Formula E Race Issue in Hyderabad : హైదరాబాద్‌లో ఈ-ప్రిక్స్ (ఫార్ములా-ఈ) కార్యక్రమ నిర్వహణ బాధ్యత హెచ్‌ఎండీఏ తీసుకోవాలని అప్పటి పూరపాలకశాఖ మంత్రి ఫోన్ చేసి ఆదేశాలిచ్చారని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన అర్వింద్‌కుమార్ ప్రభుత్వానికి నివేదించారు. ఫార్ములా-ఈ సీజన్-10 హైదరాబాద్‌లో నిర్వహించడంపై ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్థ(ఎఫ్‌ఈవో) ప్రాథమిక క్యాలెండర్‌లో పొందుపరచనప్పటికీ మంత్రి స్వయంగా ఆ సంస్థ చీఫ్ ఛాంపియన్‌షిప్ అధికారి ఆల్బర్టో లాంగోతో మాట్లాడి ఒప్పించారని తెలిపారు. ఈవెంట్ నిర్వహణకు ప్రమోటర్లు, స్పాన్సర్ల ఖరారు కాక ముందే హెచ్‌ఎండీఏ ఆతిథ్యమివ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఈ-రేస్ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చెప్పండి - అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు
IAS Arvind Kumar On Formula E Race Issue in Hyd : ఈ మేరకు ఎఫ్‌ఈవో సంస్థతో ఒప్పంద పత్రాలపై ప్రమోటర్, ఆతిథ్య నగర హోదాలో సంతకాలు చేశామని, తొలివిడత కింద రూ.45 కోట్లతోపాటు పన్నులు కూడా చెల్లించామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీనా షెడ్యూలు చేసిన ఈ-ప్రిక్స్ సీజన్-10కు రూ.100 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు వివరించారు. ఈ మేరకు ఫార్ములా-ఈ కార్యక్రమానికి జరిగిన ఒప్పందాలు, చెల్లింపులతో కూడిన వివరాలు వెల్లడిస్తూ డిసెంబరు 14న అర్వింద్‌కుమార్ సీఎం ముఖ్యకార్యదర్శికి సమాచారం అందించారి. తాజాగా దానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదు: భట్టి విక్రమార్క
- నగరంలో 9, 10, 11, 12 సీజన్లకు సంబంధించి ఫార్ములా-ఈ ఈవెంట్ నిర్వహించేందుకు 2022 అక్టోబరు 25న ఫార్ములా ఎఫ్‌ఈవో, ఏస్ నెక్స్ట్‌జెన్ ప్రైవేటు లిమిటెడ్(ప్రమోటర్)తో కలిసి పురపాలకశాఖ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది.
- ఇందులో భాగంగా 2023 ఫిబ్రవరిలో జరిగిన సీజన్-9కు అవసరమైనంత సహకారం ప్రభుత్వం అందించింది. ఈ ఒప్పందంలో ప్రమోటర్‌గా ఉన్న ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థ ఎఫ్‌ఈవోకు రూ.90 కోట్లు ఫీజుల రూపంలో వెచ్చించింది. ఈ కార్యక్రమానికి మొత్తం రూ.150 కోట్లు ఖర్చు కాగా ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు చేసింది.
- సీజన్-10 ఆతిథ్య నగరాల జాబితాలో హైదరాబాద్ లేనప్పటికీ మంత్రి చొరవ తీసుకొని ఆ కార్యక్రమానికి చోటు కల్పించారు. ఈ మేరకు ఫోన్ చేసి మాకు సమాచారం చెప్పారు. అందులో భాగంగానే ఒప్పందంపై సంతకాలు చేశాం.
- ఈవెంట్ ఖర్చులతోపాటు ప్రమోటర్ నిర్వహించాల్సిన అన్ని బాధ్యతలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
- ఆ తరువాత ఎఫ్‌ఈవో సంస్థ 2023 అక్టోబరులో ప్రమోటర్ అయిన ఏస్ నెక్స్ట్‌జెన్‌ను తొలగించడంతోపాటు ప్రభుత్వంతో 2022లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ మేరకు దీనికి సంబంధించిన సమాచారం పురపాలకశాఖకు పంపించింది.
- దీంతో 2024 ఈ-ప్రిక్స్ నిర్వహణ కోసం 2023 అక్టోబరులో హెచ్‌ఎండీఏకు నోడల్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాం.
- ఈ ఈవెంట్ కోసం ఎఫ్‌ఈవో సంస్థకు రూ.90 కోట్లతోపాటు పన్నులు వెచ్చించాల్సింది ఉండగా పురపాలకశాఖ మంత్రి ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ రూ.45 కోట్లు చెల్లించింది.
- ఎఫ్‌ఈవోతో ఒప్పందం మేరకు బకాయి నిధులు చెల్లించడంతోపాటు ట్రాక్ డిజైన్, నిర్మాణం, రోడ్‌వే ఏర్పాట్లు, డిజైన్లు, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, ఆతిథ్యం, ప్రకటనలు, పురపాలక సేవలు, అనుమతులు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలన్నీ ప్రభుత్వమే చూసుకోవాలి.
- సీజన్-10 నిర్వహణకు మొత్తం రూ.100 కోట్లు ఖర్చవుతుందని హెచ్‌ఎండీఏ అంచనా వేసిందన్నారు.
- స్థానిక, అంతర్జాతీయ స్పాన్సర్లను కలిసి నిర్వహణ ఖర్చు రాబట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అదనపు వ్యయాలన్నీ హెచ్‌ఎండీఏ భరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి’’ అని తెలిపారు.
హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్ రద్దు - కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Season 10 Formula-E Race : సాగర్ తీరాన.. మళ్లీ రయ్ రయ్.. ఫార్ములా-ఈ రేస్ సీజన్ 10