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయడం గమనార్హం. వాసవ్యనగర్‌కు చెందిన వృద్ధుడు (84) అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. అక్టోబరు 3న ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్ చేసి ముంబయి సైబర్ క్రైం పోలీసుస్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. తరువాత అతని ఆధార్ కార్డు వివరాలను సేకరించి ఆ సమాచారాన్ని నరేష్ గోయా అనే మనీ లాండరింగ్ కేసు నిందితుడి ఇంట్లో దొరికిందని అతన్ని భయపెట్టాడు. ఈ కేసులో త్వరలో అరెస్టు చేస్తామని దీనిపై వారెంట్ కూడా ఇచ్చామని తెలిపాడు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే రూ.60లక్షలు చెల్లించాలనడంతో వృద్ధుడు భయాందోళనలకు గురయ్యాడు.
హరియాణాకు నగదు బదిలీ.. తరువాత వృద్ధుడికి ఓ బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి దానికి డబ్బులు పంపించాలన్నారు. అక్టోబరు 5న బ్యాంకుకి వెళ్లిన వృద్ధుడు నిందితుడు చెప్పిన అకౌంటుకు రూ.60లక్షలు పంపారు. ఆ నగదు హరియాణా రాష్ట్రంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఖాతాకు వెళ్లినట్లు తేలింది. దీనిపై ఆ వృద్ధుడు తాజాగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
విశ్రాంత ఉద్యోగిని బెదిరించి రూ.1.4 కోట్లు కాజేశారు!
డిజిటల్ మోసాలకు ఆ మూడు దేశాలే ప్రధాన కేంద్రాలు- రూ.120కోట్లు నష్టపోయిన భారతీయులు