ETV Bharat / state

మరుపిళ్ల భూదానాలు చేస్తే కొంతమంది భూ కబ్జా చేస్తున్నారు: పోతిన వెంకట మహేష్ - Janasena Coordinator Pothina Mahesh

Former MLA Marupilla Chitti Statue Inauguration in Vijayawada: స్వాతంత్య్ర సమరయోధుడు మాజీ శాసనసభ్యులు సర్దార్ మరుపిళ్ళ చిట్టి కాంస్య విగ్రహాన్ని అవినీతిపరులు, జూద క్రీడలు నిర్వహించి యువత, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుకీడ్చిన నాయకులు ప్రారంభోత్సవం చేయడం దారుణం అని పోతిన వెంకట మహేష్ తీవ్ర వ్యాఖ్యానించారు. మరుపిళ్ళ చిట్టి ప్రాంత అభివృద్ధి, ఉద్యోగాల కోసం భూమిని దానం చేస్తే కొంతమంది ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని విమర్శించారు.

Former_MLA_Marupilla_Chitti_Statue_Inauguration_in_Vijayawada

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 7:24 PM IST

Former MLA Marupilla Chitti Statue Inauguration in Vijayawada: స్వాతంత్య్ర సమరయోధుడు మాజీ శాసనసభ్యులు సర్దార్ మరుపిళ్ళ చిట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సభ రసాభాసగా సాగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్లో స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ మరుపిళ్ళ చిట్టి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం ఆధ్వర్యంలో చిట్టినగర్ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మి, వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్​తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త పోతిన వెంకట మహేష్​ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహేష్ వైసీపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్

Janasena Vijayawada West Constituency Coordinator Pothina Venkata Mahesh Comments: విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న మిల్క్ ప్రాజెక్టుకు 25 ఎకరాల స్థలదాత సర్దార్ మరుపిళ్ళ చిట్టి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అవినీతిపరులు, జూద క్రీడలు ఆడించి యువత, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డుకి ఇచ్చిన వైసీపీ నాయకులు ప్రారంభోత్సవం చేయడం దారుణం అని పోతిన వెంకట మహేష్ విమర్శలు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల సమావేశం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ వైసీపీ అవినీతి, అరాచకాలు గమనించి రాబోయే ఎన్నికల్లో వీరందరికీ తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ విమర్శించారు.

మరుపిళ్ల భూదానాలు చేస్తే కొంతమంది భూ కబ్జా చేస్తున్నారు: పోతిన వెంకట మహేష్

"రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై, పేద, సామాజిక వర్గాల వారికి ఇళ్ల పట్టాల ఇప్పించిన వ్యక్తి మరుపిళ్ళ చిట్టి . ప్రజలకు అద్బుత సేవలు చేసిన వ్యక్తి స్పూర్తిని ఎవరూ ఆచరణలో పెట్టడం లేదు. చిట్టి భూదానాలు చేస్తే కొంతమంది భూ కబ్జా చేస్తున్నారు. మరుపిళ్ళ చిట్టి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ప్రజలకు లబ్ధి చేకూరిస్తే, కొంతమంది ట్యాంక్ నిర్మించి 15 సంవత్సరాలైనా ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదు పైగా నాసిరకమైన నిర్మాణాలు చేపట్టారు." - పోతిన వెంకట మహేష్, జనసేన పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త

వైసీపీకి గడ్డు రోజులు రాబోతున్నాయి - ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది : ఎమ్మెల్సీ అనూరాధ

విగ్రహావిష్కరణ అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీని తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ క్రమంలో జనసేన నాయకులు పోతిన మహేష్ కార్యకర్తలను వారించడంతో గొడవ సద్దుమణిగింది.

Potina Mahesh: "నవరత్నాల వల్ల.. ఏ ఒక్క సామాన్యుడి జీవితమైనా మారిందా"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.