ETV Bharat / state

వాటర్ మీటర్ చెడిపోయిందా - జేబు గుళ్ల కావాల్సిందే! - గ్రేటర్​లో ఉచిత జలాల్లో సిబ్బంది చేతివాటం - Water Meter Problems in Greater Hyd

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 12:02 PM IST

Free Drinking Water Supply Scheme in GHMC : గ్రేటర్​లో ఉచిత జలాలకు కష్టకాలం తప్పడం లేదు. ఎందుకంటే నల్లా మీటరు పాడైపోతే కొత్తది పెట్టించుకునేందుకు జలమండలి సిబ్బంది భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. దీనిపై గ్రేటర్​ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూనే, తప్పని పరిస్థితుల్లో డబ్బులు ఇస్తున్నారు.

Free Drinking Water Supply Scheme in GHMC
Free Drinking Water Supply Scheme in GHMC (ETV Bharat)

Water Meter Problems in Greater Hyderabad : గ్రేటర్​లో ఉచిత నీటి పథకానికి తిప్పలు తప్పడం లేదు. నల్లా మీటరు పెట్టుకున్న నల్లాదారుడికి జలమండలి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఉచిత నీటి పథకం వర్తించదని తెగేసి చెబుతున్నారు. వారు చెప్పిందే ఫైనల్​ రేటుగా జలమండలి సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారు. మీటరు ధర విషయంలో బహిరంగ మార్కెట్​ కంటే మూడు రెట్లు ఉండటం గమనార్హం. గ్రేటర్​లో చాలామంది వినియోగదారులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా గ్రేటర్​లో ఉచిత నీటి పథకం వర్తించాలంటే ప్రతి నల్లాదారుడు తన ఆధార్​ నంబర్​ను కస్టమర్​ అకౌంట్​ నంబర్​కు అనుసంధానం చేయాలి. అలాగే తప్పనిసరిగా నల్లాకు పెట్టిన మీటరు పని చేస్తూ ఉండాలి. ఇక్కడే కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే చాలా మీటర్లు రిపేర్లు కావడం, పాడైపోవడంతో కొత్తవి అవసరం అవుతున్నాయి. మీటరు పాడైనా, కొత్త మీటరు పెట్టుకోవాలన్నా జలమండలి గతంలో 15 కంపెనీలను ఎం-ఫ్యానల్​ చేసింది. వాటి నుంచే కొనుగోలు జరగాలని సూచించింది. ఇక్కడే ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఈ కంపెనీల మీటర్లు ఎక్కడ దొరకుతాయో చాలా మంది వినియోదారులకు తెలియడం లేదు.

మీటర్లకు భారీ మొత్తంలో వసూళ్లు : ఈ సమస్యనే కొందరు జలమండలి శాఖ సిబ్బంది అనుకూలంగా తీసుకొని అర అంగుళం నల్లా కలెక్షన్​కు రూ.3 వేల వరకు మీటరు ధర ఉండగా, దాని కోసం సిబ్బంది రూ.6 నుంచి రూ.7 వేలు తీసుకుంటున్నారు. అదే బహుళ అంతస్థుల భవనాలకు అమర్చే ఏఎంఆర్​ మీటర్లకు రూ.20 - రూ.30 వేల వరకు మార్కెట్​లో ధర ఉండగా, కొందరు సిబ్బంది రూ.50 వేల పైనే డిమాండ్​ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ నల్లాదారుడు నల్లా బహిరంగ మార్కెట్​లో కొని వేసుకున్నా రీడింగ్​ తీయడానికి వచ్చే సిబ్బంది ఎన్నో కొర్రీలు పెడుతున్నారు. ఉచిత పథకం నుంచి మినహాయిస్తామని చెప్పి వినియోదారులకు షాక్​లు ఇస్తున్నారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

మూలకు చేరిన 12 వేల ఏఎంఆర్​ మీటర్లు : గతంలో జలమండలి కోట్లు ఖర్చు పెట్టి ఆటోమేటిక్​ నీటి మీటర్లు కొనుగోలు చేసింది. వీటిలో 12 వేల మీటర్లు పాడైపోయాయి. ఈ లెక్కలు జలమండలి వేసింది. అప్పట్లో కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం మీటర్లను కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో మీటర్​ను రూ.30 వేల నుంచి లక్షలోనే కొనుగోలు చేసి సరఫరా చేసింది. ఆతర్వాత ఈ డబ్బులను నల్లాదారుల నుంచి వసూలు చేసింది. ప్రస్తుతం చాలా మీటర్లు పాడైపోవడంతో జలమండలి సిబ్బంది దృష్టికి తీసుకువస్తున్నారు. కానీ వారు ఇదే అదనుగా భావించి భారీ మొత్తంలో వినియోదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఉచిత మంచినీటి పథకం నిలిచిపోనుండడంతో వేరే దారి లేక నల్లాదారులు డబ్బులు కడుతున్నారు.

Free Water Scheme: ఉచిత నీటి సరఫరా పథకం అమల్లో అవస్థలు.. వేలల్లో బిల్లులు

Water Pipe Line Burst in Hyderabad : పైప్ లైన్ లీక్.. పాతాళగంగలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.