ETV Bharat / state

'మూగజీవాల సంరక్షణపై నిర్లక్ష్యం వహించడం శోచనీయం' - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ - Harish Letter to CM Revanth

Harish Rao on Veterinary Services : మూగజీవాల సంరక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం శోచనీయమని మాజీమంత్రి హరీశ్​రావు ఉద్ఘాటించారు. ఈ మేరకు సీఎం రేవంత్​కు పశువైద్యశాలల్లో మందుల కొరతపై లేఖ రాశారు. సకాలంలో వైద్యం అందక పశువులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 3:11 PM IST

Harish Rao on Veterinary Medicine Shortage :
Harish Rao on Veterinary Services (ETV Bharat)

Harish Rao on Veterinary Medicine Shortage : మూగజీవుల మౌనరోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యానించారు. మూగజీవాల సంరక్షణపై నిర్లక్ష్యం వహించడం శోచనీయమని పేర్కొన్నారు. పశువైద్యశాలల్లో 9 నెలలుగా మందుల కొరత ఉందని తెలిపారు. సకాలంలో వైద్యం అందక పశువులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి పశువైద్యశాలల్లో మందుల కొరతపై ఆయన లేఖ రాశారు. పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయంపై ఆ లేఖలో వివరించారు.

వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని లేఖలో హరీశ్​రావు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ కూడా సీఎం రేవంత్​ వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌనరోదనను మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా తొమ్మిది నెలలుగా నిలిచిపోయిందని మండిపడ్డారు.

మందుల కొరత కారణంగా మూగజీవాలు మృత్యువాత : పాలిచ్చే జీవులకు పొదుగు వాపు, గాలి కుంటు వ్యాధులు సోకితే ఒక్కో మూగ జీవిపై పాడి రైతులు రూ.2 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నదని హరీశ్​రావు వాపోయారు. ఇది వారికి అదనపు ఆర్థిక భారమవుతున్నదని పేర్కొన్నారు. 9 నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు భాగాల్లో పరాన్న జీవులు చేరి రక్తహీనతకు గురి చేస్తున్నాయని తెలిపారు. దీని వల్ల రోగ నిరోధకశక్తి తగ్గి మూగజీవాలు బలహీనంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వ్యాధుల బారిన పడ్డ జీవులు ఆసుపత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో మూగజీవాలకు చికిత్స అందించలేకపోతున్నామని, తప్పనిసరి పరిస్థితిలో మందులు బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నట్లు వెటర్నరీ డాక్టర్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్​రావు తెలిపారు. అనారోగ్యం పాలైన మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకుగాను 1962 నంబర్​తో పశువైద్య సంచార వాహనాలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మంత్రులుగాని, ఉన్నతాధికారులు గానీ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం మూగజీవుల సంరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తున్నదని మండిపడ్డారు.

విషజ్వరాలతో జనం చనిపోతున్నా - ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు : హరీశ్​ రావు - HARISH RAO ON DENGUE DEATHS

సమస్యల వలయంలో గురుకులాలు - సత్వరమే సర్కార్​ స్పందించాలని హరీశ్​రావు డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.