ETV Bharat / state

నవంబర్​ నుంచి రేషన్​ దుకాణాల్లో బియ్యంతో పాటు ఆ 3 వస్తువులు - అస్సలు మిస్సవకండి - WHITE RATION CARD 4 GOODS

తెల్లరేషన్​ కార్డు ఉన్న ప్రతి ఒక్క కార్డు హోల్డర్​కు గుడ్​ న్యూస్ - నవంబర్ నుంచి 4 నిత్యావసర వస్తువులు

White Ration Card Benefits
White Ration Card Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 10:11 PM IST

Updated : Oct 31, 2024, 12:32 PM IST

White Ration Card Benefits in AP : తెల్లరేషన్​ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్​లోని కూటమి ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. నవంబర్ నెల నుంచి 4 రకాల సరకులను చౌక ధరల దుకాణాల ద్వారా అందించనుంది. కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఎంఎల్​ఎస్​ పాయింట్లకు కందిపప్పు చేరింది. ఈ పంపిణీని కచ్చితమైన తూకాలతో, నాణ్యమైన సరకు సరఫరా చేసే గుత్తేదారులకు మాత్రమే బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే అక్టోబరు నెలలో 50 శాతానికి పైగా కార్డుదారులకు కందిపప్పును పంపిణీ చేశారు. నవంబరు నెలలో ప్రతి కుటుంబానికి నాలుగు వస్తువులు అందించేలా పౌర సరఫరాల సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చౌక ధరల దుకాణాలకు ఇప్పటికే రేషన్​ సరకులు జోరుగా చేరుతున్నాయి.

బియ్యానికి బదులు జొన్నలు : నవంబరులో కార్డుదారులకు 4 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. ఇందులో బియ్యం బదులు జొన్నలు చౌకధరల దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి కార్డుదారుడికి 3 కిలోల చొప్పున ఇవ్వనున్నారు. ఇందుకు నాణ్యమైన జొన్నలను డీలర్లకు అందించనున్నారు. కానీ 35 శాతానికి పైగా డీలర్లు జొన్నలు తీసుకెళ్లడం లేదని, డీలర్లు సరకులన్నింటినీ దుకాణాలకు తీసుకెళ్లేలా పౌర సరఫరాల అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా, పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కిలో కందిపప్పు రూ.67 మాత్రమే : నవంబర్ నుంచి కిలో కందిపప్పు రూ.67కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 12.18 లక్షల మంది కార్డుదారులు ఉండగా, 9.85 లక్షల మందికి కందిపప్పు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఇక డీలర్లు డీడీలు చెల్లించి సరకు తీసుకెళ్లాల్సి ఉంది. పంచదార ఏఏవై కార్డుదారులకు కిలో రూ.14లకు ఇవ్వగా, మిగిలిన కార్డుదారులకు అర కిలో రూ.17 చొప్పున అందించనున్నారు.

పేదలకు పప్పన్నం దూరం చేసిన వైఎస్సార్​సీపీ : బహిరంగ మార్కెట్​లో పప్పుధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పేదలకు కందిపప్పు అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా గత ప్రభుత్వం చేతులెత్తేసింది. పేదలకు పప్పన్నం దూరం చేసింది. కిలో కంది పప్పు రూ.160-180 వరకు పలుకుతోంది. దీంతో పేదలు తినే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కందిపప్పును రూ.67కు అందించాలని నిర్ణయించింది.

ఇప్పుడిక 'బియ్యం' వంతు.. కొనలేం.. తినలేం..

kitchen Budget Increased వంటింట్లో ధరల మంట సగటున నెలకు రూ.2000 పైనే

Last Updated : Oct 31, 2024, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.